top of page
Writer's pictureAP Teachers TV

అసలేంటీ టెఫ్లాన్ ఫ్లూ.. నాన్ స్టిక్ పాన్ లు వాడేవారికి ఇది ఎందుకు వస్తుంది?

నూనె ఎక్కువ వినియోగించకుండా వంట చేయవచ్చనే కారణంతో చాలామంది నాన్ స్టిక్ పాత్రలు వినియోగిస్తుంటారు. అయితే నాన్ స్టిక్ పాన్ లు ఉపయోగించేవారిలో ఇప్పుడు టెఫ్లాన్ ఫ్లూ అనే వ్యాధి కలవరపాటుకు గురిచేస్తోంది.



నాన్ స్టిక్ పాన్ లు ఇప్పట్లో ప్రతి ఇంట్లో ఉంటున్నాయి. దోశలు, చపాతీలు చేయడానికి మాత్రమే కాకుండా వంటపాత్రలు కూడా నాన్ స్టిక్ కోటింగ్ లో ఉంటున్నాయి. నూనె ఎక్కువ వినియోగించకుండా వంట చేయవచ్చనే కారణంతో చాలామంది వీటిని వినియోగిస్తుంటారు. అయితే నాన్ స్టిక్ పాన్ లు ఉపయోగించేవారిలో ఇప్పుడు టెఫ్లాన్ ఫ్లూ అనే వ్యాధి అందరిని కలవరపాటుకు గురిచేస్తోంది. అసలు టెఫ్లాన్ ప్లూ అంటే ఏంటి? ఇది ఎందుకు వస్తుంది తెలుసుకుంటే..

టెఫ్లాన్ ఫ్లూ..

టెఫ్లాన్ ఫ్లూ ను పాలిమర్ ఫ్యూమ్ ఫీవర్ అని కూడా పిలుస్తారు. ఇది నాన్ స్టిక్ పాన్ కు కోటింగ్ గా ఉన్న టెఫ్లాన్ పొర వేడెక్కడం వల్ల వెలువడే పొగను పీల్చడం వల్ల వచ్చే సమస్య. అధిక ఉష్టోగ్రత వద్ద నాన్ స్టిక్ సామాను ఉపయోగించడం వల్ల ఇది వస్తుంది.

నాన్‌స్టిక్ పాన్‌లు పాలిటెట్రాఫ్లోరోఎథిలిన్ (PTFE)తో పూత పూయబడి ఉంటాయి. దీన్ని సాధారణంగా టెఫ్లాన్ అని పిలుస్తారు. 500°F (260°C) కంటే ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద నాన్ స్టిక్ పాత్రలను వేడిచేసినప్పుడు అవి పొగలను విడుదల చేస్తాయి. ఈ పొగలో పెర్ఫ్లోరోక్టానోయిక్ యాసిడ్ (PFOA), ఫ్లోరినేటెడ్ వంటి సమ్మేళనాలు విడుదల అవుతాయి. వీటిలో విష రసాయనాలు ఉంటాయి. ఇవి పీల్చినప్పుడు ఆరోగ్యానికి హాని కలుగుతుంది.


టెఫ్లాన్ ఫ్లూ లక్షణాలు..

నాన్ స్టిక్ పాన్ అధిక ఉష్ణోగ్రత వద్ద వేడి చేసినప్పుడు వెలువడే పొగను పీల్చినప్పుడు ఫ్లూ వంటి సమస్య వస్తుంది. దీన్ని టెఫ్లాన్ ఫ్లూ అని అంటున్నారు. ఇది వచ్చినప్పుడు కింది లక్షణాలు కనిపిస్తాయి.

  • తలనొప్పి

  • చలి

  • జ్వరం

  • వికారం

  • ఛాతీ బిగుతు

  • దగ్గు

  • గొంతు మంట

పై లక్షణాలన్నీ కొన్ని గంటల తర్వాత కనిపిస్తాయి. ఈ సమస్య నుండి బయట పడాలంటే కింది టిప్స్ పాటించాలి.



  • నాన్ స్టిక్ పాన్ లను అధిక ఉష్ణోగ్రత వద్ద వేడెక్కించకూడదు. నాన్ స్టిక్ సామాను వినియోగించే ముందు వాటిని ఉపయోగించే విధానాన్ని క్షుణ్ణంగా తెలుసుకుని వాడాలి.

  • వంట చేసే సమయంలో ఎగ్జాస్ట్ ఫ్యాన్ లేదా కిటికీలు తెరచి ఉంచాలి. నాన్ స్టిక్ పాన్ ల నుండి వెలువడే పొగకు వీలైనంత దూరం ఉండాలి.

  • పాతబడిన, టెఫ్లాన్ కోటింగ్ దెబ్బతిన్న నాన్ స్టిక్ పాన్ లను వినియోగించకూడదు. ఇవి చాలా విషపూరిత రసాయనాలు విడుదల చేస్తాయి.

  • నాన్ స్టిక్ పాన్ లను ఖాళీగా ఎప్పుడూ వేడి చేయకూడదు. స్టౌ వెలిగించి పాన్ ను స్టౌ మీద ఉంచగానే అందులో నూనె లేదా నీరు వంటివి వేయాలి.


(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)





0 comments

Recent Posts

See All

నేడు ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు

నేడు ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు నేడు ప్రభుత్వ గుర్తింపు పొందిన ఉపాధ్యాయ సంఘాలతో పాఠశాల విద్య డైరెక్టర్ వి. విజయరామరాజు చర్చలు జరపనున్నారు....

Comments


bottom of page