top of page

ఈరోజు ఆగస్టు 1 న మళ్ళీ అప్ డేట్ వచ్చింది: స్కూల్ అటెండెన్స్ యాప్





నిన్నే అప్‌డేట్ అయిన స్కూల్ అటెండెన్స్ అప్లికేషన్ నేడు అనగా ఆగస్టు 1 న మళ్లీ అప్ డేట్ అయింది. ఈ అప్ డేట్ లో కొత్తగా ఒక ఫీచర్ చేర్చడం జరిగింది. అదేమంటే స్టూడెంట్స్ మార్క్స్ ఎంట్రీ అనే ఆప్షన్ చేర్చడం జరిగింది. ఈ ఆప్షన్‌లో విద్యా సంవత్సరాలను ఆయా విద్యా సంవత్సరాల అన్ని పరీక్షల యొక్క మార్కులను ఎంటర్ చేయడానికి ఆప్షన్ ఇచ్చారు. ఇందులో తరగతి వారీగా, సెక్షన్ వారీగా పిల్లల యొక్క మార్కులను ఎంటర్ చేయవల్సి ఉంటుంది. తరగతి సెక్షన్ ఎంచుకున్న తర్వాత పిల్లల యొక్క పేరు గానీ ఐడి నెంబర్ కానీ సెర్చ్ బార్‌లో ఎంటర్ చేసి టాప్ చేసినట్లయితే పిల్లల పేర్లు వస్తాయి. అప్పుడు వారి యొక్క మార్కులను ఎంటర్ చేయవచ్చు. అయితే ఈ  ఆప్షన్‌ ఇప్పుడు సరిగా పనిచేయడం లేదు. పూర్తిగా అభివృద్ధి చేయలేదు. అలాగే చిత్రంగా ఈ ఆప్షన్‌లోఈ విద్యా సంవత్సరం అనగా 2024 -25 విద్యాసంవత్సరం ఇవ్వలేదు. బహుషా తదుపరి అప్‌డేట్‌లో ఈ ఫీచర్ ని పూర్తిగా అభివృద్ధి చేస్తారేమో వేచిచూద్ద్దాం.

ఈ యాప్‌ని/అప్ డేట్ ని కింది బటన్ నొక్కి డౌన్ లోడ్ చేసుకోవచ్చు.



Tap On Herat Symbol If You Like This Post






 
 
 

Comments


bottom of page