WhatsApp: నంబర్ సేవ్ చేసుకోకుండా వాట్సప్ మెసేజ్‌లు పంపడం ఎలాగో తెలుసా?#SendMessageWithoutSavingNumberOnWhatsapp
WhatsApp: నంబర్ సేవ్ చేసుకోకుండా వాట్సప్ మెసేజ్‌లు పంపడం ఎలాగో తెలుసా?
ప్రపంచవ్యాప్తంగా 2.4 బిలియన్ల యూజర్లను కలిగిన వాట్సప్(WhatsApp) ఎప్పటికప్పుడు వినూత్న అప్‌డేట్స్‌తో ముందుకు వస్తోంది. కొత్తగా పరిచయమైన వ్యక్తికి వాట్సప్‌లో ఏదైనా పంపాలంటే నంబర్ సేవ్ చేసుకోవాల్సి ఉంటుంది. నంబర్ సేవ్ చేసుకుంటేనే సదరు వ్యక్తితో మీరు చాట్ చేయగలరు. #SendMessagesWithoutSavingNumberOnWhatsapp
ప్రపంచవ్యాప్తంగా 2.4 బిలియన్ల యూజర్లను కలిగిన వాట్సప్(WhatsApp) ఎప్పటికప్పుడు వినూత్న అప్‌డేట్స్‌తో ముందుకు వస్తోంది. కొత్తగా పరిచయమైన వ్యక్తికి వాట్సప్‌లో ఏదైనా పంపాలంటే నంబర్ సేవ్ చేసుకోవాల్సి ఉంటుంది. నంబర్ సేవ్ చేసుకుంటేనే సదరు వ్యక్తితో మీరు చాట్ చేయగలరు. ఆ తరువాత అతని నంబర్‌తో మీకు పని ఉండకపోవచ్చు. నంబర్ సేవ్ చేయకుండా మెసేజ్‌లు పంపడం ఎలా అనేది చాలా మందికి తెలియదు.
ఉదాహరణకు మీరో ఫొటో స్టూడియోకి వెళ్లారనుకోండి.. అక్కడ మీ పాస్ పోర్ట్ సైజ్ ఫొటో కోసం సదరు ఫొటో స్టూడియో యజమాని నంబర్‌ని తీసుకుంటారు. అనంతరం సేవ్ చేసుకుని ఫొటోని వాట్సప్ చేస్తారు. తరువాత ఆ నంబర్‌తో మనకు పని ఉండకపోవచ్చు. గతంలో నంబర్ సేవ్ చేసుకుంటేనే వాట్సప్ చాట్ చేయగలిగే వాళ్లం. కానీ, వాట్సప్ సర్చ్ బార్ ఫీచర్ అందుబాటులోకి వచ్చాక ఆ సమస్య తీరిపోయింది. దీని గురించి సింపుల్‌గా తెలుసుకుందాం
వాట్సప్‌ని ఓపెన్ చేయండి
ఐఫోన్ యూజర్లైతే పైన ప్లస్ ఐకాన్ ఉంటుంది, ఆండ్రాయిడ్ యూజర్లైతే వాట్సప్ యాప్‌లో కింద ప్లస్ ఐకాన్ ఉంటుంది. దానిపై క్లిక్ చేయండి.
నంబర్‌ని కాపీ చేయండి. అనంతరం సర్చ్ కాంటాక్ట్‌పై క్లిక్ చేసి నంబర్‌ని పేస్ట్ చేయండి.
ఆ నంబర్‌పై వాట్సప్ అకౌంట్ ఉంటే చాట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసి ఫైల్స్, ఫొటోలు తదితర సమాచారాన్ని నంబర్ సేవ్ చేసుకోకుండానే షేర్ చేయొచ్చు
Comentários