ఇజ్రాయెల్‌లో 15 వేల ఉద్యోగాలు.. నెలకు రూ.2లక్షల జీతం
వేల సంఖ్యలో కార్మికులను నియమించుకునేందుకు ఇజ్రాయెల్ ఇటీవల సంప్రదించిందని భారత్‌లోని నేషనల్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (NSDC) వెల్లడించింది.
దిల్లీ: యుద్ధం కారణంగా కార్మికుల కొరత ఎదుర్కొంటున్న ఇజ్రాయెల్ .. భారత్ నుంచి వేల సంఖ్యలో నియామకాలు (Jobs in Israel) చేసుకుంటోంది. ఇందులో భాగంగా మరోసారి వేల సంఖ్యలో కార్మికులను నియమించుకునేందుకు భారత్‌ను ఇటీవల సంప్రదించిందని నేషనల్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (NSDC) వెల్లడించింది. వీటిలో 10వేల నిర్మాణ కార్మికులు, ఐదు వేల ఆరోగ్య సంరక్షకుల కోసం నియామకాలు చేపట్టనున్నట్లు తెలిపింది.
ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక ఒప్పందంలో భాగంగా ఉద్యోగుల ఎంపిక విధానంలో తప్పిదాలపై మీడియాలో వచ్చిన కథనాలపై ఎన్‌ఎస్‌డీసీ స్పందించింది. ఫ్రేమ్‌వర్క్, ఐరన్ బెండింగ్, ప్లాస్టరింగ్, సిరామిక్ టైలింగ్ విభాగాల్లో ఉద్యోగాల కోసం ఇజ్రాయెల్‌కు చెందిన పాపులేషన్, ఇమ్మిగ్రేషన్, బార్డర్ అథారటీ (PIBA) ఇటీవల మరోసారి సంప్రదించిందని పేర్కొంది. ఈ నియామకాలకు సంబంధించి స్కిల్ టెస్ట్ నిర్వహించేందుకు మరికొన్ని వారాల్లోనే పీఐబీఏ బృందం భారత్‌కు రానుందని వెల్లడించింది.
తొలి దఫాలో యూపీ, హరియాణా, తెలంగాణాల్లో 10,349 నిర్మాణ కార్మికులను నియమించుకున్న ఇజ్రాయెల్.. ఈసారి మహారాష్ట్రలో వీటి నియామకాలు చేపట్టనున్నట్లు పేర్కొంది. ఎంపికైన వారికి నెలకు రూ.1.92 లక్షల జీతంతోపాటు బీమా, ఆహారం, వసతి కల్పిస్తారు. వీటితోపాటు రూ.16,515 బోనస్ కూడా ఇస్తారు. నిర్మాణ రంగంలోనే కాకుండా వైద్య రంగంలో ఐదు వేల వైద్య సంరక్షకులను ఇజ్రాయెల్ నియమించుకోనుంది. ఇందుకు 10వ తరగతి విద్యార్హత, వైద్య సంరక్షణ కోర్సు పూర్తి చేసి ఉండాలి. కనీసం 990 గంటల పాటు సంబంధిత విభాగంలో శిక్షణ పొందిన వారు ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవచ్చని ఎన్‌ఎస్‌డీసీ వెల్లడించింది. ఇదిలాఉంటే, తాత్కాలిక ఉద్యోగ నియామకాలకు సంబంధించి ఇజ్రాయెల్-భారత్‌లు 2023లో ఒప్పందాలు చేసుకున్న విషయం తెలిసిందే.
Recent Posts
See Allనేడు ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు నేడు ప్రభుత్వ గుర్తింపు పొందిన ఉపాధ్యాయ సంఘాలతో పాఠశాల విద్య డైరెక్టర్ వి. విజయరామరాజు చర్చలు జరపనున్నారు....
Comments