ఉద్యోగ సంఘాలకు కొత్త రూల్స్ కోసం అధికారుల సమావేశం: ఉద్యోగ సంఘాలకు ఆహ్వానం.
ఉద్యోగ సంఘాలకు కొత్త రూల్స్ కోసం అధికారులతో సమావేశానికి ఉద్యోగ సంఘాలకు ఆహ్వానం.
ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ సంఘాలు సేవా సంఘాల యొక్క నియమాలు మార్చి కొత్త నియమాలు ప్రవేశ పెట్టుటకు ప్రభుత్వ సాధారణ పరిపాలన శాఖ -ఉద్యోగుల సంక్షేమ శాఖ నుంచి ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలకు ఆహ్వానం అందింది. ఈనెల 16వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి శ్రీ రజత్ భార్గవ ఐఏఎస్ గారి కార్యాలయం నందు రూమ్ నెంబర్ 134 లో గ్రౌండ్ ఫ్లోర్ ,బిల్డింగ్ నెంబర్ 4, ఏపీ సెక్రటేరియట్, వెలగపూడి, అమరావతిలో ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలతో అధికారుల సమావేశం జరుగుతుందని తెలియజేస్తున్నారు. ఈ సమావేశంలో 2001 ఉద్యోగ సంఘాల పునవ్యవస్థీకరణపై అధ్యయనం చేసి ఆ స్థానంలో కొత్తగా పునవ్యవస్థీకరణ చేసి కొత్త నియమాలు ప్రవేశపెట్టడంపై సమావేశం జరుగుతుంది. ఏపీటీఎఫ్ ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయిస్ అసోసియేషన్ గవర్నమెంట్ క్లాస్ ఫోర్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం ఆఫర్స ఉన్నాయి
ఈ సమావేశానికి గుర్తింపు పొందిన సంఘాల యొక్క అధ్యక్ష ప్రధాన కార్యదర్శులకు ఆహ్వానిస్తున్నారు. ఆహ్వానం అందుకున్న సంఘాలలో ఏపీ ఎన్జీవో అసోసియేషన్, ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం, ఎస్టీయూ, యూటీఎఫ్, పి ఆర్ టి యు, ప్రభుత్వ డ్రైవర్ల సంఘం,ఏపీటీఎఫ్, ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ ,ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయిస్ అసోసియేషన్, ఏపీ గవర్నమెంట్ క్లాస్ ఫోర్ ఎంప్లాయిస్ అసోసియేషన్, ఆపస్ ఉన్నాయి.
ఏపీ టీచర్స్ టీవీ
Recent Posts
See Allనేడు ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు నేడు ప్రభుత్వ గుర్తింపు పొందిన ఉపాధ్యాయ సంఘాలతో పాఠశాల విద్య డైరెక్టర్ వి. విజయరామరాజు చర్చలు జరపనున్నారు....
留言