అతి త్వరలో మునిసిపల్ డి.డి.ఓ లకు శిక్షణ ఇస్తాం: జేడీ సర్వీసెస్ శ్రీ ఎం.రామ లింగం
అతి త్వరలో మునిసిపల్ డి.డి.ఓ లకు శిక్షణ ఇస్తాం: జేడీ సర్వీసెస్ శ్రీ ఎం.రామ లింగం
ఈరోజు ఉదయం ఆర్.జే.డీ. లు, డీఈవోలు, మున్సిపల్ హెచ్ఎంలు, ఎంఈఓ లతో జరిగిన వెబెక్స్ మీటింగ్లో ముఖ్యంశాలు:
విద్యాశాఖ గతంలో మునిసిపల్ స్కూల్స్ అకడమిక్ అంశాలు మాత్రమే చూసేవాళ్ళం. ఇపుడు నిర్వహణ, పర్యవేక్షణ కూడా విద్యాశాఖ చూస్తుంది.
అన్ని యాజమాన్యాలు ఒక్కటే.
అకడమిక్ అంశాలు అన్ని స్కూల్స్ కి వర్తిస్తాయి.
నాన్ అకడమిక్ అంశాలను ఏ.పి.ఎం.లు చూస్తారు.
మున్సిపల్ పాఠశాలల్లో టీచర్స్, సౌకర్యాల కొరత వుంది. దాన్ని మనం సరి చేయాలి.
మున్సిపల్ పాఠశాలలో కూడా జీవో 117 ప్రకారం రేషన్లైజేషన్ చేయాలి. వారం లోపు వివరాలన్నీ పూర్తి చేసి ఇవ్వాలి.
ఉపాధ్యాయుల సర్దుబాట్ల గురించి ఆలోచించే అంశంలో ఒకే ప్రదేశంలో ఉన్న జిల్లా పరిషత్ & మున్సిపల్ స్కూల్స్లోని పరిస్థితిని కూడా బెరీజు వేయాలి.
మెడికల్ bils, ఎన్.ఓ.సి. ప్రతిపాదనలు కూడా ఆన్ లైన్ ద్వారా నే పంపాలి.
మౌలిక వసతుల విషయంలో ఇబ్బందులు ఉంటే కలెక్టర్ లతో సంప్రదించి పరిష్కారానికి కృషి చేయాలి.
డి.డి. ఓ.లకు జిల్లా వారీగా శిక్షణ ఇస్తాము.
పాఠశాలలను ఖజానా శాఖలో మ్యాపింగ్ చేయాలి.
సర్దుబాట్లు చేస్తాము. మిగులు సిబ్బందిని ఇతర స్కూల్స్ లో సర్దుబాటు చేస్తాము. దీనిపై విధివిధానాలు ఖరారు చేస్తాం.
జి.పి.ఎఫ్. ఎన్నాళ్ళ నుంచో వున్న సమస్య... తెల్లారే అయ్యేది కాదు. సమస్య పరిష్కారానికి మా వంతు సత్వరంగా కృషి చేస్తాం..
జిల్లా పరిషత్ ఉపాధ్యాయులకు, స్కూల్స్ కి వర్తించే సౌకర్యాలు, అంశాలు అన్ని మీకు కూడా వర్తింప చేస్తాము.
ఉపాధ్యాయుల సర్దుబాటు అంశాలలో వివాదాలు లేకుండా...
లిఖీత పూర్వకమైన సూచనలు జారీ చేస్తాం.
హైస్కూల్ కి హెచ్.ఎం.లుగా గెజిటెడ్ బదులు ఎస్.ఏ.లు వుంటే..
జిల్లా పరిషత్ స్కూల్లో పాటించే విధంగానే చేస్తాము...
ఇంక్రిమెంట్లు, అరియర్స్
డి. డి. ఓ.లే మంజూరు చేయొచ్చు. ఈ అంశాలపై డిడిఓ లకు అతి త్వరలో తగిన శిక్షణ ఇస్తాం.
మున్సిపల్ ఉపాధ్యాయులు అదనంగా వచ్చి చేరడం వలన కొన్ని మండలాల్లో ఎం.ఈ.ఓ.లకు పని భారం - విషయంలో ఆలోచించి పని భారం తగ్గించే విధంగా తగు నిర్ణయం తీసుకుంటాం.
స్కూల్స్ కనుక అద్దె భవనాల్లో వుంటే... మేనేజ్మెంట్ మున్సిపాలిటీ కాబట్టి వారే చెల్లించేటట్టుగా చర్యలు తీసుకోవాలి. విద్యాశాఖ కేవలం నిర్వహణ, పరిరక్షణ మాత్రమే చేస్తున్నాం. అవి మున్సిపల్ పాఠశాలలే. కరెంటు బిల్లులు లాంటివి స్కూల్ గ్రాంట్ నుంచే కట్టుకోండి.
