ఈరోజు రాష్ట్ర విద్యాశాఖ అధికారులతో జరిగిన సమావేశంలో వెలువడిన నిర్ణయాలు
- AP Teachers TV
- Mar 21
- 1 min read
ఈరోజు విద్యా భవన్ లో జరిగిన సమావేశంలో డైరెక్టర్ శ్రీ విజయరామరాజు, అడిషనల్ డైరెక్టర్ శ్రీ ఏ.సుబ్బారెడ్డి, ఎస్.సి.ఈ.ఆర్.టి డైరెక్టర్ శ్రీ ఎంవీ కృష్ణారెడ్డి పాపాల్గొన్నారు

60 కన్నా తక్కువ మంది విద్యార్థులున్న యుపి స్కూళ్ళను కొనసాగించుటకు అంగీకరించారు.స్కూల్ అసిస్టెంట్ లను కొనసాగించుటకు కూడా సూత్రప్రాయంగా అంగీకరించారు
రాబోయే విద్యాసంవత్సరానికి రూపొందించిన అకడమిక్ క్యాలెండర్ లో పొందుపరిచిన అంశాల గురించి వివరించడం జరిగింది.
9వ తరగతి విద్యార్థులకు మార్చి 15 నాటికి వార్షిక పరీక్షలు పూర్తిచేసి అనంతరం పదవ తరగతి సిలబస్ కు సంబంధించి బ్రిడ్జి కోర్సు నిర్వహిస్తామన్నారు.
పదవ తరగతి సిలబస్ ను నవంబర్ ఆఖరుకు పూర్తి చేసి డిసెంబర్ 5 నుండి 100 యాక్షన్ ప్లాన్ అమలు చేస్తారు. సెలవు రోజులలో యాక్షన్ ప్లాన్ ఉండదు.
హైస్కూల్ విద్యార్థులతో మాక్ అసెంబ్లీ నిర్వహిస్తామన్నారు
ఎస్ఎస్సి పరీక్షలు పూర్తయ్యే నాటికి సమగ్రమైన ఒకే యాప్ ను అమలు చేస్తారు.
జీవో 117 ప్రత్యామ్నాయ పాఠశాలల ఏర్పాటుపై ఎస్ఎంసి తీర్మానాలకు అనుగుణంగానే నిర్ణయాలు తీసుకుంటామన్నారు.
అనంతపురం జిల్లా ఇంగ్లీష్ పదోన్నతులపై చర్చించామని, సానుకూల నిర్ణయం ప్రకటిస్తామన్నారు.
పురపాలక ఉన్నతపాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టులు అవసరమై ఉన్నందున పోస్టుల ఉన్నతీకరణ, పోస్టుల మంజూరును రీఅపోర్షన్ మెంట్ ప్రక్రియ సందర్భంగా పూర్తి చేస్తామన్నారు.
ఎస్ఎస్సి పరీక్షలు నిర్వహించే పాఠశాలల్లో పరీక్షలు నిర్వహించని రోజు ఉదయం పూట పాఠశాల నిర్వహించేలా సూచనలు చేయాలని కోరగా సానుకూలంగా స్పందించి ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ ద్వారా సమాచారం పంపిస్తామన్నారు.
ప్రతి శనివారం నో బ్యాగ్ డే అమలు చేస్తామన్నారు.
స్కూల్ గేమ్స్,కంప్యూటర్ శిక్షణ తదితర అంశాలపై కూడా చర్చించారు
మెడికల్ రీయంబర్స్మెంట్ బిల్లుల మంజూరులో గల ఇబ్బందులను ప్రస్తావిస్తూ ప్రాతినిధ్యం చేయగా వచ్చే వారం జరిగే సమావేశంలో సమీక్షిస్తామన్నారు. ఈ హెచ్ ఎస్ ట్రస్ట్ నుంచి మంజూరైన బిల్లులకు సంబంధించిన మంజూరు ఉత్తర్వులు వారం రోజుల లోగా విడుదల చేయిస్తానన్నారు.
Comments