ఏపీ మోడల్ స్కూల్స్ 6వ తరగతి ప్రవేశపరీక్ష ఫలితాలు విడుదల #APMSExamResult
- AP Teachers TV
- Apr 29, 2024
- 1 min read
APMS 6th class exam Result | ఏపీలోని ఆదర్శ పాఠశాలల్లో ఆరో తరగతి ప్రవేశాలకు నిర్వహించిన పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి.
అమరావతి: ఏపీలో ఆదర్శ (మోడల్) పాఠశాలల్లో ఆరో తరగతిలో ప్రవేశాలకు నిర్వహించిన పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 164 మోడల్ స్కూల్స్‌లో ఏప్రిల్ 21న ఈ పరీక్ష నిర్వహించగా.. 31,376 మంది విద్యార్థులు హాజరయ్యారు. సోమవారం ఈ ఫలితాలను విడుదల చేసినట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ తెలిపారు. క్యాండిటేట్ ఐడీ, పుట్టిన తేదీ వివరాలు, వెరిఫికేషన్ కోడ్‌ను ఎంటర్ చేయడం ద్వారా విద్యార్థులు తమ మార్కుల మెమోను పొందొచ్చన్నారు. అడ్మిషన్లకు సంబంధించిన మరింత సమాచారం కోసం ఆయా మోడల్ స్కూల్స్‌లో సంప్రదించాలని ఆయన సూచించారు.
Comments