top of page
Writer's pictureAP Teachers TV

Science: దిమాక్‌ కరాబ్‌ అయ్యే న్యూస్‌.. మెదడును కంట్రోల్‌ చేసే రిమోట్‌ వచ్చేసింది

దక్షిణ కొరియాకు చెందిన పరిశోధకులు ఈ అద్భుతాన్ని

నిజం చేసే దిశగా వేగంగా అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగానే పరిశోధకులు 'లాంగ్‌ రేంజ్‌', లార్జ్‌ వాల్యూమ, రిమోట్‌ మైండ్ కంట్రోల్‌ అనే పరికరాన్ని సృష్టించారు. ఇది వరకు ఎప్పుడు కనీవిని ఎరగని పరికరాన్ని కొరియాకు చెందిన ఇన్‌స్టిట్యూట ఫర్‌ బేసిక్‌ సైన్స్‌ పరిశోధకులు అభివృద్ధి చేశారు. ఈ పరికరానికి అయస్కాంత క్షేత్రాల....




ఎక్కడో ఉన్న వాళ్లు చేతిలో రిమోట్‌తో మన మెదడును కంట్రోల్‌ చేస్తే ఎలా ఉంటుంది.? వారి కమాండ్స్‌కి అనుగుణంగా మనం ఆలోచనలు మారితే.? ఏంటి.. ఏదైనా సైన్స్‌ ఫిక్షన్‌ సినిమా కథ గురించి చెబుతున్నారని అనుకుంటున్నారా.? ఇది కథ కాదు.. నిజంగా నిజం. రిమోట్‌ సహాయంతో బ్రెయిన్‌ను కంట్రోల్‌ చేసే టెక్నాలజీని పరిశోధకులు అభివృద్ధి చేశారు. టీవీ ఛానెల్స్‌ను మార్చినంత సులభంగా మెదడును కంట్రోల్‌ చేయొచ్చని పరిశోధకులు చెబుతున్నారు.

దక్షిణ కొరియాకు చెందిన పరిశోధకులు ఈ అద్భుతాన్ని నిజం చేసే దిశగా ముందడుగు వేశారు. ఇందులో భాగంగానే పరిశోధకులు ‘లాంగ్‌ రేంజ్‌’, లార్జ్‌ వాల్యూమ, రిమోట్‌ మైండ్ కంట్రోల్‌ అనే పరికరాన్ని సృష్టించారు. ఇది వరకు ఎప్పుడు కనీవిని ఎరగని పరికరాన్ని కొరియాకు చెందిన ఇన్‌స్టిట్యూట ఫర్‌ బేసిక్‌ సైన్స్‌ పరిశోధకులు అభివృద్ధి చేశారు. ఈ పరికరానికి అయస్కాంత క్షేత్రాల సహాయంతో దూరంగా నుంచి మానవ మెదడును నియంత్రించే సామర్థ్యం కలిగి ఉంటుందని అంటున్నారు.

ఈ పరికరాన్ని ఎలుకల్లో ప్రాక్టికల్‌గా కూడా పరీక్షిచారు. ఆడ ఎలుకలో మాతృత్వాన్ని ప్రేరేపించే లక్షణాలపై ఈ టెక్నాలజీని ఉపయోగించారు. ఈ టెక్నాలజీ సహాయంతో ఆకలి తగ్గించేందుకు రూపొందించిన అయస్కాంత క్షేత్రాలని ఎలుకల్లో ప్రయోగించారు. దీంతో ఎలుకలు 10 శాతం బరువు తగ్గడం విశేషం. అంటే ఇకపై బరువు తగ్గాలనుకుంటే జిమ్‌ల బాట పట్టాల్సిన అవసరం ఉండదన్నమాట. రిమోట్‌లో ఒక చిన్న బటన్‌ ద్వారా బరువు తగ్గొచ్చు.



