కళ్ళకి కాటుక ప్రమాదకరమా?!
కాటుక అనారోగ్యాలకు దారితీయగలదని నీతి ఆయోగ్ స్వయంగా చెప్పింది . ఇది నిజంగానే ప్రమాదం . ఒకప్పుడు కళ్ళు అందంగా కనిపిస్తాయి.. వాటిల్లోకి చేరిన దుమ్ము పోతుంది కళ్ల ఆరోగ్యానికి మంచిదని కాటుక పెట్టేవారు. వాటిని స్వయంగా ఇళ్లల్లోనే స్వచ్ఛమైన ఆముదం, నెయ్యితో తయారుచేసేవారు. మనం ఇప్పుడు వాడేవన్నీ కమర్షియల్ కాటుకలే. వాటిల్లో వాడే లెడ్, నిల్వ ఉండటానికి ఉపయోగించే పారాబెన్స్, భారలోహాలతో సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. లెడ్ శరీరంలో ఇంకి మెదడు, ఎముకలపై దుష్ప్రభావం చూపు తుంది. రక్తహీనతకి దారితీస్తుంది.
కింది కనురెప్పల్లో నూనెగ్రంథులు ఉంటాయి. ఇవి నీటిని విడుదల చేసి, కళ్లకు తేమ అందేలా చేస్తాయి. మనం రసాయనాలతో కూడిన కాటుక రాయడం వల్ల అవి తెరుచుకోవు. దీంతో తగినంత తేమ అందక కళ్లు పొడిబా రతాయి. కంటికి అలర్జీలు, గ్లకోమా, కార్ని యల్ అల్సర్లు వంటివి వస్తాయి. పిల్లల్లో రిస్క్ మరీ ఎక్కువ. నాడీవ్యవస్థపై ప్రభావం పడి నేర్చుకోవడం ఆలస్యమవడం, ప్రవర్తనా సమస్యలు తీవ్రమైతే కోమాలోకి వెళ్లొచ్చు. కాబట్టి, రోజూ కాటుక పెట్టకపోవడమే మేలు. ఒకవేళ పెట్టుకున్నా కొద్దిసేపయ్యాక తీసేయడమే మంచిది. దీన్ని ఇతరు లతో పంచు కోకూడదు. తుది గడు వులు (ఎక్స్పైరీ డేట్ ) గమ నించుకోవాలి. లెడ్ (సీసం) లేనివి చూసి ప్రత్యేకంగా ఎంచుకోవాలి. ఇంకా కాటుకకు బదులుగా ఐలైనర్, ఐషాడో, మస్కారా వంటివి ప్రయ త్నించొచ్చు. ఇవైతే కంటిలోకి పోవు. అయితే కడుక్కొనేటప్పుడు జాగ్రత్త వహించాలి.
Recent Posts
See Allనేడు ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు నేడు ప్రభుత్వ గుర్తింపు పొందిన ఉపాధ్యాయ సంఘాలతో పాఠశాల విద్య డైరెక్టర్ వి. విజయరామరాజు చర్చలు జరపనున్నారు....
Commentaires