కొత్త క్లస్టర్ స్కూళ్ల నిర్వహణ గురించి నేటి సమీక్షా సమావేశం లో కమీషనర్, పాఠశాల విద్యాశాఖ తెలియజేసిన అంశాలు

🏤 నూతన పాఠశాలల సముదాయాల నిర్వహణ గురించి నేటి సమీక్షా సమావేశం లో కమీషనర్, పాఠశాల విద్యాశాఖ తెలియజేసిన అంశాలు 🏤
✅ ఇక మీదట పాఠశాల సముదాయాల సమావేశాల నిర్వహణ కేవలం ప్రతీ నెల మూడవ శనివారం మధ్యాహ్నం 1గంట నుంచి 5 గంటల వరకు మాత్రమే నిర్వహించబడుతుంది. ఒకవేళ 3వ శనివారం సెలవు అయితే 4వ శనివారం నిర్వహించబడుతుంది.
✅ పాఠశాల సముదాయాల సమావేశం రోజున అనగా 3 లేదా 4వ శనివారం నాడు అన్ని పాఠశాలల్లో ఖచ్చితంగా ఉదయం 11 గంటల 45 నిం .కి
🥣 మధ్యాహ్న భోజన కార్యక్రమం పూర్తి అయితీరాలి.
✅ ఈ పాఠశాల సముదాయాల సమావేశాల రోజున అనగా 3 లేదా 4వ శనివారం నాడు మధ్యాహ్నం విద్యార్థులకు సెలవు ప్రకటించవలెను.
✅ ఈ పాఠశాల సముదాయాల సమావేశాల రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ అనివార్య కారణాలు అనగా అసాధారణ, అనారోగ్య కారణాల వలన తప్ప మరే ఇతర కారణాల దృష్ట్యా ఉపాధ్యాయులకు సెలవులు మంజూరు చేయరాదు.
✅ ఈ సమావేశాల రోజున పాఠశాల సముదాయాల పాఠశాలలో ఉపాధ్యాయులు ఖచ్చితంగా బయోమెట్రిక్ హాజరు వేయుటకు రాష్ట్ర పాఠశాల విద్యా శాఖ ఐటి విభాగం తగిన ఏర్పాటు చేస్తుంది.
✅ ఈ సంవత్సరం ఈ నూతన పాఠశాల సముదాయాల మొదటి సమావేశం రోజున గౌరవ విద్యాశాఖ మాత్యులు, పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి మరియు కమీషనర్ గారు హాజరవుతారు.
⏩🛑 అత్యంత ముఖ్యమైన కమీషనర్ ఆదేశం 🛑⏪
✅ ఈ పాఠశాల సముదాయాల పాఠశాలల్లోని అన్ని ఐఎఫ్పి తరగతి గదుల్లోనూ ఖచ్చితంగా ఐఎఫ్పిలు పనిచేసి తీరాలి మరియు అన్ని ఐఎఫ్పితరగతి గదుల్లోనూ ఖచ్చితంగా ఇంటర్నట్ సదుపాయం కలిగి వుండాలి
సమావేశానికి రెండు రోజుల ముందు నుంచే ఈ పాఠశాల సముదాయాల పాఠశాలల్లో ఐఎఫెపిలు అన్నీ పని చేసేటట్టు మరియు ఇంటర్నెట్ ఖచ్చితంగా అందుబాటులో వుండేటట్టు చూసుకోవాలి.
జిల్లా స్థాయి లో సమగ్ర శిక్షా జిల్లా ఎమ్ ఐ ఎస్ కోఆర్డినేటర్ మండల స్థాయి లో మండల విద్యాశాఖ అధికారులు మరియు మండల ఎమ్ ఐ ఎస్ కోఆర్డినేటర్స్ పర్యవేక్షణ చేసి అన్నీ అందుబాటులో వుండేలా చూడాలి.
✅ ప్రతీ పాఠశాల సముదాయ పాఠశాలలోనూ ఇద్దరు చురుకైన మరియు మంచి బోధనా సామర్ధ్య వనరులు కలిగిన సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయుల (1 నుంచి 2 తరగతులు బోధించు వారు మరియు 3 నుంచి 5 తరగతలు బోధించు వారు) మరియు 8గురు
చురుకైన మరియు మంచి బోధనా సామర్ధ్య వనరులు కలిగిన స్కూల్ అసిస్టెంట్లు (పిడితో సహా) ఎంపిక చేసుకుని సిద్ధంగా వుండవలెను.
