ఏపీ టీచర్స్ లెస్సన్ ప్లాన్స్ కంప్యూటర్ టైపింగ్ చేసి ప్రింట్ చేసినవి వాడాలా చేతితో రాసినవి వాడాలా
ఏపీ టీచర్స్ లెస్సన్ ప్లాన్స్ కంప్యూటర్ టైపింగ్ చేసి ప్రింట్ చేసినవి వాడాలా చేతితో రాసినవి వాడాలా అని సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చ జరుగుతోంది. పాఠశాలల్లో పాఠ్యబోధన అనేదే ప్రాథమిక ప్రక్రియ, కీలకమైన అతిముఖ్యమైన కార్యక్రమం. పాఠ్యబోధనలో ముందస్తుగా ప్రణాళిక వేసుకోవడం ముఖ్యమైన విధి. పాఠ్యపుస్తకంలోని పాఠ్యాంశాలు, వాటి లక్ష్యాలు, భావనలు, సాధించవలసిన సామర్థ్యాలకు అనుగుణంగా ప్రతి ఉపాధ్యాయుడు పాఠ్యప్రణాళిక (Lesson Plan) రూపొందించుకోవాలి.
ఇందులో పాఠ్యబోధనకు ఆయా భావనలకు అవసరమైన బోధనాభ్యసన సామగ్రి వివరాలు కూడా పేర్కొనాలి. పూర్వం నుంచి ఈ పాఠ్య ప్రణాళికలను ఉపాధ్యాయులు తమ నోటుపుస్తకాలలో చేతితో రాస్తూ వచ్చారు. వాటినే తమ ప్రధానోపాధ్యాయులు అధికారుల చేత ఆమోదింప చేసుకున్నారు. అయితే చాలామంది ఉపాధ్యాయులు కాలానికి అనుగుణంగా పరిణామం చెందుతూ తమ పాఠ్య ప్రణాళికలను కంప్యూటర్ సహాయంతో టైప్ చేసి ప్రింట్ చేసుకొని వాడటం మొదలుపెట్టారు. వేగంగా పరుగెడుతున్న కాలంతోపాటు దైనందిన జీవితం, పాఠ్యబోధన వేగం పుంజుకోవలసిన అవసరం ఎంతో ఉంది. అందుకనుగుణంగా అందివచ్చిన సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రతీ ఉపాధ్యాయుడు ఉపయోగించుకొని అప్ డేట్ కావలసిన అవసరం ఉంది. ఈ పరిణామం తప్పనిసరి.
గత సంవత్సరం విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ ఆదేశాల ప్రకారం ఉపాధ్యాయులు తమ పాఠశాలలో పాఠ్యబోధన కొరకు తమ పాఠ్య ప్రణాళికలను డిజిటల్ లెస్సన్ ప్లాన్స్ రూపంలో కంప్యూటర్ ప్రింట్ తీసుకొని ప్రధానోపాధ్యాయులచే ఆమోదింపజేసుకుని వాడుకోవచ్చు, ఇతర ఉపాధ్యాయులతో షేర్ చేసుకోవచ్చు. చేతితో రాయనవసరం లేదు.ఈ విషయాన్ని క్రింద ఉంచిన జీ.వో కాపీ డౌన్ లోడ్ చేసుకొని చదివి తెలుసుకోవచ్చు.
వివరాలకు కింది వీడియోలు చూడవచ్చు.
Commentaires