top of page
Writer's pictureAP Teachers TV

ఉపాధ్యాయుల సర్వీస్ సందేహాలు - సమాధానాలు

ప్రశ్న:

ఒక జిల్లాలోని విద్యార్థి మరొక జిల్లాకు బదిలీ అయితే రికార్డు షీటు లేక టి.సి.పై ఎవరి కౌంటర్ సిగ్నేచర్ అవసరం?

జవాబు:

ఎవరు కౌంటర్ సిగ్నచర్ అవసరం లేదు. (L.Dis. No.

7310 B1/2/76, Dt. 17-9-76. DSE,Hyd)


ప్రశ్న:

ఇన్ చార్జి HM ఏయే విధులు నిర్వహించవచ్చు?


జవాబు:

ఇన్చార్జి HM ఆర్థిక కార్యకలాపాలు, టి.సి.లు జారీ చేయుట చేయరాదు. కేవలం టీచర్స్, విద్యార్థుల హాజరు పట్టీలు, విజిటర్స్ బుక్, CL రిజిస్టర్ నిర్వహణ మాత్రమే చేయాలి 15 రోజులకు మించి HM సెలవు పెడితే FACకు దరఖాస్తు చేసుకొనవచ్చును. FAC HM అన్ని రకాల HM బాధ్యతలు వారితో సమానముగా నిర్వహించవచ్చును


ప్రశ్న:

HM కుర్చీలో ఇన్ చార్జి HM కూర్చొనవచ్చునా?


జవాబు:

కూర్చొనరాదు. FAC HM కూర్చొనవచ్చును. FAC HM గ్రీన్ ఇంకుతో సంతకాలు చేయరాదు. పాఠశాల జారీచేసిన ధ్రువపత్రాలపై తప్ప వేటిని ఎటెస్టేషన్ చేయరాదు


ప్రశ్న:

ఉన్నత పాఠశాలల్లో 9:30కు మొదటి బెల్, 9:35కు రెండవ బెల్, 9:35 నుండి 9:45 వరకు అసెంబ్లీ నిర్వహించబడును. 9:45కు మూడవ బెల్ మరియు మొదటి పీరియడ్ ప్రారంభమగును, ఉపాధ్యాయుడు 9:45కు రావచ్చునా?


జవాబు:

కాదు. ఉపాధ్యాయుడు విధిగా అసెంబ్లీకు హాజరు కావలెను. School Assembly is part and parcel of curriculam. అసెంబ్లీకి రానిచో ఆరోజు హాఫ్ డే సి.ఎల్.గా నోట్ చేయాలి (Rc.No. 529/E2/97, Dt, 16-7-1997)


ప్రశ్న:

నెలలో మూడుసార్లు లేట్ పర్మిషన్ తీసుకోవచ్చునా?


జవాబు:

ఉపాధ్యాయులకు ఈ సౌకర్యం లేదు.


ప్రశ్న:

పాఠశాల ప్రధానోపాధ్యాయుడు 15 రోజుల సెలవుపై ఆన్డ్యూటీ పై వెళ్ళినప్పుడు ఎవరికి ఇన్చార్జి ఇచ్చి వెళ్ళాలి


జవాబు:

తప్పనిసరిగా సీనియర్ ఉపాధ్యాయునికి ఇన్చార్జి ఇచ్చి

వెళ్ళాలి. అతను వద్దంటే తదుపరి సీనియర్ కు ఇవ్వాలి.


ప్రశ్న:

ఉన్నత, ప్రాథమికోన్నత పాఠశాలల్లో ప్రతి ఉపాధ్యాయుడు కనీసం ఎన్ని పిరియడ్లు బోధించాలి?


జవాబు:

కనీసం 24 లేకపోతే జీతం ఇవ్వరాదు (AER-R 77 )


ప్రశ్న

LFL HMలు గెజిటెడ్ HM గా పదోన్నతి పొందవచ్చునా?


జవాబు:

డిగ్రీ, బి.ఇడి మరియు శాఖాపరమైన పరీక్షలలో కృతార్థత ఉంటే గెజిటెడ్ HMకు పదోన్నతి పొందవచ్చును. కానీ నిర్ణీత అర్హతలున్ననూ జూనియర్ లెక్చరరకు అవకాశములేదు.


ప్రశ్న:

ప్రభుత్వ /మండల/జడ్పి స్కూళ్ళలో పనిచేయు SGT/LPలు 6/12/18 సం॥ల స్కేలు పొందుటకు ఎటువంటి అదనపు అర్హతలు కావాలి?


జవాబు:

ఎటువంటి అదనపు అర్హతలు అవసరం లేదు, నియామకపు అర్హతలుంటే సరిపోవును


ప్రశ్న:

ఫైవారు 24 సం.ల స్కేలు పొందాలంటే ఏఏ అర్హతలు ఉండాలి?


జవాబు:

HM పదోన్నతికి కావలసిన డిగ్రీ, బి.ఇడి పండిత శిక్షణలు మరియు సంబంధిత శాఖాపరీక్షలు ఉత్తీర్ణత పొందాలి.


ప్రశ్న:

నేరుగా నియామకము పొందిన స్కూల్ అసిస్టెంట్ కు 45 సం॥లు వయస్సు దాటితే శాఖాపరమైన వరీక్షల కృతార్ధత నుండి పదోన్నతికి 12/18/24 సం॥ల స్కేలు పొందుటకు మినహాయింపు ఉన్నదా?


జవాబు:

అవును. .


ప్రశ్న

ఇంటర్/డిగ్రీలో హిందీ 2వ భాషగా కలవారు పదోన్నతికి ఏయేశాఖాపరమైన పరీక్షలు వ్రాయాలి


జవాబు:

పేపర్ కోడ్ 037, స్పెషల్ తెలుగు లాంగ్వేజ్ టెస్ట్ కృతార్ధత అవ్వాలి


0 comments

Recent Posts

See All

నేడు ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు

నేడు ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు నేడు ప్రభుత్వ గుర్తింపు పొందిన ఉపాధ్యాయ సంఘాలతో పాఠశాల విద్య డైరెక్టర్ వి. విజయరామరాజు చర్చలు జరపనున్నారు....

Comments


bottom of page