top of page
Writer's pictureAP Teachers TV

ఎన్నికల గురించి ముఖ్య ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా ప్రెస్ మీట్, ఈ సారి కొన్ని ప్రత్యేకం కొన్ని ఆసక్తికరం



ఎన్నికల గురించి ముఖ్య ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా ప్రెస్ మీట్, ఈ సారి కొన్ని ప్రత్యేకం కొన్ని ఆసక్తికరం:


ఈరోజు మీడియా పాయింట్ వద్ద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సమావేశంలో మీడియాతో మాట్లాడుతూ ఎన్నికలకు సంబంధించిన సమగ్ర సమాచారం వివరించారు. రాష్ట్రమంతటా 13వ తారీఖున అసెంబ్లీ, పార్లమెంటు నియోజకవర్గాలఎన్నికలు జరుగుతాయని పోలింగ్ ఉదయం ఏడు గంటలకు మొదలై ఆరు గంటలకు ముగుస్తుంది అన్నారు. మొత్తం 175 నియోజకవర్గాల్లో 169 నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు, పాడేరు, అరకు, రంపచోడవరం నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు, మన్యం జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ జరుగుతుందని చెప్పారు.


ఈ సాయంత్రం 6 గంటల నుంచి సైలెంట్ పీరియడ్ మొదలవుతుందని ఈ సమయంలో ఎవరు కూడా ప్రచారం నిర్వహించడానికి వీలులేదని అది మైక్ ద్వారా కానీ సోషల్ మీడియా ద్వారా కానీ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా గాని ప్రచారం నిర్వహించడానికి వీలులేదని అయితే ప్రింట్ మీడియా ద్వారా రెండు రోజులు ప్రచారం చేసుకోవచ్చని ఆయన తెలిపారు. పోలింగ్ రోజున పోలీస్ స్టేషన్ ఆవరణలో 144 సెక్షన్ అమలులో ఉంటుందని అన్నారు. పర్యాటకులు వచ్చే తిరుపతి, అరకు వంటి ప్రాంతాలలో బోగస్ ఓట్లు జరిగే అవకాశం ఉన్నందున అధికారులు తగిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.



పోలింగ్ సిబ్బంది రేపు అనగా 12 వ తారీకు ఉదయాన్నే పోలింగ్ సామాగ్రి డిస్ట్రిబ్యూషన్ సెంటర్ కి హాజరుకావాలని రేపు వారికి మరొకసారి శిక్షణ జరుగుతుందని అనంతరం సాయంత్రానికల్లా వారు పోలింగ్ స్టేషన్ కి సామాగ్రి తో సహా చేరుకుంటారని పోలింగ్ సిబ్బంది ఆ రాత్రి పోలింగ్ స్టేషన్లోనే బస చేయాలని పేర్కొన్నారు. అదే సాయంత్రం పోలింగ్ ఏజెంట్లు నియామకం జరుగుతుందని వారికి నియామక పత్రాలు అందచేస్తారని తెలియజేశారు. 13వ తేదీ ఉదయం 5:30 కి ఏజెంట్ల సమక్షంలో మాక్ పోల్ నిర్వహిస్తారని తెలియజేశారు. ఒక పార్టీ తరఫున ఒక ఏజెంట్ మాత్రమే నియమించబడతారు. ఏజెంట్లు నియామకం విషయంలో ఎటువంటి నిబంధనలు లేవని అయితే ఉద్యోగులు ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఏజెంట్లుగా అర్హులు కారని తెలియజేశారు. అదే అసెంబ్లీ నియోజకవర్గంలోని ఏ ఓటర్ అయినా ఏజెంట్గా కూర్చోవడానికి అర్హుడని అన్నారు. ఏజెంట్లుగా నియమించబడిన వారితో పాటు ఇద్దరూ రిలీవింగ్ ఏజెంట్లను కూడా నియమిస్తారని చెప్పారు.


పోలింగ్ స్టేషన్ కి రెండు వందల మీటర్ల దూరంలో ఎటువంటి ప్రచారం గానీ పార్టీల ప్రజల సందడి గాని ఉండకూడదని 200 మీటర్ల అవతల పార్టీలు తమ టెంట్లు వేసుకొని అభ్యర్థులకు స్లిప్పులు అందించవచ్చు అని అయితే ఆ స్లిప్పుల్లో పార్టీ సింబల్ గానీ అభ్యర్థుల పేర్లు గాని ఉండకూడదని తెలిపారు ఏ పార్టీ వారైనా ఓటర్లను పోలింగ్ స్టేషన్ వద్దకు వారి ఖర్చులతో వాహనాల ద్వారా తీసుకురావడానికి వీల్లేదని అలా తీసుకువచ్చినట్లైతే వాహనాలను సీజ్ చేస్తామని అన్నారు. సొంత వాహనాల్లో వచ్చిన ఓటర్లు తమ సొంత వాహనాన్ని 200 మీటర్ల అవతల పార్కింగ్ చేసుకోవాలని తెలిపారు. అసెంబ్లీ నియోజకవర్గానికి పోటీ చేస్తున్న అభ్యర్థుల మూడు వాహనాలు పార్లమెంటు నియోజకవర్గానికి పోటీ చేస్తున్న అభ్యర్థుల మూడు వాహనాలు అనుమతించబడతాయని తెలిపారు. పోలింగ్ స్టేషన్ ప్రాంగణంలోకి ఏ వ్యక్తి కూడా ఆయుధాలతో గాని మొబైల్ ఫోన్స్ తో గాని అనుమతించబడరు. పోలింగ్ స్టేషన్లో ప్రీసైడింగ్ ఆఫీసర్ మాత్రమే మొబైల్ ఫోన్ వాడటానికి అనుమతి ఉంటుంది.



ఈసారి అనేక పోలింగ్ స్టేషన్లో వెబ్ కెమెరాల ద్వారా వెబ్ కాస్టింగ్ చేస్తారు. బందోబస్తు కోసం కేంద్రం నుంచి సీఆర్పీఎఫ్, మన రాష్ట్రంలోని పోలీసులతో సహా తమిళనాడు కర్ణాటక ఇతర రాష్ట్రాల నుంచి వేలమంది పోలీసు సిబ్బందిని రప్పిస్తున్నారు. క్యూ లైన్లు నిర్వహించడానికి ఎన్సిసి, ఎన్ఎస్ఎస్ మరియు ఎక్స్ ఆర్మీ, రిటైర్డ్ ఆర్మీ పర్సన్స్ ని నియమిస్తారు. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులైన ప్రస్తుత ఎమ్మెల్యేలు గానీ ఎంపీలు గాని మంత్రులు గాని ఎవరైనా వారి సంరక్షకులతో ఆయుధాలతో పోలింగ్ స్టేషన్ లోకి ప్రవేశించడానికి అనుమతి లేదు. రాష్ట్రవ్యాప్తంగా నాలుగు లక్షల 44 వేలకు పైగా పోస్టల్ బ్యాలెట్లు నమోదు అయ్యాయి.

ప్రెస్ మీట్ లోని మిగతా ముఖ్యమైన విషయాలు తెలుసుకోవడానికి ఈ క్రింది వీడియో చూడగలరు 👇





0 comments

Recent Posts

See All

నేడు ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు

నేడు ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు నేడు ప్రభుత్వ గుర్తింపు పొందిన ఉపాధ్యాయ సంఘాలతో పాఠశాల విద్య డైరెక్టర్ వి. విజయరామరాజు చర్చలు జరపనున్నారు....

Comentarios


bottom of page