పాఠశాల వారిగా ఉపాధ్యాయుల కొరత, ఇతర అవసరాలు, సర్దుబాటులపై పూర్తి వివరాలు సేకరిస్తాం...
పదోన్నతులు, ఫారిన్ సర్వీస్ లాంటి ఇతర అంశాల్లో సర్వీస్ నిబంధనలు రూపొందించిన తర్వాత పరిష్కారం దొరుకుతుంది.
మున్సిపల్ మేనేజ్మెంట్ తో అన్ని అంశాల్లో సర్దుబాటు ధోరణిలో వ్యవహరించండి..
పాతవి అయినా సెలవులు లాంటి నమోదులు డి.డి.ఓ.లుగా చేయొచ్చు...
స్కూల్స్ లో అవసరమైన పోస్టుల విషయలో 117 జి. ఓ. చదవండి. దాని ప్రకారం చేస్తాం.
సోషల్ మీడియాలో ఇష్టారీతి గా పోస్టింగులు చేయకండి:
యూనియన్ బాధ్యులు అయినా ప్రభుత్వ ఉద్యోగులే.. ప్రభుత్వానికి వ్యతిరేక ప్రచారం వద్దు. ఇష్టారీతీ గా సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేయొద్దు.
సి.సి. ఏ. రూల్స్ ప్రకారం తీవ్ర చర్యలు వుంటాయి. మీరు డీఈవో ల కంట్రోల్ లో ఉన్నారని మర్చిపోవద్దు. మనసులో భావాలు మనసులోనే దాచుకొండి
క్లర్క్ లు విషయంలో జిల్లా పరిషత్ పాఠశాలలకు వర్తించే విధంగానే మీకు కూడా చేస్తాం..
మంజూరైన నాన్ టీచింగ్ పోస్టులు ఉంటే వాళ్ళను మన దగ్గరే ఉంచాలి. వాళ్ళ జీతాలు మనమే చేయాలి.
All Deputations should be cancelled. as per G.O. 84...
జీతం ఏ పాఠశాలలో పనిచేస్తున్నారో అదే పాఠశాలలో ఉపాధ్యాయులందరూ విధులు నిర్వహించాలి.
ఆస్తులన్నీ మున్సిపాలిటీకి చెందినవే అది గుర్తుంచుకోండి.
అన్ని అంశాలను సానుభూతితో సత్వరంగాగా పరిష్కరిస్తారని ప్రయత్నం చేస్తాం.
మీ సర్వీసులను ఏకీకృతం చేయడం లేదు. మీ పాఠశాలలను విద్యాశాఖలో విలీనం చేయడం లేదు. కేవలం నిర్వహణ, పర్యవేక్షణ మాత్రమే తీసుకున్నాం.. ఇది మరీ మరీ గుర్తుంచుకోండి.
ఒక జి. ఓ. రావడానికి ఎంతో మంది అధికారులు శ్రమిస్తేనే వస్తుంది, ఎన్నో సాంకేతిక అవరోధాలను అధిగమిస్తేనే వస్తుంది. జి.ఓ. 84 కూడా అలాగే వచ్చింది.
జిల్లా పరిషత్, మండల పరిషత్ ఉపాధ్యాయుల మరియు పాఠశాలల వలెనే మున్సిపల్ పాఠశాలలను కూడా చూస్తాము, సమస్యలను పరిష్కరిస్తాము. కాస్త ఓపికతో, సంయమనంతో వ్యవహరించి సహకరించండి... అని శ్రీ ఎం.రామలింగం సమావేశంలో తెలిపారు. ఈ సమావేశంలో పాఠశాల విద్యా సంచాలకులు శ్రీ ఎస్ సురేష్ కుమార్ గారు కూడా పాల్గొన్నారు. సమావేశంలో పాల్గొన్న పలువురు మున్సిపల్ ప్రధానోపాధ్యాయులు ఎంఈఓ లు డిప్యూటీ డిఈవోలు లేవనెత్తిన సందేహాలను శ్రీ రామలింగం నివృత్తి చేశారు.
Recent Posts
See Allనేడు ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు నేడు ప్రభుత్వ గుర్తింపు పొందిన ఉపాధ్యాయ సంఘాలతో పాఠశాల విద్య డైరెక్టర్ వి. విజయరామరాజు చర్చలు జరపనున్నారు....
Comments