ఏపీలో 5 వేల మంది కాంట్రాక్ట్ టీచర్స్ మెడపై కత్తి #ContractTeachers
ఏపీలో 5 వేల మంది కాంట్రాక్ట్ టీచర్స్ మెడపై కత్తి #ContractTeachers
కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాల (కేజీబీవీ) ఉపాధ్యాయినులు, భవిత కేంద్రాల్లోని ప్రత్యేక ఉపాధ్యాయుల ఉద్యోగాలు ప్రమాదంలో పడ్డాయి. వీరి పనితీరును మదింపు చేసి ఒప్పందాన్ని పొడిగించేందుకు సమగ్ర శిక్షా అభియాన్ (ఎస్‌ఎస్‌ఏ) చర్యలు చేపట్టింది.
అమరావతి: కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాల (కేజీబీవీ) ఉపాధ్యాయినులు, భవిత కేంద్రాల్లోని ప్రత్యేక ఉపాధ్యాయుల ఉద్యోగాలు ప్రమాదంలో పడ్డాయి. వీరి పనితీరును మదింపు చేసి ఒప్పందాన్ని పొడిగించేందుకు సమగ్ర శిక్షా అభియాన్ (ఎస్‌ఎస్‌ఏ) చర్యలు చేపట్టింది. కేజీబీవీలు, భవిత కేంద్రాల్లో ఎస్‌ఎస్‌ఏ ఆధ్వర్యంలో 5 వేల మందికిపైగా ఒప్పంద ఉపాధ్యాయులు పని చేస్తున్నారు. గతంలో ఎప్పుడూ ఒకరోజు విరామంతో సంవత్సర కాలానికి ఒప్పందాన్ని పొడిగించేవారు.
ఈ సారి జూన్ 9 వరకు మాత్రమే పొడిగించారు. ఈ లోపు 2023-24 విద్యా సంవత్సరానికి ఉపాధ్యాయుల పనితీరును ఎస్‌ఎస్‌ఏ మదింపు చేయనుంది. కేజీబీవీల్లో ప్రిన్సిపాళ్లు, సీఆర్టీలు, పీజీటీలకు తదితరులకు 20 మార్కులకు పనితీరును అంచనా వేస్తున్నారు.దీనిపై ఉపాధ్యాయుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. పనితీరు బాగోలేదంటూ ఉద్యోగాల నుంచి తొలగించేందుకే ఈ చర్యలు చేపడుతున్నట్లు వారు ఆరోపిస్తున్నారు.
ఈ సమాచారం ఉపయోగకరం అనిపిస్తే కిందనున్న హృదయం గుర్తు మీద నొక్కండి. తదుపరి తాజా సమాచారం కొస సబ్ స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసుకండి.
Recent Posts
See Allనేడు ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు నేడు ప్రభుత్వ గుర్తింపు పొందిన ఉపాధ్యాయ సంఘాలతో పాఠశాల విద్య డైరెక్టర్ వి. విజయరామరాజు చర్చలు జరపనున్నారు....
Comments