top of page

ఇంటి నుంచే లైసెన్స్‌

Writer's picture: AP Teachers TVAP Teachers TV

Vehcl∈license from home online

నూతన వాహన రిజిస్ట్రేషన్లు, కొత్తగా డ్రైవింగ్‌ లైసెన్సు వంటివి పొందాలంటే ఇక మీదట రవాణా శాఖ కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఇంట్లో ఉండే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుని పొందేలా ప్రభుత్వం నూతన విధానం అమలు చేయనుంది.


నూతన వాహన రిజిస్ట్రేషన్లు, కొత్తగా డ్రైవింగ్‌ లైసెన్సు వంటివి పొందాలంటే ఇక మీదట రవాణా శాఖ కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఇంట్లో ఉండే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుని పొందేలా ప్రభుత్వం నూతన విధానం అమలు చేయనుంది. మార్చి మొదటి వారం నుంచి ఆన్‌లైన్‌లో ఈ సేవలు ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి.


  • తొలి విడత ప్రయోగాత్మకంగా సికింద్రాబాద్‌ తిరుమలగిరి ఆర్టీఏ ఆఫీసులో ఈ సేవలను అందించనున్నారు. తర్వాత దశల వారీగా అన్ని జిల్లాల్లోని ఆర్టీఏ ఆఫీసుల్లో విస్తరించేందుకు రవాణా శాఖ ఉన్నతాధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ ‘వాహన్‌’, ‘సారథి’ పోర్టల్‌లతో ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం అనుసంధానం కావడంతో తెలంగాణలో ఈ ఆన్‌లైన్‌ ప్రక్రియ అందుబాటులోకి రానుంది.

  • కేంద్ర రోడ్లు, రవాణా, జాతీయ రహదారుల శాఖ 2016లో దేశవ్యాప్తంగా ఆన్‌లైన్‌ విధానానికి శ్రీకారం చుట్టింది. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం కాకుండా దేశంలోని అన్ని వాహనాలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఒకేచోట ఉంచేందుకు వీలుగా ఈ పోర్టల్‌ను రూపొందించింది. ‘వాహన్‌’, ‘సారధి’ పోర్టల్‌లు నేషనల్‌ ఇన్ఫర్మేటిక్‌ సెంటర్‌ ద్వారా అన్ని రాష్ట్రాల వాహనాల సమాచారాన్ని అనుసంధానం చేసి బదిలీ ప్రక్రియ ఈ పోర్టల్‌ ద్వారా సాఫీగా సాగనుంది.  

  • దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు అనుసంధానమై ఆన్‌లైన్‌ విధానంలోనే సేవలు అందిస్తుండగా.. ఒక్క తెలంగాణ మాత్రం ఈ పోర్టల్‌లో చేరలేదు. రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్‌ ప్రభుత్వం రాగానే కేంద్రం పోర్టల్‌తో అనుసంధానానికి ముందుకు వచ్చింది.




  • ‘వాహన్‌’ పోర్టల్‌ ద్వారా వాహనాల రిజిస్ట్రేషన్లు, ఇతర ప్రాంతాలకు వాహనాల బదిలీ, యజమానుల పేరు మార్పు వంటివి ఆన్‌లైన్‌లోనే చేసుకోవచ్చు. కొత్తగా వాహనం కొనుగోలు చేస్తే, సంబంధిత షోరూం లోనే రిజిస్ట్రేషన్‌ చేయించుకోవచ్చు. ‘సారధి’ పోర్టల్‌తో డ్రైవింగ్‌ లైసెన్స్‌ పొందవచ్చు. గడువు ముగిసిన లైసెన్స్‌ను ఆన్‌లైన్‌లలోనే రెన్యూవల్‌ చేసుకోవచ్చు.  

  • ఉమ్మడి జిల్లాలో నల్గొండ, మిర్యాలగూడ, సూర్యాపేట, కోదాడ, భువనగిరి పట్టణాల్లోనే రవాణా శాఖ కార్యాలయాలు ఉన్నాయి. దేవరకొండ, చౌటుప్పల్, నకిరేకల్, నాగార్జునసాగర్, చిట్యాల, డిండి వంటి పట్టణాల వారు దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చేది.

  • ఈ విధానం ప్రస్తుతం సికింద్రాబాద్‌ కార్యాలయంలో మాత్రమే అమలు చేస్తున్నారు. ఆ తరువాత ఇతర జిల్లాలకు అనుసంధానం చేస్తారు. ముందస్తు ప్రకటించిన తరువాత ప్రక్రియ ప్రారంభిస్తారని మిర్యాలగూడ వాహన తనిఖీ అధికారి వీరస్వామి ‘న్యూస్‌టుడే’కు తెలిపారు.



 
 

Recent Posts

See All

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యాయుల బదిలీ నియంత్రణ చట్టం, 2025 (డ్రాఫ్ట్)

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యాయుల బదిలీ నియంత్రణ చట్టం, 2025 (డ్రాఫ్ట్) ప్రకటన: భారత గణరాజ్యంలోని డెబ్బై ఆరవ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్...

Comentários


bottom of page