top of page
Writer's pictureAP Teachers TV

"ఇకోక్లబ్స్ మిషన్ ఫర్ మేరీ లైఫ్" నేటి కార్యక్రమాలు :: 18.06.2024



ఇకోక్లబ్స్ మిషన్ ఫర్ మేరీ లైఫ్ :: 18.06.2024

----------------------------------------

నేటి లక్ష్యం : సుస్థిర ఆహార వ్యవస్థలను నిర్మించుకొనుట

-----------------------------------------

భాగస్వామ్యులు : వ్యవసాయ మరియు ఉద్యాన శాఖల ప్రతినిధులు

-----------------------------------------

🌱 పాఠశాల ఆవరణలో కిచెన్ గార్డెన్ మైన్టైన్ చేయుటకు పిల్లల్ని భాగస్వాములను చేయాలి.

🌿 పాఠశాలలో ఉత్పత్తయిన తడిచెత్త నుంచి కంపోస్ట్ ఎరువు తయారుచేసి కిచెన్ గార్డెన్ కోసం వాడవలెను. తద్వారా రసాయన ఎరువులు , విషరసాయన పురుగుమందులను విస్మరించవచ్చు. స్వచ్చమయిన సహజమైన కూరగాయలు,ఆకుకూరలు పొందవచ్చు .

🪴 తోటలో బయో ఎంజైమ్స్ వంటి చెత్త నుంచి తయారు చేసిన పర్యావరణహిత పురుగుమందులను వాడమని ప్రోత్సహించవలెను.

🌳 పాఠశాల ఆవరణలో తోట పెంచుటకు తగిన ఖాళీ లేనిచో ఉన్న స్థలంలోనే పాత బకెట్స్ , ప్లాస్టిక్ బాటిల్స్ మరియు నేలలో పాతిపెట్టే మట్టి కుండల్లో విత్తనాలు ,మొక్కలు నాటమని పిల్లల్ని ప్రోత్సహించాలి.



🌴 ఎక్కువ స్థలం ఆక్రమించని గుమ్మడి,బీర,కాకర,చిక్కుడు,ఆనప వంటి తీగలు,పాదులు నాటవలెను

🌱 తోటలో ప్రతినెలా ఎంత మొత్తంలో కూరగాయలు కోస్తున్నారో ఒక రికార్డు నిర్వహించాలి

🌿 తోటలో కాసిన కూరగాయలను పీఎం పోషణ్ భోజనంలో వండి వడ్డించవచ్చు. లేదా పిల్లలు,సిబ్బందికి పంపిణీ చేయవచ్చు

☘️ ఈ తోటలోని కూరగాయలు తినడం వల్ల కలిగే దీర్ఘకాల ఆరోగ్యప్రయోజనాల గురించి మరియు పర్యావరణ ప్రయోజనాల గురించి అవగాహన కల్పించుటకు పిల్లలకు ఫ్యాన్సి డ్రస్ కాంపీటీషన్స్ వంటి ఆసక్తికరమైన పోటీలు నిర్వహించవలెను.

🍀 ఈ కార్యక్రమాలను ప్రేరణగా తీసుకొని , తోటపనిలో నేర్చుకున్న అనుభవాలను ఉపయోగించి పిల్లల్ని వారి ఇళ్లవద్ద పెరడుతోటలను పెంచుకోవాలని ప్రోత్సహించవలెను.

🪴 పాఠశాలలో ఎన్ని పెరడు తోటలు పెంచుతున్నారు? ఎన్ని కేజీల సేంద్రీయ ఆహారపదార్ధాలను ఉత్పత్తి చేశారు వంటి వివరాలను ఇకో క్లబ్ రిజిస్టర్ లో నమోదు చేయవలెను.

🎋 అనువాదం : ఏపీ టీచర్స్ టీవీ

🍃🌵🌴🌳🪴🌱🌿☘️🍀





0 comments

Comments


bottom of page