ఏపీలో స్కూళ్లకు దసరా సెలవులు ప్రకటించిన మంత్రి లోకేష్
స్కూళ్లకు దసరా సెలవులు ప్రకటన
AP: అక్టోబర్ 3 నుంచి స్కూళ్లకు దసరా సెలవులు ఇస్తున్నట్లు మంత్రి నారా లోకేశ్ ప్రకటించారు. ఉపాధ్యాయులు, పలు సంఘాల విజ్ఞప్తితో ఒకరోజు ముందుగానే సెలవులు ఇస్తున్నామని, OCT 13 వరకు సెలవులు ఉంటాయన్నారు. పాఠశాల విద్యపై ఆయన సమీక్షించారు. నవంబర్ 11న నేషనల్ ఎడ్యుకేషన్ డే ఘనంగా నిర్వహించాలని, 14న మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ స్కూళ్లను బలోపేతం చేయాలని సూచించారు.
ఉపాధ్యాయ సంఘాల ప్రాతినిధ్యం మేరకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఒక రోజు సెలవు దినాన్ని పెంచినట్లు అనగా అక్టోబర్ 3వ తేదీ సెలవు ప్రకటించినట్లు కమీషనర్ , పాఠశాల విద్య వారు తెలియజేశారు.
(అక్టోబర్ 2 గాంధీ జయంతి & మహాలయ అమావాస్య సెలవు వుంటుంది) దసరా సెలవులు అక్టోబర్ 2వ తేదీ నుండి 13 వరకు వుంటాయి.
- హృదయ రాజు , చిరంజీవి, ఏపిటీఎఫ్
అక్టోబర్ 3 నుంచి స్కూళ్లకు దసరా సెలవులు ఇస్తున్నట్లు మంత్రి నారా లోకేశ్ ప్రకటించారు. ఉపాధ్యాయులు, పలు సంఘాల విజ్ఞప్తితో ఒకరోజు ముందుగానే సెలవులు ఇస్తున్నామని తెలిపారు. OCT 13 వరకు సెలవులు ఉంటాయన్నారు. పాఠశాల విద్యపై ఆయన సమీక్షించారు. నవంబర్ 11న నేషనల్ ఎడ్యుకేషన్ డే ఘనంగా నిర్వహించాలని, 14న మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ స్కూళ్లను బలోపేతం చేయాలని సూచించారు.
(చివరి పని దినం అక్టోబర్ 1 అందరూ విధి గా హాజరు కావాలి.)
స్కూళ్లలో ఫలితాల మెరుగుదలపై ప్రతి క్వార్టర్కు సమీక్ష నిర్వహిస్తామని చెప్పారు. రాష్ట్రంలో గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు గ్రంథాలయాల బలోపేతంపై చర్చించారు.
కొద్దిపాటి నిధులు వెచ్చిస్తే నిరుద్యోగ యువతకు ఇవి ఎంతగానో ఉపయోగ పడతాయని అన్నారు. త్వరలో అమరావతిలో అత్యాధునిక సదుపాయాలతో వరల్డ్ క్లాస్ సెంట్రల్ లైబ్రరీ ఏర్పాటు చెయ్యాలని నిర్ణయించారు. రాష్ట్రవ్యాప్తంగా లెర్నింగ్ ఎక్సెలెన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ (లీప్) ప్రోగ్రామ్ పై కెపిఎంజి ప్రతినిధులు నారాయణన్, సౌమ్య పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. పాఠశాల విద్య రోడ్ మ్యాప్, 117 జీవో, ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతులు, టెట్, మెగా డీఎస్సీ నిర్వహణపై సమావేశంలో చర్చించడం జరిగింది. స్వర్ణాంధ్రలో భాగంగా స్కూల్ వారీగా విజన్ డాక్యుమెంట్ రూపకల్పన అంశంపైనా సమాలోచనలు జరిపారు. వరదలు కారణంగా ఉపాధ్యాయ దినోత్సవం జరపలేకపోయామని, నవంబర్ 11న నేషనల్ ఎడ్యుకేషన్ డే ను ఘనంగా నిర్వహించి ఉత్తమ ఉపాధ్యాయులను సత్కరించాలని అధికారులను ఆదేశించారు.ఈ సమావేశంలో పాఠశాల విద్య కార్యదర్శి కోన శశిధర్, కమిషనర్ విజయరామరాజు, సమగ్రశిక్ష స్టేట్ ప్రాజెక్ట్ డైరక్టర్ శ్రీనివాసరావు పాల్గొన్నారు.
Recent Posts
See Allనేడు ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు నేడు ప్రభుత్వ గుర్తింపు పొందిన ఉపాధ్యాయ సంఘాలతో పాఠశాల విద్య డైరెక్టర్ వి. విజయరామరాజు చర్చలు జరపనున్నారు....
Comments