ఈరోజు గుర్తింపు పొందిన ఉపాధ్యాయ సంఘాలతో జరిగిన చర్చలకు సంబంధించిన సమాచారం
ఈరోజు గుర్తింపు పొందిన ఉపాధ్యాయ సంఘాలతో జరిగిన చర్చలకు సంబంధించిన సమాచారం..
**పాఠశాల సమయాలకు సంబంధించి ప్రస్తుత ఇచ్చినటువంటి ట్రయిల్ పరిశీలన కోసం మాత్రమే. 2024 డిసెంబర్ ఒకటి నుంచి పాత టైమింగ్స్ తో మాత్రమే కొనసాగుతాయి.
** పేరెంట్ టీచర్స్ సమావేశం డిసెంబర్ 7వ తేదీన పాఠశాల స్థాయిలో జరుగుతుంది..
** బదిలీలకు సంబంధించిన ప్రిఫరెన్షియల్, స్పెషల్ కేటగిరి నామ్స్ GAD వారు ఇచ్చిన నామ్స్ ఆధారంగా నిర్వహిస్తారు.
జీవో47. తేదీ 22 5 2023లో ఇచ్చిన ఉత్తర్వులను మరోసారి పరిశీలించి తనుగుణంగా నిబంధనలు రూపొందిస్తారు .
.**ప్రాథమిక పాఠశాలలో మోడల్ ప్రైమరీ పాఠశాలలపై చర్చ జరిగింది.. అయితే గ్రామపంచాయతీ తో చర్చించి ఏ పాఠశాలల్ని మోడల్ పై మరీ పాఠశాలగా మార్చాలో తగు నిర్ణయం చేస్తామని తెలిపారు.
** ప్రమోషన్ ప్యానల్ ఇయర్ ని జూన్ 1 నుంచి మే 31 వరకు, ప్రధానోపాధ్యాయులకు గతంలో ఉన్న సెప్టెంబర్ నుంచి ఆగస్టు పేనల్ ఇయర్ గా పగిణించటంపై చర్చ జరిగింది.
**ఉపాధ్యాయుల పని సర్దుబాటుకు సంబంధించి ప్లస్ టు పాఠశాలలు, ఇతర పాఠశాలల్లో అవసరం మేరకు పని సర్దుబాటు చేసుకోవడానికి డీఈఓ లకు తగిన అధికారాలు ఇచ్చారు.
** ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులకు 36 పీరియడ్స్ మించి వర్కులోడ్ లేకుండా తగు నిబంధనలను రూపొందిస్తారు.
**లీడర్షిప్ ట్రైనింగు, ఎఫ్ఎల్ఎం ట్రైనింగులు సంబంధించి నాన్ రెసిడెన్షియల్ పద్ధతిలో మాత్రమే జరపాలని కోరాము. ఎస్పిడి గారి దృష్టిలో పెట్టి తప్పక తగు నిర్ణయం చేస్తామని చెప్పారు.
**DEO పూల్ లో ఉన్న ఉపాధ్యాయుల కు శాశ్వత పాఠశాలలను
కేటాయించాలని, అర్హత కలిగిన వారికి తక్షణం ప్రమోషన్స్ ఇవ్వాలని కోరాము.
** ఏలూరు జిల్లా కామవరపుకోట మండలాన్ని ఏలూరు రెవిన్యూ డివిజన్లోనే ఉంచాలని ప్రాతినిధ్యం చేసాము.
అని ఉపాధ్యాయ సంఘాలు చెప్పాయి
Recent Posts
See Allఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యాయుల బదిలీ నియంత్రణ చట్టం, 2025 (డ్రాఫ్ట్) ప్రకటన: భారత గణరాజ్యంలోని డెబ్బై ఆరవ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్...
Comments