top of page

ఏపీ విద్యాశాఖ డైరెక్టర్ తో ఉపాధ్యాయ సంఘాల సమావేశ ఫలితాలు

Writer's picture: AP Teachers TVAP Teachers TV

నేడు విజయవాడ విద్యా భవన్ నందు గుర్తింపు పొందిన ఉపాధ్యాయ సంఘాలతో సమావేశం ఏర్పాటు చేసిన విద్యాశాఖ కమిషనర్

ఈ సమావేశంలో ముఖ్య నిర్ణయాలు:


1. 117 జీవో రద్దుకు సంబంధించి ప్రతిపాదనలు, క్షేత్రస్థాయిలో ప్రాథమిక మరియు ప్రాథమికోన్నత పాఠశాలలలో తరగతులను సమీప పాఠశాలల్లో విలీనం చేయడం కు సంబంధించి తీసుకున్న నిర్ణయాలు కేవలం ప్రాథమిక సమాచారం మాత్రమేనని, క్షేత్రస్థాయిలో గ్రామ ప్రజల నిర్ణయం తీసుకొని మాత్రమే ముందుకు వెళ్తామని తెలియజేశారు.


2. దాదాపు 7,500 మోడల్ ప్రైమరీ స్కూల్లో ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేసి ఉన్నామని తెలిపారు.


3. ప్రాథమికోన్నత పాఠశాలల అబ్రిడేషన్ విషయంలో సమీపంలో ఉన్న ఉన్నత పాఠశాలలు ఇబ్బంది పడుకుంటా నిర్ణయం తీసుకుంటామన్నారు.


4. టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టం(TIS) లో చేసిన తప్పును సరిదిద్దుకునేందుకు ఎడిట్ ఆప్షన్ ఇవ్వడం జరిగిందని సరి చేసుకోవాలని కోరారు.


5. ఫిబ్రవరి 10 లోపు ప్రాథమికంగా సీనియారిటీ లిస్టులు మెరిట్ కమ్ రోస్టర్ పద్ధతిలో విడుదల చేస్తామన్నారు.


6. విడుదల చేసిన సీనియారిటీ లిస్టులపై గ్రీవెన్స్ తీసుకుని మూడుసార్లు అవకాశం ఇస్తామన్నారు.


7. గ్రీవెన్స్ కు సంబంధించి డిఇవో పరిధిలో న్యాయం జరగకపోతే ఆర్జెడి పరిధిలో చూస్తామన్నారు.


8. డిఇఓ,ఆర్జెడిలకు గ్రీవెన్స్ లో ఫిర్యాదులు చేయకుండా కోర్టుకు వెళితే చర్యలు తీసుకుంటామన్నారు.


9. జీవో 92 ప్రకారం రీలింక్విస్మెంట్ ఒక సంవత్సరం అన్విల్లింగ్ ఇస్తే తర్వాత సంవత్సరంలో ప్రమోషన్ తీసుకోవచ్చు.


9. టీచర్ల ట్రాన్స్ఫర్ యాక్టుకు సంబంధించి ప్రతిపాదనలను రెండు రోజుల్లో వెబ్ సైట్ లో పెడతామన్నారు. ఏవైనా సూచనలు తెలియజేయాలంటే మెయిల్ ద్వారా తెలియజేయవచ్చు అన్నారు.


10. రానున్న అసెంబ్లీ సమావేశాల్లో బదిలీల యాక్టు ప్రవేశపెడతామన్నారు


11. ఆగస్టు 31వ తేదీ నాటికి రెండు అకాడమిక్ సంవత్సరాలు పూర్తి చేసుకున్న వారు (2023 వారు) బదిలీలకు అర్హులు.


12. ఆగస్టు 31 నాటికి 8 అకాడమిక్ సంవత్సరాలు పూర్తి చేసుకున్న వారు (2017 వారు) కంపల్సరీ బదిలీల క్రిందకు వస్తారు.


13. సర్ ప్లస్ స్కూల్ అసిస్టెంట్ లను మోడల్ ప్రైమరీ స్కూళ్లకు హెచ్ఎం/ప్రిన్సిపాల్స్ గా పంపే విషయం ఆలోచిస్తున్నామన్నారు.

 
 

Recent Posts

See All

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యాయుల బదిలీ నియంత్రణ చట్టం, 2025 (డ్రాఫ్ట్)

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యాయుల బదిలీ నియంత్రణ చట్టం, 2025 (డ్రాఫ్ట్) ప్రకటన: భారత గణరాజ్యంలోని డెబ్బై ఆరవ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్...

Comentarios


bottom of page