ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.నవంబర్లో పక్కా!
ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త..
వచ్చే నెలలో పక్కా!
Ap Govt Employees Pending Arrears Release
ప్రభుత్వ సలహాదారు (ఉద్యోగుల సంక్షేమం) చంద్రశేఖర్రెడ్డి కీలక
వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ, ఇతర
బకాయిలను వచ్చే నెలలో చెల్లిస్తుందన్నారు. ఉద్యోగులకు మేలు
జరిగేలా జీపీఎస్ తీసుకొచ్చారన్నారు. అలాగే దసరా ముందే డీఏ
బకాయిలను చెల్లించిన విషయాన్ని గుర్తు చేశారు. అంతేకాదు
కాలిలో ఆర్టీసీ డ్రైవర్పై దాడి ఘటనను ఖండించారు. ఈ కేసులో
నిందితులపై కఠిన చర్యలు తప్పవు అన్నారు.
ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ, పీఆర్సీ, ఇతర
బకాయిలను ప్రభుత్వం నవంబరులోగా చెల్లిస్తుందని
ఆశిస్తున్నామన్నారు ప్రభుత్వ సలహాదారు (ఉద్యోగుల
సంక్షేమం) చంద్రశేఖర్రెడ్డి. ఉద్యోగుల సమస్యలను
ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లినప్పుడు ఆయన
సానుకూలంగా స్పందిస్తున్నారన్నారు. ఉద్యోగులకు
ఇచ్చిన మాట ప్రకారం దసరా ముందే ఒక డీఏ బకాయి
చెల్లించారని.. పాత పెన్షన్ స్కీం (ఓపీఎస్) ప్రభుత్వానికి
ఆర్థికంగా భారమవుతుందనే జీపీఎస్
తీసుకొచ్చారన్నారు. ఉద్యోగులకు ఇది ఎంతో
మేలైంది.. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన 12వ
పీఆర్సీ కమిషన్ ఇప్పటికే పని ప్రారంభించింది
అన్నారు.
ఈయన అన్నారంటే జరుగుతుందనే చెప్పాలి. మొన్నటి పీఆర్సీ వంటివి కూడా ఈయన చెప్పిన తర్వాతే విడుదలయ్యాయి.ఈ పోస్ట్ నచ్చితే కిందనున్న హృదయం గుర్తుపై టచ్ చేసి మీ ప్రోత్సాహం అందించండి. మరిన్ని తాజా విశేషాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.
Recent Posts
See Allనేడు ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు నేడు ప్రభుత్వ గుర్తింపు పొందిన ఉపాధ్యాయ సంఘాలతో పాఠశాల విద్య డైరెక్టర్ వి. విజయరామరాజు చర్చలు జరపనున్నారు....
コメント