YSRCP Manifesto 2024#ysrcpmanifesto
YSRCP Manifesto 2024 📌#YSRCPManifesto
రెండు పేజీలతో కూడిన YSRCP మేనిఫెస్టోను సీఎం జగన్ విడుదల చేశారు. ఇప్పుడు అమలు చేస్తున్న పథకాల విస్తరణ.. 9 ముఖ్యమైన హామీలతో కూడిన వైఎస్సార్‌సీపీ 2024 మేనిఫెస్టో చదివి వినిపించారాయన.
రెండు విడతల్లో పెన్షన్ రూ.3,500 దాకా పెంపు(2028 జనవరిలో రూ.250, 2029 జనవరిలో రూ.250 పెంచుతాం) 66 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్న రాష్ట్రం దేశంలో ఏపీ తప్ప మరొకటి లేదు.
అమ్మ ఒడి, విద్యాకానుక, మహిళలకు వైఎస్సార్ చేయూత తదితర పథకాల కొనసాగింపు
వైఎస్సార్ చేయూత పథకం గత ఐదేళ్లలో 4 విడతల్లో రూ.75 వేలు అందించాం. వచ్చే ఐదేళ్లలో మరో నాలుగు విడతల్లో మరో రూ.75వేలు అందిస్తాం. మొత్తంగా 8 విడతల్లో రూ. లక్షా 50 వేలు లబ్ది చేకూరుతుంది
అమ్మ ఒడి రెండు వేలకు పెంచుతాం. రూ. 17వేలు చేస్తాం. తల్లుల చేతికి రూ.15 వేలు అందిస్తాం
రాబోయే ఐదేళ్లలో వైద్యంపై స్పెషల్ ఫోకస్. వైద్యం, ఆరోగ్యశ్రీ విస్తరణ(ఆరోగ్యశ్రీ పరిధిని ఇదివరకే రూ.25 లక్షలకు విస్తరించాం)
వైఎస్సార్ కాపు నేస్తం పథకం కొనసాగిస్తాం. గత ఐదేళ్లలో నాలుగు దఫాల్లో రూ.60 వేలు అందించాం. వచ్చే ఐదేళ్లలో మరో నాలుగు దఫాల్లో మరో రూ.60వేలు అందిస్తాం. మొత్తంగా 8 విడతల్లో రూ.1,20,000 లబ్ది చేకూరుతుంది.
గత ఐదేళ్లలో ఈబీసీ నేస్తం కింద ఒక్కో లబ్దిదారుకు రూ.45 వేల సాయం అందించాం. వచ్చే ఐదేళ్లలో ఈ పథకం కింద లబ్దిదారులకు నాలుగు విడతల్లో రూ.60 వేలు అందిస్తాం. మొత్తంగా ఒక్కో లబ్దిదారుకు ఈబీసీ నేస్తం కింద రూ.1,05,000 లబ్ది చేకూరుతుంది.
వైఎస్సార్ రైతు భరోసా రూ.13,500 నుంచి రూ.16 వేలకు పెంపు.. కౌలు రైతులకు కూడా రైతు భరోసా వర్తింపు
మత్స్యకార భరోసా కింద ఐదు విడతల్లో రూ.50 వేలు అందజేత
వైఎస్సార్ సున్నా వడ్డీ కింద రూ.3 లక్షల రుణం
ఆటోలకు ట్యాక్సీలు కొనుగోలు చేసేవారికి వడ్డీ రాయితీ. ఆటోలకు, ట్యాక్సీలకు వచ్చే ఐదేళ్లలో రూ.50 వేలు
వాహన మిత్ర పథకం కింద గత ఐదేళ్లలో ఒక్కో లబ్ది దారుడికి రూ.50 వేలు అందించాం. ఈ పథకాన్ని వచ్చే ఐదేళ్లు కొనసాగిస్తాం. వచ్చే ఐదేళ్లలో మరో రూ.50వేలు అందిస్తాం. మొత్తంగా పదేళ్లలో ఒక్కో లబ్దిదారుకు రూ.1 లక్ష వాహన మిత్ర కింద లబ్ది చేకూరుతుంది.
