ఎస్సీఈఆర్టీ డైరెక్టర్పై విచిత్రమైన విచారణ!
ఎస్సీఈఆర్టీ డైరెక్టర్పై విచిత్రమైన విచారణ!
పాఠశాల విద్యా శాఖలో ఉన్నతాధికారుల వింత నిర్ణయాలు ఆశ్చర్యానికి
గురిచేస్తున్నాయి. వైకాపాతో అంటకాగిన రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎస్సీఈఆర్టీ) డైరెక్టర్ ప్రతాప్ రెడ్డి పై వచ్చిన ఫిర్యాదులపై పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయరామరాజు విచారణకు ఆదేశించారు. విచారణ అధి కారిగా డైరెక్టర్ మస్తానయ్యను నియమించారు. ఆరోపణలపై విచారణ చేయాలనుకున్నప్పుడు ప్రతాప్ రెడ్డిని ఆ పోస్టు నుంచి తప్పించాల్సి ఉంటుంది. అప్పుడే విచారణలో వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంటుంది. కానీ, ఆయన్ను అదే పదవిలో కొనసాగి స్తున్నారు. విచారణలో భాగంగా సమాచారం. ఇవ్వాలని ఎస్సీఈఆర్టీ ఉద్యోగులు, సిబ్బందిని మస్తా నయ్య కోరగా.. అందుకు వారు నిరాకరిస్తున్నారు. తన అనుమతి లేకుండా సమాచారం ఇవ్వొద్దని ప్రతాప్ రెడ్డి ఉద్యోగులకు ఆదేశాలు జారీ చేశారు. ఆ ఆదేశాల ప్రతిపై ఉద్యోగులందరితో సంతకాలు తీసుకు న్నారు. ఒకపక్క విచారణ అధికారి సమాచారం కోసం ప్రయత్నిస్తుండగా.. మరోపక్క వివరాలు ఇవ్వొద్దంటూ ఉద్యోగులను ప్రతాప్ రెడ్డి బెదిరిస్తున్నారు. విద్యాశాఖలో జరుగుతున్న ఈ వింత విచారణపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రతాప్ రెడ్డిని ఫిర్యాదుల నుంచి బయటపడే సేందుకు ప్రయత్నిస్తున్నారా..? అనే అను మానాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రతాప్ రెడ్డి పై అనేక ఫిర్యాదులు
ప్రతాప్ రెడ్డిపై ఎస్సీఈఆర్టీలో బోగస్ బిల్లులతో నిధులు స్వాహా చేసినట్లు ఆరోపణలున్నాయి. తన సతీమణి కల్పలతా రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసిన సమయంలో ఆయన కోడ్ను ఉల్లంఘించారు. విధులకు సెలవు పెట్టి నిబంధనలకు విరుద్ధంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నట్లు ఫిర్యాదులున్నాయి. కడప ఇన్ఛార్జి ఆర్జేడీగా పనిచేసిన సమయంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైకాపాకు అనుకూలంగా వ్యవహరించారని, ఎస్సీఈఆర్టీ డీటీపీ వర్క్ ను ఓ ప్రైవేటు వ్యక్తికి అధిక ధరలకు కట్టబెట్టి.. నిధుల దుర్వినియోగానికి పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. గతంలో కరోనాపై అవగాహన కల్పించేందుకు రూ.30 లక్షలతో ఓ వీడియోను రూపొందించినట్లు బిల్లులు పెట్టారు. కానీ, ఆ వీడియోను క్షేత్రస్థాయికి పంపిన దాఖలాలే లేవు.
Recent Posts
See Allనేడు ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు నేడు ప్రభుత్వ గుర్తింపు పొందిన ఉపాధ్యాయ సంఘాలతో పాఠశాల విద్య డైరెక్టర్ వి. విజయరామరాజు చర్చలు జరపనున్నారు....
Comentários