top of page

ఉపాధ్యాయుడిపై విద్యార్థి దాడి


రామభద్రపురం: మతిస్థిమితంలేని ఓ ఎనిమిదో తర గతి విద్యార్థి ఉపాధ్యాయు డిపై మారణాయుధంతో దాడి చేయడం కలకలం రేపింది. ఈ ఘటనపై స్థానికు లు, పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. రామభద్రపురం మండలంలోని కొండ కెంగువ పంచాయతీ జుమ్మువలస ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్న సువ్వాడ అప్పలనాయుడుపై ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థి వెంట తెచ్చుకున్న కత్తిపీటతో అక స్మాత్తుగా దాడి చేశాడు. స్కూల్ నుంచి ఇంటికి వెళ్తున్న అప్పలనాయుడు మాస్టారు తానూ అటువైపే వస్తున్నానని, మీతో వచ్చేస్తాననడంతో రమ్మన్న ఉపాధ్యాయుడిపై దాడిచేశాడు. మాస్టారి తలపై కత్తిపీటతో దాడి చేయడంతో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. అప్పటికే ఉపాధ్యాయుడు చలికాలం దృష్ట్యా మంకీ క్యాప్ పెట్టుకోవడంతో గాయాల తీవ్రత తగ్గిం దని స్థానికులు చెబుతున్నారు. గతంలో ఉపాధ్యాయుడు పనిచేసిన ప్రాంతంలో విద్యార్థి అసభ్యకర మాటలు, ప్రవర్తనను ఇతర ఉపాధ్యాయులతో కలిసి అప్పలనాయుడు మాస్టారు కూడా వారించారు. సత్ప్రవర్తనతో మెలగాలని మందలించడాన్ని మనసులో పెట్టుకుని విద్యార్థి దాడికి పాల్పడ్డాడని భావిస్తున్నారు. ఇదే విషయమై అప్పలనాయుడు, ఆయన బంధువులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా విద్యార్థిని అదుపులోకి తీసుకు న్నారు. స్టేషన్లో పోలీసులపై కూడా ఆ విద్యార్థి దురుసుగా వ్యవహరించ డంతో విద్యార్థి మానసిక స్థితి బాగాలేదని గుర్తించారు. అప్పటికే స్టేషన్లో విద్యార్థి కుటుంబసభ్యులకు విద్యార్థికి మానసిక చికిత్సలు అందజేయా లని ఎస్సై వెలమల ప్రసాదరావు సూచించారు. లేకుంటే మీపై చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.

 
 
 

Comments


bottom of page