➡️ ఈ మొదటి సమావేశం 5 అంచెలుగా జరుగుతుంది ⬅️
⏩ రేపు శనివారం మొదటి సమావేశం కాలపట్టిక ⏪
🕐1గంట నుంచి 🕜1.30 వరకు మంత్రి వర్యులు, పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి మరియు కమీషనర్ వారి సందేశాలు
🕑 2గం నుంచి 🕝 2.30వరకు సెకండరీ గ్రేడ్ టీచర్లు మరియు స్కూల్ అసిస్టెంట్లకు ఉమ్మడి సమావేశం వుంటుంది. ఈ సమావేశంలో పాఠశాల సముదాయాల సమావేశాలలో ఏఏ అంశాలు చర్చించాలో తెలియపరిచెదరు.
🕝 2.30 నుంచి 🕞 3.45 వరకు 1 మరియు 2 తరగతులు బోధించే సెకండరీ గ్రేడ్ టీచర్లు, 3 నుంచి 5 తరగతలు బోధించే సెకండరీ గ్రేడ్ టీచర్లు మరియు వేర్వేరు సబ్జక్ట్ లు బోధించు ఉన్నత పాఠశాలల స్కూల్ అసిస్టెంట్లు వేర్వేరు వేర్వేరు గదుల్లో కూర్చుని వారి భోధానాంశాలకు సంబంధించిన అంశాలమీద చర్చించడం జరుగుతుంది.
🧑🧑🧒🧒🧑🧑🧒 ఈ సెషన్లో సంపూర్ణంగా 📕📕 ఈ దిగువ విద్యా సంబంధిత అంశాలమీద మాత్రమే చర్చ జరగాలి.
📚 కాలపట్టిక ప్రణాళిక ప్రకారం సిలబస్ పూర్తి అయిందా లేదో
📝 పరీక్ష పత్రాల మూల్యాంకనం
🧮 ఫౌండేషన్ లిటరసీ మరియు న్యుమరసీ ప్రకారం విద్యార్థుల స్థితి
📋ఎస్ ఎస్ సి యాక్షన్ ప్లాన్ అమలు
📖 మోడల్ పాఠ్యాంశ బోధన
🕞 3.45 నుంచి 🕓4 గంటల వరకు విశ్రాంతి
🕓4 గంటల నుంచి 🕟 4.30 వరకు మరలా సెకండరీ గ్రేడ్ టీచర్లు మరియు స్కూల్ అసిస్టెంట్లకు ఉమ్మడి సమావేశం వుంటుంది.ఈ సమావేశంలో అత్యుత్తమ అభ్యాసాలు (best exercises) పై చర్చ జరుగుతుంది.
🕟 4.30 నుంచి 🕔 5 గంటల వరకు తిరిగి కమీషనర్ పాఠశాల విద్యాశాఖ వారి తో పరస్పర చర్చ కార్యక్రమం వుంటుంది.
🕔 సాయంత్రం 5గంటలకు సమావేశం ముగుస్తుంది.
జిల్లాలోని అన్ని కాంప్లెక్స్ సమూదాయ పాఠశాలలకు ఈ సమావేశాల రోజున జిల్లా విద్యాశాఖ అధికారి, ఉప విద్యాశాఖాధికారి, సమగ్ర శిక్షా ప్రోజెక్టు కోఆర్డినేటర్, సమగ్ర శిక్షా సెక్టోరల్ అధికారులు, మండల విద్యాశాఖ అధికారులు ఖచ్చితంగా సందర్శించాలి.
తదుపరి ప్రతీ నెల జరిగే ఈ పాఠశాల సముదాయాల సమావేశాలకు సంబంధించిన పూర్తి ప్రణాళికను మరియు కాల నిర్ణయ పట్టికలను ఎస్ సి ఆర్ టి నుంచి తెలియజేయుదురు.
కమీషనర్, పాఠశాల విద్యాశాఖ వారి నేటి సమీక్షా సమావేశ సూచనల ప్రాప్తికి పై సమాచారం తెలియజేయడమైనది.

Recent Posts
See Allఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యాయుల బదిలీ నియంత్రణ చట్టం, 2025 (డ్రాఫ్ట్) ప్రకటన: భారత గణరాజ్యంలోని డెబ్బై ఆరవ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్...
Commentaires