ఉద్యోగ ఉపాధ్యాయుల ఆటోమేటిక్ అడ్వాన్స్ మెంట్ స్కీమ్ శుభవార్త AAS Automatic Advancement Scheme
Updated: Oct 12
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయులకు శుభవార్త చెప్పింది. ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కీం సంబంధించి శుభవార్త చెప్పింది. ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వులను తెలుగు లో అనువదించడం జరిగింది. ఆ అనువాదాన్ని కింద చదువుకోవచ్చు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
ఖజానాలు మరియు ఖాతాల డైరెక్టరేట్
మెమో.సంఖ్య: FIN02-18069/143/2024-H SEC-DTA 10/10/2024
విషయం: PS - T&A శాఖ - ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కీమ్ (AAS) - 12/24 సంవత్సరాల తర్వాత అవసరమైన అర్హతలను పొందడం - AAS కు నియామకం - వివరణ ఇస్తున్నది - సంబంధితం
సూచనలు:
ఈ కార్యాలయ లేఖ నెం. M1/14078/2010, తేదీ 24-08-2010 నుండి సెక్రటరీ ఆఫ్ గవర్నమెంట్, ఫైనాన్స్ శాఖకి అందజేయడం జరిగింది.
మెమో.నెం. 17509/146/PC.II/A1/2012, ఫైనాన్స్ (PC.I) శాఖ, తేదీ 09-08-2012.
ఈ కార్యాలయ మెమో H1/6697/2014 తేదీ 05-08-2015.
ఈ కార్యాలయ లేఖ నెం. FIN02-18022/29/2018-H Sec-DTA, తేదీ 11-03-2020 నుండి APUTF కి అందజేయడం జరిగింది.
లేఖ ROC NO. E1/Education/2024, తేదీ 24-08-2024 నుండి DTAO, తిరుపతి.
విషయంపై ప్రత్యేక అవగాహన ఇవ్వబడింది: అన్ని రాష్ట్ర డిటిఏఓలకు సబ్జెక్టు మరియు సూచనలు వివరించబడింది. వివిధ సందర్భాలలో ఉద్యోగుల AAS క్లెయిమ్‌లను 1 నుండి 4వ సూచనల ప్రకారం క్లెయిర్ఫికేషన్ అని పేర్కొంటూ తిరస్కరించడం జరిగింది. డిటిఏఓలు ఈ క్లెయిర్ఫికేషన్‌లను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. గతంలో, 16/24 సంవత్సరాల పూర్తయిన తేదీ నుండి SPP-I/SPP-II కు ఉద్యోగిని నియమించేందుకు AAS లో ఎలాంటి నిబంధన లేదు అని స్పష్టం చేయబడింది. కానీ, ఇందులో ఉద్యోగుల్ని వారి విద్యా అర్హతలు పొందిన తేదీ నుండి నియమించడానికి ఎలాంటి నిషేధం లేదని స్పష్టం చేయబడింది, కానీ కొంత నియామకాల షరతులను పాటించాలి.
కొన్ని షరతులు:
(a) ఉద్యోగి ప్రొమోషన్‌లో దరఖాస్తు చేసుకున్నతేదీ మరియు అవసరమైన అర్హతలు పొందిన తేదీ తర్వాత ఏవైనా అవకాశాలు లేని విధంగా నిర్దేశించాలి.
(b) ఉద్యోగి ముందు ప్రొమోషన్‌ను స్వీకరించకపోవాలి.
మరిన్ని సూచనలు: డిటిఏఓలు శాసన ఉత్తర్వుల్లో పై షరతులను తప్పనిసరిగా చేర్చాలి మరియు వారి పరిధిలోని అన్ని DDOలకు తెలియజేయాలి. ప్రస్తుత ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కీమ్ అమలుపరచడం గురించి అందరికీ తెలియజేయాలి మరియు దీనిని పాటించాలి.
(ఈ క్రింది దృవీకరణ డిటిఏ నుండి అభిప్రాయం పొందింది)
ఫైలు నెం. FIN02-18069/143/2024-H SEC-DTA
జి.వి.ఎస్. తిరుపతి రాజు ఖజానాలు మరియు ఖాతాల డైరెక్టర్ తరఫున
సకల రాష్ట్ర డిటిఏఓలకు (FTP/e-mail ద్వారా మాత్రమే)
ఫైలు నెం. FIN02-18069/143/2024-H SEC-DTA
ఇది చేస్తే అర్హత తీసుకుంటుంది.
ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కీమ్ పై ఖజానా శాఖ తీపి కబురు
ఫలించిన ఎపిటిఎఫ్ కృషి
ఎట్టకేలకు ఉద్యోగ, ఉపాధ్యాయులకు దసరా కానుకగా ఆర్ధిక శాఖ ఖజానా శాఖ 18069 మెమో ద్వారా తీపి కబురు అందించింది. ఈ మెమో ప్రకారము శాఖాపరమైన పరీక్ష / బేసిక్ అర్హత ఉత్తీర్ణత సాధించలేదని పదోన్నతి అవకాశం ఇంతవరకు కోల్పోని (Forefiet) వారికి మరియు ఇప్పటి వరకు పదోన్నతి (Relinquish ) "తిరస్కరించటం చేయని వారికి మాత్రమే 12/24 సంవత్సరాల సర్వీసు నిండిన తేదీ "తర్వాత కూడా శాఖాపరమైన పరీక్ష పాసయితే ఆ పరీక్ష పాసైన నాటి నుంచి 12/24 స్కేళ్ళలో వేతన స్థిరీకరణ ద్వారా ప్రభుత్వ దాని ఆర్థిక లాభం వర్తింప చేయబడుతుంది". ఈ మెమో వలన 12/24 ఏళ్ల సర్వీసు నిండిన తేదీకి శాఖాపరమైన పరీక్ష / బేసిక్ అర్హత ఉత్తీర్ణత పొందక 12/24 సంవత్సరాల స్కేలు పొందని వేలాది మందికి ఆర్థిక లాభం చేకూరనుంది. అలాగే పాత ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కీం /పదోన్నతికి సంబంధించిన ఎఫ్ ఆర్ 22(బి) / ఎఫ్ ఆర్ 22 (ఏ) లను రివైజ్ చేసుకోవచ్చు. 12 ఏళ్ళ స్కేలు ఇవ్వలేదని 18 యేళ్ళ స్కేలు పొందని వారు కూడా 12&18 ఏళ్ళ స్కేలులో వేతన స్థిరీకరణ చేసుకోవచ్చు. ఇంతకాలం క్షేత్రస్థాయిలో ఇష్టారాజ్యంగా వ్యవహరించిన అధికారులకు ఈ ఉత్తర్వు కళ్ళు తెరిపించనుంది.
మొదటి పదోన్నతి పోస్టులో 12/24 AAS స్కేళ్ళలో వేతన నిర్ణయానికి 50 సంవత్సరాలు సర్వీస్ నిండిన వారికి శాఖాపరమైన పరీక్షల నుండి కూడా పదోన్నతికి ఇచ్చే మినహాయింపు ఏ ఏ ఎస్ కు ఇవ్వవలసివుంది. ఒక్కొక్కసారి అవసరం లేని విషయాలలో కూడా గెలికి సమస్యను జటిలం చేయడం, తదుపరి ఆ సమస్యపై కంటితుడుపు ప్రాతినిధ్యాలు చేయడం, కొంతకాలం తర్వాత దానిని భూస్థాపితం చేయడం చూశాం. ఇదే పని గతంలో ఒక ఉపాధ్యాయ సంఘం చేసింది.
సీనియారిటీ వున్నప్పటికీ అర్హతలు లేకపోతే, సంబంధిత విద్యార్హతలు సాధించిన నాటి నుండే ప్రమోషన్ ఇవ్వడం ఆనవాయితీ. ఇదే సూత్రం ప్రమోషన్ స్కేళ్లకు కూడా వర్తిస్తుంది. ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కీం ద్వారా 12/24 సంవత్సరాలు పూర్తయిన నాటికి అవసరమైన విద్యార్హతలు పొంది వుండకపోతే, అవి సంపాదించిన నాటి నుంచి ఇవ్వడం ఎంతోకాలంగా అమలవుతున్న పద్ధతి.
కానీ ఈ విషయంలో కూడా క్లారిఫికేషన్ కోసం రాసి,12/24 సంవత్సరాలు పూర్తయిన నాటికి విద్యార్హతలు లేని వాళ్ళందరికీ ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కీమ్ ను ఆపేందుకు ట్రెజరీ శాఖకు ఓ సంఘం పెట్టిన లేఖ పునాది వేసింది. ఇది అన్యాయం అంటూ గతంలో వివిధ సంఘాలు ట్రెజరీ అధికారుల ద్వారా, మరియు నేరుగా కూడా ట్రెజరీ శాఖ డైరెక్టర్ కు పరిస్థితిని నివేదించడం జరిగింది. చివరకు పరీక్ష పాసైన తేదీ నుండి ఇచ్చేందుకు అంగీకరించారు.
