top of page

SCERT : ఎస్సీఈఆర్టీ కార్యాలయం నూతన భవనంలోకి మార్పు


ఏపీ టీచర్స్ టీవీ:30.3.25

ఎస్సీఈఆర్టీ కార్యాలయం నూతన భవనంలోకి మార్పు:ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాల విద్యాశాఖ

విజయవాడలో మహానాడు రోడ్డులో ఉండే ఎస్సీఈఆర్టీ కార్యాలయం ఆదివారం గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఆత్మకూరులో నూతన భవనంలోకి మార్చినట్లు ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ శ్రీ ఎం.వి.కృష్ణా రెడ్డి గారు ఒక ప్రకటనలో తెలిపారు. ఇక నుండి డైరెక్టర్, స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ & ట్రైనింగ్ (SCERT), డోర్ . నం. 398/3, శ్రీ నిలయం, ముసునూరి డెవలపర్స్, విద్యాభవన్ పక్కన, ఆత్మకూరు, మంగళగిరి(M), గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్.-522503 చిరునామాలో సేవలందిస్తోందని‌ ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ తెలిపారు. ఈ మార్పును విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు, విద్యార్థినీ విద్యార్థుల తల్లిదండ్రులు, ప్రజలందరూ గమనించాలని విజ్ఞప్తి చేశారు.



ఎస్సీఈఆర్టీ సంస్థలో కరికులం డిజైన్ వర్క్ జరుగుతుంది అలాగే పాఠ్యపుస్తకాల రచన కూర్పు సవరణలు ముద్రణ జరుగుతాయి. ఎస్సీఈఆర్టీ నుంచి ప్రత్యక్షంగాను ఆన్లైన్లోనూ అధికారులకు ఉపాధ్యాయులకు శిక్షణలు జరుగుతూ ఉంటాయి. అలాగే ఎప్పటికప్పుడు పాఠశాలలకు తగిన మార్గదర్శకాలు విడుదలవుతూ ఉంటాయి. సిలబస్ వర్గీకరణ సిలబస్ టైం లైన్ పరీక్షల నిర్వహణ విధానం విద్యార్థుల సామర్ధ్యాలకు సంబంధించిన కార్యక్రమాలు తదితర కార్యకలాపాలు ఈ సంస్థ నుంచి పర్యవేక్షణ చేస్తారు. విద్యారంగంలో వస్తున్న కాలానుగుణ మార్పులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు పరిశోధనలు చేస్తూ సరికొత్త ప్రణాళికలు, విధానాలను రూపొందించి విద్యాశాఖలో ప్రవేశపెట్టి అమలు తీరును మానిటరింగ్ చేస్తూ ఉంటారు. ఈ సంస్థ ముఖ్య ఉద్దేశ్యం విద్యా పరిశోధన మరియు ఎప్పటికప్పుడు ఉపాధ్యాయ శిక్షణలు నిర్వహించడం. ఈ సంస్థ యొక్క భవనం మంగళగిరిలోని కొత్త అడ్రస్ కి మారిన విషయం ప్రజలందరూ గమనించవలసినదిగా ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ ఎం.వి.కృష్ణారెడ్డి కోరుతున్నారు.



 
 
 

Comments


bottom of page