top of page

RamojiFilmCity: రామోజీ ఫిల్మ్‌సిటీలో టీచర్స్‌ డే ఆఫర్‌

Writer's picture: AP Teachers TVAP Teachers TV

ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్‌సిటీ ప్రత్యేకంగా ‘టీచర్స్‌ డే’ ఆఫర్‌ను ప్రకటించింది.

ఉపాధ్యాయులకు ప్రత్యేక అవకాశం

సెప్టెంబరు 1 నుంచి 25 వరకు..



రామోజీ ఫిల్మ్‌సిటీ, న్యూస్‌టుడే : ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్‌సిటీ ప్రత్యేకంగా ‘టీచర్స్‌ డే’ ఆఫర్‌ను ప్రకటించింది. సెప్టెంబరు 1 నుంచి 25 వరకు ఉపాధ్యాయులు ఈ ప్రత్యేక ఆఫర్‌తో ఈ టూర్‌ను ఆస్వాదించవచ్చు. ఒక్కరికి రూ.1,099 (పన్నులు అదనం) చెల్లించి ఉపాధ్యాయులు సినీ జగత్తు, ప్రకృతి రమణీయ ఫిల్మ్‌సిటీ అందాలను ప్రత్యేకంగా వీక్షించొచ్చు. సినిమాల చిత్రీకరణలకు ఉపయోగించే సెట్లను సందర్శించవచ్చు. ఇక్కడి అందాలను కనులారా వీక్షించి ఆనందించేందుకు అవకాశం ఉంటుంది.



మరచిపోలేని అనుభూతిని పొందాలనుకునే ఉపాధ్యాయులు ఫిల్మ్‌సిటీ సందర్శనకు తరలివచ్చేందుకు ఇదే మంచి అవకాశం. ఈ ఆఫర్‌ అడ్వాన్స్‌ ఆన్‌లైన్‌ బుకింగ్‌లకు మాత్రమే ఉంటుంది. ఈ ఆఫర్‌లో సందర్శనకు రావాలనుకునే ఉపాధ్యాయులు తమ గుర్తింపు కార్డును చూపాల్సి ఉంటుంది. మరింత సమాచారం కోసం.. www.ramojifilmcity.com లో లాగిన్‌ అవ్వండి. లేదా 76598 76598 , 80086 07026 నంబర్లకు ఫోన్‌ చేసి వివరాలు పొందవచ్చు.

ఇవి కూడా చదవండి :


ఏపీ టీచర్స్ టివి:



 
 

Recent Posts

See All

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యాయుల బదిలీ నియంత్రణ చట్టం, 2025 (డ్రాఫ్ట్)

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యాయుల బదిలీ నియంత్రణ చట్టం, 2025 (డ్రాఫ్ట్) ప్రకటన: భారత గణరాజ్యంలోని డెబ్బై ఆరవ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్...

Commentaires


bottom of page