కొత్త ఓటీటీ ప్లాట్‌ఫామ్: ఇవన్నీ ఉచితం..

ఇప్పుడు చాలామంది సినిమాలు, ఇతర వినోద కార్యక్రమాల కోసం వివిధ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లపై ఆధారపడతారు. అయితే దీని కోసం సబ్‌స్క్రిప్షన్ ప్లాన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు తాజాగా ఇండియా పబ్లిక్ బ్రాడ్‌కాస్టర్.. ప్రసార భారతి ఓటీటీ ప్లాట్‌ఫామ్ తీసుకు వచ్చింది. ఇందులో కొన్ని కార్యక్రమాలు ఉచితం అంటూ ప్రకటించింది.
గోవాలో జరిగిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఐఎఫ్ఎఫ్ఐ)లో ప్రసార భారతి కొత్త స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ 'వేవ్స్'ను ఆవిష్కరించింది. దీని ద్వారా రామాయణం, మహాభారతం వంటి వాటిని ఉచితంగా చూడవచ్చు. దీనిని ఆండ్రాయిడ్‌లో గూగుల్ ప్లే స్టోర్, ఐఓఎస్‌లో యాపిల్ యాప్ స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
రామాయణ, మహాభారతం వంటి వాటితో పాటు.. రేడియో ప్రోగ్రామ్స్, గేమ్స్ వంటి వాటిని కూడా దీని ద్వారా ఆస్వాదించవచ్చు. ప్రస్తుతం ఈ వేవ్స్ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో 65 లైవ్ ఛానెల్స్ అందుబాటులో ఉన్నట్లు సమాచారం. తెలుగు, హిందీ, తమిళ వంటి 12 కంటే ఎక్కువ భాషల్లో అందుబాటులో ఉన్న ఈ ప్లాట్‌ఫామ్ 10 కంటే ఎక్కువ కేటగిరీలలో కంటెంట్ అందిస్తోంది.
ప్రసార భారతి కొత్త స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ 'వేవ్స్' కేవలం పెద్ద వారికి మాత్రమే కాకుండా.. పిల్లల కోసం కూడా చోటా భీమ్, అక్బర్ బీర్బల్, మ్యూజిక్ షోలు వంటి అందుబాటులో ఉండనున్నాయి. ఇందులో అయోధ్య నుంచి రామ్ లల్లా హారతి లైవ్, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ వంటి ప్రత్యక్ష లైవ్ ఈవెంట్‌లను కూడా చూడవచ్చు. కొన్ని కార్యక్రమాలకు మినహా ఇతర కార్యక్రమాలకు డబ్బు చెల్లించి ప్లాన్స్ తీసుకోవాల్సి ఉంటుంది.
Recent Posts
See Allవిద్యాశాఖలో భళారే విచిత్రం ప్రవీణ్ ప్రకాష్ లాంటి వ్యక్తి విద్యా శాఖ నుంచి నిష్క్రమిస్తే ప్రభుత్వ పాఠశాలలు బతికి బట్టకడతాయని, ఉపాధ్యాయులు...
కౌశల్ పరీక్ష-2024 స్కూల్ నుండి దరఖాస్తు చేసిన ప్రతి 8 వ తరగతి విద్యార్థి తప్పకుండా రేపు అనగా20/11/24 వ తేదీ తప్పక ఎగ్జామ్ రాయాలి Exam...
Comments