కను‘పాప’లను దెబ్బతీస్తున్న ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు
సెల్‌ఫోన్లలో ఆటలు.. ల్యాప్‌టాప్‌లో కామిక్ షోలు నిర్విరామంగా చూస్తున్న చిన్నారులు, విద్యార్థుల కళ్లు దెబ్బతింటున్నాయి. వారి కళ్లు సహజ రంగులను గుర్తించలేకపోతున్నాయి.
సెల్‌ఫోన్లలో ఆటలు.. ల్యాప్‌టాప్‌లో కామిక్ షోలు నిర్విరామంగా చూస్తున్న చిన్నారులు, విద్యార్థుల కళ్లు దెబ్బతింటున్నాయి. వారి కళ్లు సహజ రంగులను గుర్తించలేకపోతున్నాయి. వారికి మామిడి ఆకులు లేతపసుపు రంగులో కనిపిస్తున్నాయి. సూర్యరశ్మికి తట్టుకోలేక కళ్లను కిందకు వాల్చేస్తున్నారు. చిన్న వయసులోనే రెటీనా సమస్యలొస్తున్నాయి. ఇవి ఒక్కోసారి శస్త్రచికిత్సలకు దారితీస్తున్నాయి. నేత్రాలు దెబ్బతినడం, సహజ రంగులను గుర్తించకపోవడం వంటి సమస్యలు ఐదారేళ్లలో నాలుగైదు రెట్లు పెరిగాయని హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం సహాయ ఆచార్యులు శివరామ్ మాలే చెబుతున్నారు. ఆయన ‘కలర్ విజన్ డెఫిషియెన్సీ’పై పరిశోధనలో భాగంగా కొన్ని నెలలపాటు వందలమంది పిల్లల డేటాను సేకరించారు.
‘రిషివ కలర్ ఇల్యూషన్ ప్రొటోటైప్’ యాప్‌ను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఇది ఇండియన్ పేటెంట్ ఆఫీస్ జర్నల్‌లో ఇటీవలే ప్రచురితమైంది. మనదేశంలోని మెట్రోనగరాల్లో ప్రతి ఐదుగురిలో ఇద్దరికి, గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఐదుగురిలో ఒకరికి ఈ లోపాలున్నాయని ఆయన అధ్యయనంలో తేలింది. పాఠశాలలు, కళాశాలల్లో గుర్తించేందుకు సరైన యంత్రాంగం లేకపోవడంతో సమస్య తీవ్రమయ్యాకే తెలుస్తోంది. చిన్నపిల్లల్లో ఈ సమస్య తీవ్రంగా ఉంటే రూ.లక్షలు ఖర్చయ్యే అవకాశాలున్నాయి. దీంతో శివరామ్ ‘రిషివి’ పేరుతో ఒక సాఫ్ట్‌వేర్‌ను రూపొందించారు. పేటెంట్ కూడా లభించింది. దీంతో ‘కలర్ విజన్ డెఫిషియెన్సీ’ ఎంతశాతం ఉందో తెలుస్తుంది. ‘విద్యార్థులు కళ్లద్దాలు ధరించకూడదన్న లక్ష్యంతో ఈ పరిశోధనలు ప్రారంభించాం. ప్రాథమిక నివేదికను అమెరికాలో శ్వేతసౌధంలోని ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్స్ ఇన్ బిహేవియరల్, బ్రెయిన్ సైన్సెస్ విభాగంలో ఆరునెలల క్రితం సమర్పించాం’ అని శివరామ్ మాలే తెలిపారు.
Recent Posts
See Allనేడు ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు నేడు ప్రభుత్వ గుర్తింపు పొందిన ఉపాధ్యాయ సంఘాలతో పాఠశాల విద్య డైరెక్టర్ వి. విజయరామరాజు చర్చలు జరపనున్నారు....
Comments