top of page
Writer's pictureAP Teachers TV

ఏపీలో కొత్తగా ఆరు పాలసీలు.. 20 లక్షల ఉద్యోగాలపై చంద్రబాబు ప్రకటన

ఏపీలో ఒకేసారి ఆరు విధానాలను తీసుకొచ్చామని సీఎం చంద్రబాబు తెలిపారు. కొత్త పాలసీలపై ఎంతో కసరత్తు చేశామన్నారు. ఎన్నికల సమయంలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని రాష్ట్ర ప్రజలకు హామీ ఇచ్చామన్నారు. దీనిలో భాగంగా రానున్న ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పించడమే లక్ష్యంగా కొత్త పాలసీలను తెస్తున్నామన్నారు. జాబ్ ఫస్ట్ పేరుతోనే .



ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం కొత్తగా ఆరు పాలసీలను తీసుకురావాలని నిర్ణయించామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఈకొత్త విధానాలు రానున్న రోజుల్లో రాష్ట్ర అభివృద్ధిలో గేమ్‌ ఛేంజర్‌‌గా తయారవుతుందన్నారు. ఏపీ ఇండస్ట్రీయల్ డెవలప్‌మెంట్ పాలసీ 4.0, ఏపీ ఎంఎస్‌ఎమ్‌ఈ ఎంటర్‌ప్యూనర్ డెవలప్‌మెంట్ పాలసీ 4.0, ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ 4.0, ఏపీ ఎలక్ట్రానిక్ పాలసీ 4.0, ఏపీ ఇండస్ట్రీయల్ పార్క్ పాలసీ 4.0, ఏపీ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ, గ్రీన్ ఎనర్జీ 4.0 పాలసీలను తీసుకొస్తున్నామన్నారు. త్వరలో మరికొన్ని పాలసీలను తీసుకువస్తామన్నారు. ఐటీ, టూరిజానికి సంబంధించిన పాలసీలను తీసుకొస్తామన్నారు. ఒకేసారి ఆరు విధానాలను తీసుకొచ్చామన్నారు. కొత్త పాలసీలపై ఎంతో కసరత్తు చేశామన్నారు.

20 లక్షల ఉద్యోగాలు..

ఎన్నికల సమయంలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని రాష్ట్ర ప్రజలకు హామీ ఇచ్చామని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. దీనిలో భాగంగా రానున్న ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పించడమే లక్ష్యంగా కొత్త పాలసీలను తెస్తున్నామన్నారు. జాబ్ ఫస్ట్ పేరుతోనే అన్ని పాలసీలను రూపొందిస్తున్నామని చంద్రబాబు వెల్లడించారు. ప్రతి పాలసీలో ఉద్యోగాలకు ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలిపారు. గతంలో చేసిన పాలసీల్లో ఎంత మొత్తంలో పెట్టుబడులు వచ్చాయని అడిగేవారని, తాము కొత్తగా తీసుకొస్తున్న పాలసీలో ఎంత మందికి ఉద్యోగాలు ఇస్తున్నామనే విషయాన్ని చూస్తున్నామన్నారు. ఉద్యోగాలకు, ఉపాధి, చదువుకున్న పిల్లల భవిష్యత్తు కోసం తమ ప్రభుత్వం కొత్త విధానాలు రూపొందిస్తుందన్నారు. ఏపీ యువత ధింక్ గ్లోబల్లీ, యాక్ట్ గ్లోబల్లీ అనే నినాదంతో ముందుకు వెళ్తున్నామన్నారు.



ఉద్యోగాలు కల్పించాలి..

నాలెడ్జ్ ఎకనమీలో ప్రపంచానికి సేవలు అందిచడంతో పాటు ఉపాధి కల్పించడమే కాకుండా డబ్బులు సంపాదించే మార్గం వచ్చిందని, అందుకే వన్ ఫ్యామిలీ.. వన్ ఎంటర్‌ప్యూనర్ నినాదంతో ముందుకెళ్తున్నామని చంద్రబాబు తెలిపారు. యువత ఉద్యోగాలు చేయడం కాదని, ఉద్యోగాలు కల్పించే వ్యక్తులుగా మారాలన్నారు. 25 ఏళ్లకంటే ముందు ఎన్నో పబ్లిక్ పాలసీలు తీసుకొచ్చామని, వీటిలో ఒకటి ఐటీ పాలసీ అని తెలిపారు. ఈ పాలసీ వచ్చినప్పుడు ఎన్నో ఇంజినీరింగ్ కళాశాలలు ఏర్పాటుచేశామని, ఎన్నో కంపెనీలను తీసుకొచ్చామన్నారు. ప్రపంచంలో ఎన్నో ప్రఖ్యాత సంస్థలకు భారతీయులు నాయకత్వం వహిస్తున్నారని చెప్పారు. ప్రభుత్వం తీసుకొచ్చిన ఆరు పాలసీలు రానున్న రోజుల్లో రాష్ట్ర, యువత భవిష్యత్తుకు సంబంధించి పెనుమార్పులు రానున్నాయన్నారు. అదే సమయంలో రాష్ట్ర ప్రగతినే మారుస్తుందన్నారు. ఆరు పాలసీలకు సంబంధించిన పూర్తి వివరాలను పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా సీఎం తెలియజేశారు.



రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్

ఏపీలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటుచేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. నీతి, నిజాయితీగా వ్యాపారం ఎలా చేయాలనేదానికి రతన్ టాటా నిదర్శనమన్నారు. ఉత్తరాంధ్రలో విశాఖపట్టణం, ఉభయ గోదావరి జిల్లాలకు రాజమండ్రి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో విజయవాడ లేదా గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరుకు తిరుపతి, కడప, అనంతపురం, కర్నూలుకు సంబంధించి అనంతపురంలో ఇన్నోవేషన్ హబ్‌లు ఏర్పాటుచేస్తామన్నారు. ప్రధాన కేంద్రం అమరావతిలో ఉంటుందని.. మిగతా ఐదు జోన్లలో ఐదు కేంద్రాలను రతన్ టాటా పేరుతో ఏర్పాటుచేస్తామని చంద్రబాబు తెలిపారు.





0 comments

Recent Posts

See All

నేడు ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు

నేడు ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు నేడు ప్రభుత్వ గుర్తింపు పొందిన ఉపాధ్యాయ సంఘాలతో పాఠశాల విద్య డైరెక్టర్ వి. విజయరామరాజు చర్చలు జరపనున్నారు....

Comentários


bottom of page