SSC 2024 రీవెరిఫికేషన్ మరియు రీకౌంటింగ్ ఫలితాలు విడుదల #SSCrecounting_reverification
మార్చి 2024న జరిగిన పదో తరగతి పరీక్షల ఫలితాలు ఏప్రిల్ 22న విడుదలైన విషయం తెలిసిందే ! అలాగే జవాబు పత్రాల రీవెరిఫికేషన్ మరియు రీకౌంటింగ్ దరఖాస్తు కోసం ఏప్రిల్ 23 నుంచి ఏప్రిల్ 30 వరకు స్కూల్ లాగిన్సులో సదుపాయం కల్పించబడిన విషయం తెలిసిందే.
ఇప్పుడు ప్రభుత్వం కొత్తగా ఒక విధానం తీసుకువచ్చింది .ఎవరైతే తమ జవాబు పత్రాల రీ వెరిఫికేషన్ మరియు రికౌంటింగ్ కోసం దరఖాస్తు చేసుకున్నారో వారి యొక్క జవాబు పత్రాలను ఈ సంవత్సరం నుంచి డిజిటలైజేషన్ చేయడం మొదలుపెట్టారు. మొత్తం 55,966 జవాబు పత్రాల రీవెరిఫికేషన్ మరియు రికౌంటింగ్ కోసం దరఖాస్తు చేసుకున్నారు.
వీటిలో ఇప్పటికే 43,714 జవాబు పత్రాలు రీకౌంటింగ్ మరియు రివెరిఫికేషన్ పూర్తి చేసి ఫలితాలను ఆయా పాఠశాలల లాగిన్ నందు అందుబాటులో ఉంచడం జరిగింది. మిగతా జవాబు పత్రాల ఫలితాలు కూడా త్వరలోనే అందుబాటులోకి తెస్తామని, అందుబాటులో ఉన్న రిజల్ట్స్ ని ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు వారి లాగిన్స్ నుంచి డౌన్లోడ్ చేసి సాఫ్ట్ కాపీ లేదా ప్రింట్ కాపీలు సంబంధిత విద్యార్థులకు అందజేయాలని ప్రభుత్వ పరీక్షల సంచాలకులు డి దేవానందరెడ్డి తెలిపారు.
ఈ క్రింది బటన్ నొక్కి రీవెరిఫికేషన్ మరియు రీకౌంటింగ్ ఫలితాలు చూసుకోవచ్చు
Recent Posts
See Allనేడు ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు నేడు ప్రభుత్వ గుర్తింపు పొందిన ఉపాధ్యాయ సంఘాలతో పాఠశాల విద్య డైరెక్టర్ వి. విజయరామరాజు చర్చలు జరపనున్నారు....
Comentarios