ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ తర్వాత టీచర్ల ప్రాథమిక సీనియారిటీ జాబితా విడుదల
కోడ్ తర్వాత టీచర్ల ప్రాథమిక సీనియారిటీ జాబితా విడుదల
అమరావతి: ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి ప్రాథమిక సీనియారిటీ జాబితా విడుదల చేయను న్నారు. డిప్యుటేషన్లపై ఇతర శాఖల్లో పనిచేస్తున్న వారు సర్వీసు అప్డేట్ చేసుకునేందుకు సమయం కల్పి స్తారు. డీఎస్సీ-2008 వారికి నోషనల్ సీనియారిటీ డేట్ నమోదు చేసుకునే విధంగా అవకాశం ఇస్తారు.
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఉపాధ్యాయ బదిలీల ముసాయిదా బిల్లు ప్రవేశపెట్టేందుకు వీలుగా సంబం ధిత బిల్లును న్యాయ సమీక్షకు పంపించారు. ఆగస్టు 31 నాటికి రెండేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న వారు బదిలీ లకు అర్హులు కాగా.. ఎనిమిదేళ్ల సర్వీసు పూర్తి చేసు కున్న వారు తప్పనిసరిగా బదిలీ కావాల్సి ఉంటుంది.
ఉపాధ్యాయ సంఘాల నేతలతో శుక్రవారం పాఠశాల విద్యాశాఖ అధికారులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలను వెల్లడించారు. ఆదర్శ ప్రాథమిక పాఠశాలల్లో 3,4,5 తరగతుల విలీనంపై ఎన్ని కల కోడ్ తర్వాత తల్లిదండ్రులు అభిప్రాయాలు తీసుకుం టారు. అకడమిక్ కేలండర్ను విడుదల ముందు ఉపా ధ్యాయ సంఘాల నేతల అభిప్రాయాలు తీసుకోవాలని నిర్ణయించారు. పదో తరగతి విద్యార్థులకు సెలవు రోజుల్లో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్న టీచర్లకు సెలవుల కోసం యాప్లో ఐచ్ఛికాన్ని కేటాయిస్తారు.
Recent Posts
See Allఈనెలలోనే మెగా డిఎస్సీ Mega DSC నోటిఫికేషన్ ప్రకటిస్తాం! కెజి టు పిజి పాఠ్య పుస్తకాల్లో మార్పులు పాఠశాలల్లో వార్షికోత్సవాలను నిర్వహిస్తాం...
ఈరోజు కమిషనర్ కార్యాలయంలో ఉపాధ్యాయ సంఘాల సమావేశం జరిగింది. 1. అన్ని కేడర్ల సీనియారిటీ లిస్టులో ఫైనలైజ్ అయ్యాయి ఎన్నికల కోడ్ అవగానే...
Comments