Mind Remote Control

ఈ ప్రయోగానికి నాయకత్వం వహించిన కెమెస్ట్రీ, నానోమెడిసిన్ ప్రొఫెసర్‌ ఈ విషయమై మాట్లాడుతూ.. అయస్కాంత క్షేత్రాలను ఉపయోగించే మెదడులోని నిర్ధిష్ట ప్రాంతాలను నియంత్రించే సాంకేతిక ప్రపంచంలో ఇదే మొదటిది అని తెలిపారు. ఈ కొత్త హార్డ్‌వేర్‌ను హెల్త్‌ కేర్‌ అప్లికేషన్స్‌లో మాత్రమే ఉపయోగించాలని యోచిస్తున్నట్లు డాక్టర్‌ చియోన్‌ జిన్‌వూ అనే పరిశోధకులు చెప్పుకొచ్చారు. ఇక ఈ పరికరానికి పరిశోధకులు నానో మైండ్‌ అనే పేరు పెట్టారు.

Mind Remote Control

హెల్త్‌ కేర్‌ అప్లికేషన్స్‌లో ఉపయోగించేందుకు ప్రతిపాదించిన ఈ పరికరంపై మరికొన్ని ప్రయోగాలు చేయాల్సి ఉంటుందని శాస్త్రవేత్తులు చెబుతున్నారు. ముఖ్యంగా నాడీ సంబంధత రుగ్మతల చికిత్సల కోసం ఇక కొత్త రకం టెక్నాలీని తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు. త్వరలోనే ఈ బ్రెయిన్‌ కంట్రోల్‌ మిషిన్‌ను అందుబాటులోకి తీసుకొస్తామని చెబుతున్నారు. వినడానికి ఏదో సైన్స్‌ ఫిక్షన్‌ కథలా ఉన్నా ఇది త్వరలోనే సాకారం కానుందని శాస్త్రవేత్తలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అయస్కాంత క్షేత్రాలను ఉపయోగించి జీవ వ్యవస్థలను మార్చగలమనే భావన ఇప్పుడు బాగా బలపడిందని స్పెయిన్‌లోని ఇన్‌స్టిట్యూట్‌ డి న్యూరోసైన్సియాస్‌కు చందిన సీనియర్‌ శాస్త్రవేత్త డాక్టర్‌ ఫెలిక్స్‌ లెరోయ్‌ తెలిపారు.

బ్రెయిన్ చిప్‌తో న్యూరాలింక్ పరిశోధనలు..

మెదడును నియంత్రించే సాంకేతికతపై ఇప్పటికే అంతర్జాతీయంగా ఎన్నో పరిశోధనలు జరుగుతున్నాయి. గత రెండు దశాబ్ధాలుగా ఈ పరిశోధనలు మరింత జోరందుకున్నాయి. ఇందులో భాగంగా ఈ ఏడాది మొదట్లో మనిషిలో వైర్‌లెస్ బ్రెయిన్ చిప్‌ను న్యూరాలింక్ కంపెనీ అమర్చడం తెలిసిందే. కేవలం ఆలోచనతో ఫోన్, కంప్యూటర్ లేదా మరో పరికరాన్ని నియంత్రించే లక్ష్యంతో ఈ టెక్నాలజీని రూపొందించారు. కాళ్లు, చేతులు ఉపయోగించలేని వ్యక్తుల కోసం ఈ టెక్నాలజీని మొదటగా వాడుతామని ఆ సంస్థ వ్యవస్థాపకుడు ఎలన్ మస్క్ గతంలో ప్రకటించారు. సంక్లిష్టమైన నరాల సంబంధిత సమస్యలను పరిష్కరించేందుకు బ్రెయిన్ చిప్‌ల దోహదపడుతాయని ఆశాభావం వ్యక్తంచేశారు.

మెదడుపై ప్రయోగాల్లో జంతువులు బలిపశువులు..

అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోలో న్యూరాలింక్ ప్రధాన కార్యాలయం ఉంది. మానవులు, జంతువుల మెదడులను కంప్యూటర్లకు అనుసంధానించే సాంకేతికతను అభివృద్ధి చేసేందుకు ఈ కంపెనీ ప్రయోగాలు చేస్తోంది. న్యూరాలింక్ శాస్త్రవేత్తలు చేపట్టిన ప్రయోగాల కారణంగా 2022 డిసెంబర్‌లో గొర్రెలు, కోతులు, పందులతో సహా సుమారు 1,500 జంతువులు మరణించాయనే ఆరోపణలు వచ్చాయి. దీనిపై 2023 జూలైలో దర్యాప్తు జరిపిన అమెరికా డిపార్ట్‌మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ అధిపతి.. న్యూరాలింగ్ కంపెనీలో జంతు పరిశోధన నియమాల ఉల్లంఘనలు ఏవీ కనుగొనలేదని తెలిపారు. అయితే, దీనిపై ఇప్పటికీ ప్రత్యేక విచారణ కొనసాగుతోంది.



విద్యుత్ సాయంతో జ్ఞాపకశక్తి..

జ్ఞాపక శక్తిని పెంచేందుకు బోస్టన్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు గతంలో పరిశోధనలు జరిపారు. మెదడులోని భాగాలకు ఎలాంటి హాని కలగకుండా విద్యుత్‌ సాయంతో ప్రేరేపించడం ద్వారా కనీసం ఒక నెల పాటు ప్రజల జ్ఞాపక శక్తిని పెంచే అవకాశముందని వారు గుర్తించారు. ఈ ప్రయోగం ప్రారంభంలో మెమొరీ గేమ్స్‌లో ఇబ్బందులు పడిన వాలంటీర్ల జ్ఞాపకశక్తి ఆ తర్వాత బాగా మెరుగుపడినట్లు తేలింది. ఈ ప్రయోగ ఫలితాలను నేచర్ న్యూరోసైన్స్ అనే జర్నల్‌లో ప్రచురించారు.

Mind Remote Control

మెదడు మార్పిడిపై పరిశోధనలు..

మెదడు మార్పిడిపై కూడా చాలా ప్రయోగాలు, పరిశోధనలు జరుగుతున్నాయి. అయితే మనిషి మెదడు మార్పిడి ఇప్పటి వరకు సాధ్యంకాలేదు. అమెరికాలోని క్లీవ్‌ల్యాండ్‌కు చెందిన ప్రముఖ న్యూరోసర్జన్ రాబర్ట్ జే వైట్ ఒక కోతి తలను మరో కోతి శరీరానికి అమర్చి సంచలనం సృష్టించారు. ఈ శాస్త్ర చికిత్స కోసం రాబర్ట్ జే వైట్, ఆయన టీమ్ దాదాపు 18 గంటలు శ్రమించింది. ప్రపంచంలో విజయవంతమైన తొలి మెదడు మార్పిడి శస్త్రచికిత్సగా దీన్నే పరిగణిస్తారు. అయితే ఆ తర్వాత కొన్ని రోజులకే ఆ కోతి మృతి చెందింది. అత్యంత క్రూరంగా, దారుణంగా జంతువులపై మెదడు మార్పిడి ప్రయోగాలు చేపట్టారంటూ వైట్ తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. మానవుల్లో మెదడు మార్పిడి శస్త్రచికిత్స చేయాలన్న ఆయన లక్ష్యం కలగానే మిగిలిపోయింది.

ఇదంతా చూస్తుంటే అచ్చంగా ఈస్మార్ట్‌ శంకర్‌ మూవీని తలపిస్తున్న ఈ విధానం మనుషుల్లో ఎప్పుడు ప్రయోగిస్తారో చూడాలి.


ఇవి కూడా చదవండి :


ఏపీ టీచర్స్ టివి:


0 comments

Recent Posts

See All

నేడు ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు

నేడు ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు నేడు ప్రభుత్వ గుర్తింపు పొందిన ఉపాధ్యాయ సంఘాలతో పాఠశాల విద్య డైరెక్టర్ వి. విజయరామరాజు చర్చలు జరపనున్నారు....

Comments


bottom of page