ఓవర్ డ్రాఫ్ట్‌కు, వ్యక్తి గత రుణాలకు మధ్య తేడా ఏంటీ? Overdraft, Personal Loan
- AP Teachers TV
- 6 days ago
- 2 min read
Updated: 3 days ago

Overdraft, Personal Loan
ఓవర్ డ్రాఫ్ట్, వ్యక్తిగత రుణం రెండూ డబ్బు అవసరమైన సందర్భాల్లో ఉపయోగపడతాయి. అయితే ఈ రెండింటిలో ఏది మేలు అంటే మాత్రం అవసరమయ్యే మొత్తం, కాలపరిమితి తదితర అంశాలపై ఆధారపడి ఉంటుంది.
ఓవర్ డ్రాఫ్ట్:
ఖాతాదారులు తమ ఖాతాలో ఉండే మొత్తం కంటే ఎక్కువ మొత్తాన్ని ఉపసంహరించుకోవడాన్ని ఓవర్ డ్రాఫ్ట్ అంటారు. ఓవర్ డ్రాఫ్ట్ లో మీరు ఖాతా నుంచి విత్ డ్రా చేసే వరకు వడ్డీ వసూలు చేయరు. మీరు తీసుకున్న అధిక మొత్తంపై మాత్రమే వడ్డీ చెల్లించవలసి వుంటుంది. ప్రధాన మంత్రి జన్‌ధన్ యోజన ఖాతాలకు ఓవర్ డ్రాఫ్ట్ ప్రయోజనాలను రూ. 5000 నుంచి రూ. 10,000 లకు పెంచుతున్నట్లు ప్రభ్వుత్వం ప్రకటించింది. అయితే వ్యక్తి గత రుణాలు, క్రెడిట్ కార్డుల గురించి తెలిసినంతగా ఓవర్ డ్రాఫ్ట్ గురించి చాలా మందికి తెలియదు. కొద్ది మందికి మాత్రమే దీని గురించి సరియైన అవగాహన వుంది.
ఓవర్ డ్రాఫ్ట్‌ని స్వల్సకాలిక రుణంగా భావించవచ్చు. ఓవర్ డ్రాఫ్ట్ ప్రయోజనాలతో కూడిన సేవింగ్ ఖాతా కలిగిన వ్యక్తి, ఆ ఖాతా జీరో బ్యాలన్స్ స్థితికి చేరుకున్న తరువాత కూడా కొంత పరిమితి వరకు విత్ డ్రా చేసుకోవడానికి బ్యాంకులు అనుమతిస్తాయి. ఉదాహారణకు మీ ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ రూ. 50,000 అనుకుందాం. ప్రస్తుతం మీ సేవింగ్స్ ఖాతాలో రూ. 1,00,000 వున్నాయి అనుకుంటే మీరు రూ. 1,50,000 వరకు విత్ డ్రా చేసుకోవచ్చు.
సాధారణంగా ఓవర్ డ్రాఫ్టు సదుపాయం సేవింగ్స్ బ్యాంకు ఖాతాలపై ఉండదు. కొన్ని బ్యాంకులు శాలరీ ఖాతా కలిగిన వినియోగదారులకు వారి వ్యక్తి గత క్రెడిట్ ప్రొఫైల్‌ను, వారు పనిచేసే కంపెనీ ఆధారంగా, వ్యాపారస్తులకు వారి వారి క్రెడిట్ ప్రొఫైల్ ఆధారంగా ఓవర్ డ్రాఫ్ట్ ప్రయోజనాలను అందిస్తున్నాయి. బ్యాంకులో ఫిక్సిడ్ డిపాజిట్లు కలిగిన వారికి కూడా ఇది అందుబాటులో ఉంటుంది. ఎఫ్‌డీ విలువ కంటే తక్కువ ఓవర్ డ్రాఫ్ట్ లభిస్తుంది. ఎఫ్‌డీపై వచ్చే వడ్డీ కంటే అధిక వడ్డీ చెల్లించవలసి వుంటుంది. వడ్డీ రేటు వ్యక్తిగత రుణంపై విధించే వడ్డీ రేటుతో సమానంగా గాని, ఎక్కువగా గాని వుంటుంది. మీ అర్హతను బట్టి నిర్ధిష్ట సమయంలో తిరిగి చెల్లించవలసి వుంటుంది. వ్యక్తిగత రుణాల్లో తిరిగి చెల్లించేందుకు ఈఎమ్ఐ ఆప్షన్ ఉంటుంది.
ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ, వ్యక్తిగత రుణం కంటే ఏవిధంగా భిన్నం?
మీరు వ్యక్తి గత రుణం కోసం బ్యాంకులో దరఖాస్తు చేసుకుంటే అది బ్యాంకు వారు ఆమోదించి మీ ఖాతాలో జమ చేసిన నాటి నుంచి మొత్తం రుణంపై వడ్డీ చెల్లించాల్సి వుంటుంది. ఉదాహరణకు మీరు రూ.50,000 వ్యక్తి గత రుణం తీసుకున్నారనుకుందాం. ఒక వేళ మీరు ఆ మొత్తాన్ని విత్ డ్రా చేయకపోయినా, ఆ మొత్తం మీ ఖాతాలో జమ అయిన నాటి నుంచి మీరు తిరిగి రుణం చెల్లించే వరకు వడ్డీ చెల్లించవలసి వుంటుంది. ఓవర్ డ్రాఫ్ట్ విషయానికి వస్తే మీరు విత్ డ్రా చేసిన నాటి నుండి వినియోగించిన మొత్తం పై మాత్రమే వడ్డీ చెల్లించవలసి వుంటుంది. ఉదాహరణకి మీ ఓవర్ డ్రాప్ట్ లిమిట్ రూ. 50,000 అనుకుందాం. రూ.25,000 విత్ డ్రా చేస్తే మీరు విత్ డ్రా చేసిన రూ.25,000 మీద వడ్డీ చెల్లించవలసి వుంటుంది. మొత్తం రూ. 50,000 మీద వడ్డీ చెల్లించవలసిన అవసరం లేదు. అయితే క్రెడిట్ కార్డు మాదిరిగా దీనికి గ్రేస్ పిరియడ్ వుండదు. తీసుకున్న నాటి నుంచి వడ్డీ చెల్లించాలి.
ఓవర్ డ్రాఫ్ట్ల్‌లో లభించే మొత్తం వ్యక్తిగత రుణం కంటే తక్కువ, పరిమిత కాలనికి మాత్రమే లభిస్తుంది. ఒకవేళ మీరు అధిక రుణం ఎక్కువ కాలపరిమితితో కావాలి అనుకుంటే వ్యక్తిగత రుణం తీసుకోవడం మంచిది.
תגובות