ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో బొర్రా గోపీమూర్తి జయకేతనం MLC By poll
- AP Teachers TV
- Dec 9, 2024
- 1 min read
ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో స్వతంత్ర అభ్యర్థి బొర్రా గోపీమూర్తి విజయం సాధించారు.
కాకినాడ: ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో స్వతంత్ర అభ్యర్థి బొర్రా గోపీమూర్తి విజయం సాధించారు. సమీప ప్రత్యర్థి గంధం నారాయణరావుపై ఆయన గెలుపొందారు. అయితే దీన్ని కేంద్ర ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.
కాకినాడ జేఎన్‌టీయూలో నిర్వహించిన ఓట్ల లెక్కింపులో తొలి నుంచే బొర్రా గోపీమూర్తి (Borra Gopimurthy) ఆధిక్యంలో కొనసాగారు. చివరికి 9,165 మొదటి ప్రాధాన్య ఓట్లతో విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో ఆయన్ను పీడీఎఫ్ బలపరిచింది. గంధం నారాయణరావుకు 5,259 ఓట్లు వచ్చాయి. మొత్తం 15,494 ఓట్లకు గాను 14,680 పోలయ్యాయి. వీటిలో 814 చెల్లని ఓట్లుగా ఎన్నికల అధికారులు గుర్తించారు. బొర్రా గోపీమూర్తి విజయం సాధించడంతో ఆయన వర్గీయులు సంబరాలు చేసుకుంటున్నారు.

Commentaires