అలాగని ఇది మొదటి ఉన్న పరిస్థితి కూడా కాదు. సీనియారిటీ ఉండి విద్యార్హతలు లేకపోవడం వల్ల ప్రమోషన్ పొందని వాళ్లకు ఈ 12/24 స్కేలు విద్యార్హతలు పొందిన నాటి నుండి కూడా వర్తించవని తాజాగా ఇచ్చిన క్లారిఫికేషన్ లో తెలియజేశారు. మొదట ఈ రకమైన పరిస్థితి ఉండేది కాదు. ఆ ఉపాధ్యాయ సంఘం చపలచిత్త లేఖ ఫలితం ఉపాధ్యాయలోకం యావత్తూ అనుభవించాల్సి వచ్చింది.
(AAS) సంబంధించి 12 ఇయర్స్ కానీ, 24 ఇయర్స్ కానీ పూర్తయిన తర్వాత డిపార్ట్మెంట్ టెస్ట్ లు పాస్ అయిన వాళ్ళకి మాత్రమే గతంలో AAS -12 కానీ 24 సంవత్సరాల స్కేలు గాని ఇచ్చే వీలుంది . DTA గారు తాజాగా ఇచ్చిన ఉత్తర్వులు కేవలం ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ తిరుపతి జిల్లా శాఖ చూపిన చొరవ ఫలితం ఆంధ్ర ప్రదేశ్ లో వేలాది ఉద్యోగ ఉపాధ్యాయులకు ఉపశమనం కలిగించింది. కొమ్ములు తిరిగిన సంఘాలు, సుదీర్ఘ కాలంగా పదవుల్లో వున్న నాయకులు సాధించలేని ఒక కీలక సమస్యను ఎపిటీఎఫ్ జిల్లా శాఖ ఫైలు నడిపి విజయం సాధించింది. పై క్లారిఫికేషన్ లో "various instances have come to the notice of the undersigned" అని ఉంది. అనవసరమైన నిర్వచనాలు ఇచ్చి ఉద్యోగులను ఇబ్బంది పెట్టొద్దని కూడా. పేర్కొనడం జరిగింది.
వివరాల్లోకి వెళితే......
తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం పునరావాసం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పనిచేసే సులోచన గారికి 12 సంవత్సరాల సంబంధించిన స్కూల్ అసిస్టెంట్ క్యాడర్లో ఏఏఎస్ (12 సంవత్సరాల స్కేలు) ఇవ్వకపోవడంపై తిరుపతి జిల్లా శాఖను సంప్రదించగా ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి బాలు స్పందించారు. సమస్య మీద రాష్ట్ర సంఘం సూచనల మేరకు చంద్రగిరి ఎస్టిఓ ను కలిసి సమస్య మీద వినతి పత్రం ఇవ్వడం జరిగింది. చంద్రగిరి STO తిరుపతి DTO కి ఎపిటీఎఫ్ ఇచ్చినటువంటి ప్రాతినిధ్యం మీద క్లారిఫికేషన్ కోరుతూ తిరుపతి డిటిఓ విజయవాడ DTA క్లారిఫికేషన్ కోసం పంపడం జరిగింది. ఆమేరకు DTA ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. అన్ని రకాల సహాయ సహకారాలు అందించిన చంద్రగిరి STO మరియు తిరుపతి DTO కు ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.
రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయ లోకం ఎదుర్కొంటున్న ఒక కీలక సమస్యకు ఎపిటీఎఫ్ తిరుపతి జిల్లా శాఖ పరిష్కారం కనుగొనడం శుభసూచకం.
- మోహన్ దాస్, రాష్ట్ర నాయకులు, ఎపిటిఎఫ్
Recent Posts
See Allనేడు ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు నేడు ప్రభుత్వ గుర్తింపు పొందిన ఉపాధ్యాయ సంఘాలతో పాఠశాల విద్య డైరెక్టర్ వి. విజయరామరాజు చర్చలు జరపనున్నారు....
Komentáře