YS Jagan : జగన్ నాడు నేడు.. అసలు రహస్యం చెప్పిన కేంద్రం
YS Jagan Nadu Nadu : గత వైఎస్ జగన్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నాడు నేడు పథకం వల్ల ఒరిగిందేమీ లేదని కేంద్రం స్పష్టం చేసింది. దీని వల్ల పాఠశాలల్లో ప్రమాణాలు దిగజారయని పేర్కొంది.

న్యూఢిల్లీ, జనవరి 28: గత వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో ఎంతో ఆర్భాటంగా నిర్వహించిన నాడు - నేడు కార్యక్రమంతో విద్యా ప్రమాణాలు దిగజారాయని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ కార్యక్రమంలోని డొల్లతనాన్ని కేంద్రం బయట పెట్టింది. ఈ కార్యక్రమం పూర్తిగా0 అస్తవ్యస్తంగా మారిందని ఆరోపించింది. అందుకు సంబంధించిన వివరాలతో కూడిన నివేదికను యాన్యువల్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్ట్ (ASER) మంగళవారం న్యూఢిల్లీలో బహిర్గతం చేసింది.
గత ప్రభుత్వంలో నాటి అధికారులు చేసిన నిర్వాకాల వల్ల విద్యా వ్యవస్థ ఏ విధంగా కుదేలైందో గణాంకాలతో సహా సదరు నివేదిక వివరించింది. 2018 నుంచి 2024 వరకు విద్యా ప్రమాణాలను ఈ నివేదికలో ASER పొందుపరిచింది. అయితే.. 2022 నుంచి 2024 మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్‌లో విద్యా ప్రమాణాలు దిగజారినట్లు సదరు నివేదికలో పేర్కొంది.
మరి ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో పిల్లలకు లెక్కల్లో కూడికలు, తీసివేతలు వంటివి కూడా రావడం లేదని ఆ నివేదికలో సోదాహరణగా వివరించింది. ప్రభుత్వ పాఠశాలలకు వచ్చే 6 నుంచి14 ఏళ్ల వయస్సు ఉన్న పిల్లలు 2018లో 63.2 శాతం ఉంటే... 2024 నాటికి అది 61.8 శాతానికి పడి పోయిందని సోదాహరణగా విపులీకరించింది. ఇక15 - 16 ఏళ్ల పిల్లలు
స్కూలు నమోదు శాతం సైతం 2018లో 9 శాతం నుంచి 2024లో 1.3 శాతానికి తగ్గిందని స్పష్టం చేసింది.
అలాగే మూడో తరగతి చదివే పిల్లల్లో రెండో తరగతి టెక్ట్స్ బుక్ చదివే సామర్ధ్యం ఉన్న వారు 2018లో 22.4 శాతం ఉంటే.. 2022లో అది10.4 శాతానికి పడిపోగా.. 2024లో మళ్లీ అది 15.7 శాతంగా నమోదైందని ASER నివేదిక తెలిపింది. ఐదో తరగతి చదివే పిల్లల్లో రెండో తరగతి పుస్తకాలు చదివే సామర్ధ్యం 2018లో 59.7 శాతం ఉండగా.. 2022లో అది 36.4 శాతానికి దిగజారిపోయిందని..అయితే అది 2024లో 37.7 శాతంగా ఉన్నట్లు పేర్కొన్న సదరు నివేదిక గణాంకాలతో సహా విశదీకరించింది.
అదే విధంగా ఐదో తరగతి చదివే విద్యార్దుల్లో బాగాహారం చేయగలిగిన వారు 2018లో 39.3 శాతం మంది ఉండగా.. అది 2022లో 29.6 శాతంగా ఉందని... అదే విధంగా 2024లో 36.2 శాతానికి తగ్గిపోయిందని పేర్కొంది. మరోవైపు ఎనిమిదో తరగతి విద్యార్ధుల్లో కనీసం రెండో తరగతి పుస్తకాలు చదవగలిగే వారు 2018లో 78.2 శాతం నుంచి 2022లో 66.4 శాతానికి.. 2024లో 56.2 శాతానికి పడిపోయిందంటూ పలు విషయాలు ఈ నివేదికగా ద్వారా బహిర్గతం చేసింది.
Recent Posts
See Allఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యాయుల బదిలీ నియంత్రణ చట్టం, 2025 (డ్రాఫ్ట్) ప్రకటన: భారత గణరాజ్యంలోని డెబ్బై ఆరవ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్...
Comentarios