ఉపాధ్యాయులు,అధికారులకు webex meeting లో కమీషనర్ ఇచ్చిన ముఖ్య సూచనలు
ఉపాధ్యాయులు,అధికారులకు webex meeting లో విద్యాశాఖ కమీషనర్ ఇచ్చిన ముఖ్య సూచనలు:
1)UDISE+
యుడైస్ నందలి గ్యాప్స్ ఈరోజు సాయంత్రానికి ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తి చేయాలి.
. తరగతిలో ఉన్న విద్యార్థుల అందరి పేర్లు UDISE+ నందు ఆన్లైన్ తప్పనిసరిగా చేయాలి
.వచ్చేవారం నుండి గౌరవ ప్రిన్సిపల్ సెక్రెటరీ గారు మరియు మినిస్టర్ గారు పాఠశాలలను సందర్శించే అవకాశం ఉన్నది.
. వారు యుడైస్ రోల్ గురించి పరిశీలించే అవకాశం కలదు.
2) Work Adjustments
Udise+ నందు గల రోల్ ఆధారం చేసుకొని పాఠశాలల యందు మిగులు ఉపాధ్యాయులను ఆన్లైన్ విధానంలో వర్క్ అడ్జస్ట్మెంట్ చేయుటకు మార్గదర్శకాలు తయారు చేయుచున్నారు.
వచ్చేవారం దీనికి సంబంధించిన విధివిధానాలు, ఆన్లైన్ మాడ్యూల్, షెడ్యూల్ మొదలగునవి విడుదల అగును.
3)EIS (TIS)
ఎంప్లాయ్ ఇన్ఫర్మేషన్ సిస్టం ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు తప్పనిసరిగా చెక్ చేసుకుని అందులో ముఖ్యంగా
1)పుట్టినరోజు వివరములు
2)ప్రస్తుత పాఠశాలలో జాయిన్ అయిన తేదీ
3)ప్రస్తుత క్యాడర్లో జాయిన్ అయిన తేదీ
4)ఉద్యోగంలో అపాయింట్ అయిన తేదీ
5)గ్రాడ్యుయేషన్ లెవెల్ లో సబ్జెక్టులు
6)పోస్ట్ గ్రాడ్యుయేషన్ లెవెల్లో సబ్జెక్టులు
7)బీఈడీ లో మెథడాలజీలు
8)ప్రస్తుత క్యాడర్
మొదలగు అన్ని వివరములు ఈరోజు సాయంత్రం లోపల తప్పులు లేకుండా పూర్తి చేసుకోవలెను.
ఎడిట్ ఆప్షన్ రేపు మధ్యాహ్నం 12 గంటలకు క్లోజ్ చేయబడును
5)Academic Calendar
ప్రభుత్వం వారి ద్వారా ముద్రించిన అకాడమీ క్యాలెండర్లు వచ్చేవారు ప్రతి పాఠశాలకు సరఫరా చేయబడును.
4)SMC Elcetions
ప్రభుత్వం వారు విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం ప్రతి పాఠశాల యందు SMC ఎన్నికలు సజావుగా నిర్వహించేటట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు బాధ్యత వహించవలెను.
SMC ఎలక్షన్ ముగిసే వరకు పాఠశాల ప్రధానోపాధ్యాయులకు ఎటువంటి సెలవులు మంజూరు చేయరాదు
7) Facial Attendance
అందరూ ఉపాధ్యాయులు ప్రతిరోజు ఉదయం మరియు సాయంత్రం ఫేషియల్ అటెండెన్స్ తప్పక క్యాప్చర్ చేయవలెను.
6) Teachers Lesson plans
తరగతి గది నందు బోధించు ఉపాధ్యాయుని వద్ద ఆ రోజు, ఆ పాఠ్యాంశానికి సంబంధించిన లెసన్ ప్లాన్ తప్పనిసరిగా తన వద్ద ఉంచుకొని బోధన సాగించవలెను.
ప్రతి ప్రధానోపాధ్యాయుడు తన సహోపాధ్యాయులు లెసన్ ప్లాన్స్ ను రాస్తున్నారా? లేదా? తరగతికి బోధనలో ఉపయోగిస్తున్నారా లేదా అనే విషయంపై శ్రద్ధ వహించవలెను.
8) Below 10 enrollment
పాఠశాలల్లో పది లోపు విద్యార్థులు ఉన్న వాటిని గుర్తించి అందు విద్యార్థులను పెంచే విధంగా కృషి చేయవలెను, ఒకవేళ విద్యార్థులు పెరిగే అవకాశం లేకపోతే వాటిపై తదుపరి చర్యల కొరకు ప్రభుత్వం వారికి నివేదిక సమర్పించబడును.
పూర్తి వివరాలు ఈ కింది డాక్యుమెంట్ డౌన్లోడ్ చేసుకుని చదవగలరు.
Work Adjustment కి cut of date 04.08.2024.
గౌ || కమిషనర్ గారు ఈ రోజు Webex లో చెప్పడం జరిగింది...
Rationalization Norms for Primary Schools
Roll. Posts
1-20 ... 1 SGT Post
21-60..…2 SGT Posts
61-90....3 SGT Posts
91-120..4 SGT Posts
121-150...5 SGT Posts
151-180...1 PS HM +6 SGT
181-210...1 PS HM +7 SGT
Recent Posts
See Allనేడు ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు నేడు ప్రభుత్వ గుర్తింపు పొందిన ఉపాధ్యాయ సంఘాలతో పాఠశాల విద్య డైరెక్టర్ వి. విజయరామరాజు చర్చలు జరపనున్నారు....
コメント