top of page
Writer's pictureAP Teachers TV

ఈ రోజు జేడీ సర్వీసెస్ రామలింగం గారితో FAPTO నాయకుల భేటి:సమావేశపు వివరాలు


1. 2021 బదిలీల్లో వచ్చి రేషనలైజేషన్ కు గురి అయిన వారందరికీ మేపింగ్ తో నిమిత్తం లేకుండా 5పాయింట్లతో బాటు ఓల్డ్ స్టేషన్ పాయింట్స్ కూడా ఇస్తారు. ఈ విషయం గురించి ఈ రోజు మధ్యాహ్నం webex లో డియిఓ లకు చెబుతారు.


2. పిడిలకు PET లు ఖాళీ చేస్తున్న 8 సం.వెకన్సీలు, కొత్తగా మంజూరు చేసిన పిడి పోస్టులు కౌన్సెలింగ్ లో చూపుతారు.


3. రేషనలైజేషన్ లో కదిలే జూనియర్స్ కు మాత్రమే పాయింట్లు, ఓల్డ్ స్టేషన్ పాయింట్స్ ఇస్తారు.


విల్లింగ్ ఇచ్చే సీనియర్స్ కు ఇవ్వరు.


4) 2 సం.లోపు సర్వీస్ ఉన్న బ్లైండ్ టీచర్స్ రేషనలైజేషన్ లో కదలనవసరం లేదు.


5) +2స్కూల్స్ కు పోస్టులు ఇప్పుడు ఇవ్వరు. వారికి పోస్టులు తర్వాత కేటాయిస్తారు


6) +2 పోస్టులకు సీనియారిటీ మెరిట్ కం రోస్టర్ ఆధారంగా నిర్ణయిస్తారు


*విద్యామంత్రి , విద్యాశాఖ అధికారులతో ఈరోజు ఉపాధ్యాయ సంఘాలు బదిలీల్లో ఉన్న సమస్యల మీద చర్చించారు.ఈ సందర్భంగా వచ్చిన అంశాలు*


2021 బదిలీల్లో వచ్చి ఇప్పుడు మ్యాపింగ్ వల్ల ,రేష్మలైజేషన్ వల్ల గాని వెళుతున్న ఉపాధ్యాయులకు పాత స్టేషన్ పాయింట్స్ మరియు రేషనలైజేషన్ పాయింట్స్ ఐదు ఇస్తారు..


రేష్నలైజేషన్లో బదిలీ అవుతున్న వారికి ఎలాంటి నిబంధనలు వర్తించవు. అయితే విజువల్లి చాలెంజ్డ్ వారికి మినహాయింపు ఉంటుంది.


రేష్నలైజేషన్లో గాని మ్యాపింగ్ లో గానీ సీనియర్స్ వెల్డింగ్ ఇస్తే ఎలాంటి పాయింట్లు రావు..


ఎల్పీ లందరూ అప్లై చేసుకోవాలి.


ఎల్ఎఫ్ఎల్ పోస్టులలో ఆ జిల్లాలో కటాఫ్ విద్యార్థుల పైన ఉన్నవారు 8 సంవత్సరాలు పూర్తి కాకుండా లేదా రేషనలైజేషన్ కాకుండా ఉంటే అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు .


ఏజెన్సీ టు ప్లేన్.. ప్లేన్ టు ఏజెన్సీ వారికి అవకాశం ఇస్తారు.


ఉపాధ్యాయుల సీనియార్టీ మెరిట్ కం రోస్టర్ పద్ధతిలోనే ఉంటుంది .


8 సంవత్సరాలు పూర్తయిన పి ఈ టి ఖాళీలు, అప్ గ్రేడేషన్ ఖాళీలన్నింటిని పీడీలకు బదిలీలలో ఖాళీగా సూచిస్తారు .


టీచింగ్ లో ఉన్న కాంట్రాక్టు ఉద్యోగుల్ని మాత్రమే స్పోజ్. వర్తిస్తుంది.


ఎయిడెడ్ పాఠశాలల నుంచి వచ్చి ప్రభుత్వంలో మెర్జె అయిన ఉపాధ్యాయులు రేష్నలైజేషన్లో గాని మ్యాప్లింగ్లో గాని బదిలీ అవుతుంటే మాత్రమే అప్లై చేసుకోవాలి మిగిలిన వాళ్ళు అప్లై చేసుకోవాల్సిన పనిలేదు.


ఓల్డ్ స్టేషన్ పాయింట్స్ ఎనేబుల్ ,అప్లికేషన్ లో ఏమైనా పొరపాట్లు ఉంటే రేపు ఎంఈఓ ల వద్ద సరి చేయించుకోగలరు..

0 comments

Comments


bottom of page