లారీ డ్రైవర్లు, టిప్పర్ డ్రైవర్లకు కూడా వాహన మిత్ర వర్తింపు.. రూ. 10 లక్షల వరకు ప్రమాద బీమా
చేనేతలకు ఏడాదికి రూ.24 చొప్పున, ఐదేళ్లలో రూ.లక్షా 20 వేలు
వైఎస్సార్ కళ్యాణమస్తు, షాదీ తోఫా కొనసాగింపు
లా నేస్తం కొనసాగింపు
అర్హులై ఇళ్ల స్థలాలు లేనివాళ్లందరికీ ఇళ్లు.. ఇళ్ల పట్టాల కొనసాగింపు
నాడు-నేడు..ట్యాబ్‌ల పంపిణీ కొనసాగింపు, 2025 నుంచి ఒకటో తరగతి ఐబీ సిలబస్
ప్రతీ నియోజకవర్గంలో స్కిల్ హబ్.. జిల్లాకో స్కిల్‌డెవలప్‌మెంట్ కాలేజీ.. తిరుపతిలో స్కిల్ యూనివర్సిటీ
స్విగ్గీ, జొమాటో లాంటి గిగా సెక్టార్ ఉద్యోగులు ప్రమాదవశాత్తూ మరణిస్తే వైఎస్సార్ బీమా వర్తింపు
ఎస్సీ, ఎస్టీ కాలనీలకు ఉచిత కరెంట్ ఇస్తాం
వీటితో పాటు.. వివిధ వర్గాలకు కొనసాగిస్తున్న సంక్షేమం గురించి మేనిఫెస్టోలో ప్రస్తావన
YSRCP మేనిఫెస్టో కాపీని డౌన్లోడ్ చేయుటకు కిందకి స్క్రోల్ చేయగలరు.
రాజధానుల విషయంలో
మళ్లీ అధికారంలోకి రాగానే.. విశాఖ నుంచి పాలన కొనసాగిస్తాం
రాష్ట్రానికి గ్రోత్ ఇంజిన్‌గా విశాఖను తీర్చి దిద్దుతాం
అమరావతిని శాసన రాజధానిగా అభివృద్ధి చేస్తాం
కర్నూలును న్యాయ రాజధానిగా తీర్చిదిద్దుతాం
భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టును పూర్తి చేస్తాం
మొత్తంగా విద్య, వైద్యం, వ్యవసాయం, పేదలకు ఇళ్లు, నాడు-నేడు, మహిళా సాధికారత, సామాజిక భద్రత ప్రధానాంశాలుగా వైఎస్సార్‌సీపీ మేనిఫెస్టో ఉంది.
👉అమ్మఒడి 17000
👉డ్వాక్రా సంఘాలకు 3లక్షలవరకు సున్నా వడ్డీ
👉కళ్యాణమస్తు
👉అర్హులకు ఇళ్ల స్థలాలు
👉పెన్షన్స్ 3000 నుండి 3500
👉కాపు నేస్తం 60000 నుండి 120000 పెంపు
👉ఈబీసీ నేస్తం 45000 నుండి 105000 పెంపు
👉YSR చేయూత 75000 నుండి 150000 పెంపు
👉రైతుభరోసా 13500 నుండి 16000 వరకు పెంపు
👉మత్స్యకార భరోసా
👉వాహనమిత్ర 50000 నుండి లక్షకు పెంపు
👉లారీ టిప్పర్ అలాగే సొంత వాహనంకు డ్రైవర్ గా నడిపే అందరికీ వాహనమిత్ర
👉డ్రైవర్ల ప్రమాద భీమా 1000000
👉లా నేస్తం
👉చేనేత నేస్తం 120000 నుండి 240000 కు పెంపు
👉యువత ఉపాధికి ప్రతీ నియోజకవర్గంకు స్కిల్ హబ్
👉విద్యాదీవెన,వసతిదీవెన
👉విద్యలో సంస్కరణలు
👉3590 అధ్యాపకుల నియామకాలు
👉ఆరోగ్యశ్రీ
👉స్పెషలిస్ట్ డాక్టర్స్ నియామకాలు
👉దేవాలయ నిర్వహించడం కోసం ప్రత్యేక నిధి
👉జగనన్న తోడు చిరు వ్యాపారులకు 10000 నుండి 15000 కి పెంపు
ప్రభుత్వ ఉద్యోగులకు సంభందించిన విషయాలు
👉విదేశీ విద్యకు అయిన ఖర్చుకు వడ్డీ ప్రభుత్వం భరిస్తుంది
👉25000 లోపు జీతం తీసుకునే వారికి ప్రభుత్వ పథకాలు వర్తింపు
మిగతా అంశాలు
👉స్విగ్గి జోమాటో వంటి గిగ్ workers కి YSR జీవన భీమా
👉జిల్లా కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు
👉ప్రతీ జిల్లాలో ఇండస్ట్రీ డెవలప్మెంట్
👉విశాఖపట్నం పరిపాలన రాజధాని
👉అమరావతి శాసన రాజధాని
👉కర్నూలు న్యాయ రాజధాని
👉పెండింగ్ ప్రాజెక్ట్స్ త్వరితగతిన పూర్తి.
Comments