top of page

‘ఒక పాఠశాల-ఒకయాప్'తో సమగ్ర డ్యాష్ బోర్డు

Writer's picture: AP Teachers TVAP Teachers TV



SCHOOL EDUCATION MONITORING
SCHOOL EDUCATION MONITORING

  • ‘ఒక పాఠశాల-ఒక

యాప్'తో సమగ్ర డ్యాష్ బోర్డు

  • విద్యా సంవత్సరం ముగింపు రోజున తల్లిదండ్రుల మెగా సమావేశం

  • అన్ని బడుల్లోనూ కంప్యూటర్ ల్యాబ్లు

  • విద్యార్థుల సమాచారం పంపేందుకు ప్రత్యేక వాట్సప్ గ్రూపులు

  • కసరత్తు చేస్తున్న విద్యాశాఖ


ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో ప్రమాణాలు మెరుగుపర్చేందుకు రాబోయే ఆరు నెలల్లో అనేక మార్పులు తీసుకొచ్చేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. చేపట్టబోయే చర్యలపై మంత్రి లోకేశ్ ఆధ్వర్యంలో అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. పాఠశాలల వారీగా వాస్తవ పరిస్థితిని తెలుసుకునేందుకు 'ఒక పాఠశాల-ఒక యాప్' పేరుతో సమగ్ర డ్యాష్ బోర్డును సిద్ధం చేస్తున్నారు. విద్యా సంవత్సరం చివరి పని దినం రోజున మరో సారి తల్లిదండ్రులు-ఉపాధ్యాయుల మెగా సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. పాఠశాలల పునఃప్రారంభం నాడే డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కిట్లను 1-12 తరగతుల విద్యార్థులకు అందించేలా చర్యలు చేపట్టారు. ఇంటర్మీడియట్ విద్యార్థు లకు పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలతో పాటు పోటీ పరీక్షల మెటీరియల్, ప్రాక్టికల్ రికార్డులు అందజేయనున్నారు. బడులకుస్టార్ రేటింగ్ను మెరుగుపరిచేందుకు పాఠ శాలల వారీగా ప్రణాళికలు సిద్ధం చేస్తు న్నారు. 2025-26 విద్యా సంవత్సరంలో ఇంటర్మీడియట్ సిలబస్ ను మార్పు చేయ డంతోపాటు ప్రశ్నపత్రాల విధానాన్ని మారు స్తున్నారు.. వెనుకబడిన విద్యార్థులతోపాటు పిల్లలకు అదనపు బోధన అందించేందుకు ఐఐటీ మద్రాస్తో కలిసి విద్యాశక్తి కార్య క్రమాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయ నున్నారు. ఎకడమిక్ క్యాలెండర్ను సమర్థ Oగా అమలు చేయడంతోపాటు డిజిటల్ మౌలిక సదుపాయాల మెరుగు, ఫిజికల్, వర్చువల్ విద్యను ఏకీకృతం చేయడం ద్వారా మెరుగైన బోధన విధానాలను అమలు చేసేందుకు కసరత్తు చేస్తున్నారు.



కంప్యూటర్ ల్యాబ్లు


ఇంటర్మీడియట్ వృత్తి విద్య విద్యార్థు లకు డ్యూయల్ ధ్రువీకరణ పత్రాలు ఇచ్చేం దుకు ప్రయత్నిస్తున్నారు. జాతీయ నైపుణ్యవిద్య అర్హత ఫ్రేమ్ వర్క్ (ఎన్ఎస్క్యూఎఫ్), జాతీయ వృత్తి విద్య, శిక్షణ మండలి (ఎన్సీ వీఈటీ)తో కలిసి వీటిని ఇవ్వనున్నారు. ఎకడమిక్ సమాచారాన్ని అందించేందుకు విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో వాట్సప్ గ్రూపులు ఏర్పాటు చేయనున్నారు. సాంకేతిక సమస్యలను పరిష్కరించి వంద శాతం అపార్ నంబర్లు కేటాయించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఉంది. విద్యార్థుల్లో క్రీడా నైపుణ్యాలు పెంచేందుకు ఆటలకు సంబం ధించిన సామగ్రి అందిస్తారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ బడుల్లోనూ కంప్యూటర్ ల్యాబ్లను ఏర్పాటు చేయనున్నారు. ఇంటర్మీ డియట్ విద్యార్థులకు 475 కళాశాలల్లో జనవరి ఒకటి నుంచి మధ్యాహ్న భోజనం అమలు చేస్తారు. ఉత్తీర్ణత శాతం పెంచేం దుకు ప్రతి 10-15 మంది విద్యార్థులను బోధన, బోధనేతర సిబ్బందికి అనుసంధానం చేస్తూ అన్ని కళాశాలల్లోనూ మెంటార్షిప్ అమలు చేస్తారు.





 
 

Recent Posts

See All

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యాయుల బదిలీ నియంత్రణ చట్టం, 2025 (డ్రాఫ్ట్)

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యాయుల బదిలీ నియంత్రణ చట్టం, 2025 (డ్రాఫ్ట్) ప్రకటన: భారత గణరాజ్యంలోని డెబ్బై ఆరవ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్...

Comments


bottom of page