ఉద్యోగుల ఒకరోజు జీతం విరాళాల ఉత్తర్వులు విడుదల . తెలుగు అనువాదం . మీ జీతం నుంచి ఎంత కట్ అవుతుందో ఇక్కడ చూసుకోవచ్చు.
Updated: Sep 18
ఇటీవల విజయవాడలో సంభవించిన భారీ వర్షాలు వరదల బాధితుల కోసం సహాయార్థం ఆంధ్రప్రదేశ్ లోని వివిధ సంస్థల ఉద్యోగులు ప్రజాప్రతినిధులు విరాళాలు ప్రకటించడం విధితమే దీనికి సంబంధించిన ఉత్తర్వులను ప్రభుత్వం నేడు విడుదల చేసింది ఆ ఉత్తర్వుల తెలుగు అనువాదాన్ని ఈ కింద చూడవచ్చు
ఉత్తర్వుల్లో పేర్కొన్న సూచికలను అనుసరించి ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్ అసోసియేషన్ అధ్యక్షుడు ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ల జేఏసీ చైర్మన్ అమరావతి జేఏసీ చైర్మన్ ఏపీ సివిల్ సర్వీస్ అసోసియేషన్ అధ్యక్షుడు సివిల్ సర్వీసెస్ ఇన్స్టిట్యూ ట్ ఆంధ్ర ప్రదేశ్ విజయవాడ వారు ఆంధ్రప్రదేశ్ సర్పంచుల సమాఖ్య ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ ఆంధ్రప్రదేశ్ గెజిటెడ్ ఆఫీసర్స్ జేఏసీ చైర్మన్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఉద్యోగుల సంఘ జేఏసీ చైర్మన్ ఇటీవల వచ్చిన తుఫాను,వరదల్లో బాధితులైన వారికి సహాయార్థం, ముఖ్యంగా విజయవాడ నగరంలో వచ్చిన వరద బాధితుల సహాయార్థం తమ ఉద్యోగుల ఒకరోజు మూల వేతనాన్ని విరాళంగా ప్రకటించుటకు ప్రాతినిధ్యం చేసి ఉన్నారు.
2.పైన తెలిపిన ప్రాతినిధ్యం ప్రకారం వారి వారి అక్టోబరు నెలలో అందుకొను సెప్టెంబర్ 2024 నెల జీతాలు /పెన్షన్లు /గౌరవ వేతనముల నుంచి కింద తెలిపిన విధంగా మినహాయించబడునని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
i. ప్రభుత్వ/ సంఘాల /సంస్థల /విశ్వవిద్యాలయాల/ స్థానిక సంస్థల ఉద్యోగులు మరియు పింఛనుదారుల ఒకరోజు మూలవేతనము
ii. ప్రొహిబిషన్ & ఎక్సైజ్ శాఖ వారి ప్రాతినిధ్యం మేరకు ఆ శాఖలోని ఉద్యోగుల యొక్క రెండు రోజుల మూలవేతనము
iii. సర్పంచులు, ఎంపీటీసీలు మరియు జడ్పిటిసిల యొక్క ఒక నెల గౌరవ వేతనము
3.పైన తెలిపిన ఉద్యోగులు, ప్రజా ప్రతినిధుల యొక్క డి డి వో లు పైన తెలుపబడిన విధంగా ప్రక్రియ పూర్తి అగుటను పర్యవేక్షించవలెను. ఈ మినహాయింపులన్నీ సంబంధిత డి డి వో లు పెన్షన్ ప్రాసెసింగ్ అధికారులు సంబంధిత బిల్లులను సమర్పించడం ద్వారా ముఖ్యమంత్రి సహాయ నిధి యొక్క హెడ్ ఆఫ్ అకౌంట్ 8448-00-111-01-15-001-001VN కి జమచేయవలెను .
4. ఎవరైనా ఉద్యోగులు గాని పెన్షనర్లు గాని తమ ఒకరోజు మూలవేతనాన్ని పైన పేర్కొన్న విధంగా ప్రభుత్వానికి జమ చేయడానికి అయిష్టత కలిగి ఉంటే అట్టివారు ఒక లేఖను తమ డిడిఓకి సమర్పించి ఈ ప్రక్రియ నుంచి మినహాయింపు పొందవచ్చు. అట్టి ఉద్యోగులను ప్రభుత్వ ఉత్తర్వులను అనుసరించి ఈ ప్రక్రియ నుంచి వారి డీడీవోలు మినహాయించవలెను.
5. ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ డైరెక్టర్ /పే అండ్ అకౌంట్స్ ఆఫీసర్/వర్క్స్ ఎకౌంట్స్ డైరెక్టర్ మరియు రాష్ట్రంలోని అందరు డి డి ఓ లు ఈ ఉత్తర్వులు విజయవంతంగా అమలు జరిగేలా చూడాలని ఆయా విరాళాలు ముఖ్యమంత్రి సహాయ నిధికి ఎటువంటి అవాంతరాలు లేకుండా జమ అయ్యేలాగా చూడాలని ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి సహాయనిధి రెవెన్యూ కార్యదర్శి కి ఏపీ సచివాలయ కార్యదర్శికి ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శికి ఎట్టి పరిస్థితుల్లో తెలియజేయవలసిందిగా ఆదేశించారు
6. ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ డైరెక్టర్ /పే అండ్ అకౌంట్స్ ఆఫీసర్/వర్క్స్ ఎకౌంట్స్ డైరెక్టర్ మరియు రాష్ట్రంలోని అందరు డి డి ఓ లు అన్ని విశ్వవిద్యాలయాల రిజిస్టార్లు వారి నియంత్రణలోని పరిపాలన పరిధిలోని ఉద్యోగులందరికీ ఈ ప్రక్రియను విజయవంతం చేయుటకు ఆదేశాలు జారీ చేయవలసిందిగా పేర్కొన్నారు.
7. పై ఉత్తర్వులు అమలు జరుగుటకు పేరోల్ సిస్టంలో తగిన ఫీచర్ను చేర్చుటకు తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఏపీసి ఎఫ్ఎస్ఎస్ సీఈఓ ని ఆదేశించారు.
జీవో కాపీని ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు
మీ నెల మూల వేతనం ప్రకారం మీ ఒకరోజు మూల వేతనం ఎంతనో సెప్టెంబర్ జీతాల నుంచి ఎంత మినహాయించబడుతుందో ఈ కింది పట్టికను చూసి తెలుసుకోవచ్చును. ఈ పోస్టుపై మీ అభిప్రాయాలను కిందనున్న కామెంట్ సెక్షన్లో తెలుపగలరు.
జీతం నుంచి ఒకరోజు మూలవేతనాన్ని కట్ చేయవద్దని డీడీఓ కి సమర్పించే లేఖ
Recent Posts
See Allనేడు ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు నేడు ప్రభుత్వ గుర్తింపు పొందిన ఉపాధ్యాయ సంఘాలతో పాఠశాల విద్య డైరెక్టర్ వి. విజయరామరాజు చర్చలు జరపనున్నారు....
Comments