top of page
Writer's pictureAP Teachers TV

ఉద్యోగ,ఉపాధ్యాయ సంఘాలను కీలక సమావేశానికి ఆహ్వానించిన ప్రభుత్వం

ఉద్యోగ,ఉపాధ్యాయ సంఘాలను కీలక సమావేశానికి ఆహ్వానించిన ప్రభుత్వం

ఇప్పుడే అందిన తాజా వార్త. ఏపీ ఉద్యోగ, ఉపాధ్యాయుల కు శుభవార్త. ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలు డిమాండ్ల సమీక్ష కోసం నిర్వహించ బోతున్న సమావేశానికి ఏపీ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ లో సభ్యత్వం గల ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల కు ప్రభుత్వ సాధారణ పరిపాలన శాఖ నుంచి ఆహ్వానం అందింది. వివిధ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వానికి ఇచ్చిన వినతులు, వాటిలో గల సమస్యలు, డిమాండ్లు, పరిష్కారాల సమీక్ష కోసం ఈ నెల 27 న మధ్యాహ్నం 3:30 కు వెలగపూడి సచివాలయంలో గల గ్రౌండ్ ఫ్లోర్ మొదటి బ్లాక్‌లో సమావేశం నిర్వహించ బోతున్నట్లు ఆ సమావేశానికి ఆహ్వాన లేఖలో పేర్కొన్న సంఘాలన్నీ హాజరు కావాలని అభ్యర్థి స్తూ ప్రభుత్వం ఆహ్వానం పంపింది.


ఈ ఆహ్వాన లేఖలో పేర్కొన్న దాని ప్రకారం వివిధ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు ఇచ్చిన వినతులలోని డిమాండ్లన్నీ పరిష్కారమైపోయినట్లుగా కింద పట్టికలు చూపిస్తున్నారు. గమనించగలరు. ఈ పట్టికని ప్రతి ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘం, ప్రతి ఉద్యోగి, ప్రతి ఉపాధ్యాయుడు క్షుణ్ణం గా పరిశీలించి ఈ వీడియో కింద మీ అభిప్రాయాల ను కామెంట్ చేయగలరని కోరుతున్నాం.



ఈ నెల 27 న జరిగే సమావేశం లో ఆశాజనక ఫలితాలు వస్తాయ ని ఆశిద్దాం. ఈ ఆహ్వాన లేఖను ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్‌లో గల లింక్ మీద నొక్కి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చెయ్యండి షేర్ చేయండి మీరు ఇంత వరకు మన ఏపీ టీచర్స్ టీవీ యూట్యూబ్ ఛానల్‌కి సబ్‌స్క్రైబ్ చేసుకో కపోతే ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి. గంట గుర్తు మీద నొక్కి అన్ని నోటిఫికేషన్లను నేరుగా మీ మొబైల్ లో పొందండి.

వీడియో చూడండి



0 comments

Comments


bottom of page