Govt Teachers: ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్.. న్యూ ఇయర్ గిఫ్ట్ రెడీ..
Govt Teachers: ప్రభుత్వ టీచర్లకు తీపికబురు అందింది. కొత్త ఏడాదికి ముందు వాళ్లకు ఓ గిఫ్ట్ రెడీ అయిపోయింది. న్యూ ఇయర్ ముందు ఇది ఉపాధ్యాయులకు బంపర్ న్యూస్ అనే చెప్పాలి.

AP Govt: ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ స్కూళ్లలో పనిచేసే టీచర్లు చాన్నాళ్లుగా ఓ తీపికబురు కోసం ఎదురు చూస్తున్నారు. ఎప్పుడెప్పుడు ప్రభుత్వం నుంచి గుడ్ న్యూస్ అందుతుందా అని వెయిట్ చేస్తున్నారు. ఎట్టకేలకు ఆ క్షణం వచ్చేసింది. టీచర్లకు సర్కారు శుభవార్త చెప్పేసింది. త్వరలో న్యూ ఇయర్ నేపథ్యంలో వాళ్ల కోసం ఓ గిఫ్ట్‌ను రెడీ చేసింది. అదే పదోన్నతులు. టీచర్ల ప్రమోషన్ల ప్రక్రియను పాఠశాళ విద్యాశాఖ మొదలుపెట్టింది. ఈ మేరకు ఏపీవ్యాప్తంగా స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు అర్హులైన సెకండరీ గ్రేడ్ టీచర్ల లిస్ట్‌ను అధికారులు ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తీసుకొచ్చారు.
మరో తీపికబురు
ప్రమోషన్ల ప్రక్రియకు సంబంధించి శనివారం సాయంత్రం 3 గంటల లోపు ఏదైనా అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలని జిల్లా విద్యాశాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ విషయాన్ని టీచర్లు గమనించాలని సూచించారు. మొత్తానికి ఈ విధంగా కొత్త ఏడాదికి ముందు మున్సిపల్ స్కూళ్లలో పనిచేసే ఉపాధ్యాయులకు సర్కారు నుంచి తీపికబురు అందింది. కాగా, మున్సిపల్ పాఠశాలలకు సంబంధించి ఇటీవల కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మున్సిపల్ స్కూళ్లలో కారుణ్య నియామకాలకు రూటు క్లియర్ చేసింది.
ఆ నియామకాలకు లైన్ క్లియర్!
మున్సిపల్ పాఠశాలలకు సంబంధించిన కారుణ్య నియామకాల అమలుపై ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. ఈ నియామకాల అమలుకు చర్యలు తీసుకోవాలని విద్యా శాఖ అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. ఈ తరహా నియామకాలకు సంబంధించి రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో అనారోగ్యానికి గురైన, మృతి చెందిన టీచర్ల కుటుంబసభ్యుల దరఖాస్తుల మీద చర్యలు తీసుకోవాలని ఉత్తర్వుల్లో సూచించింది. ఏపీవ్యాప్తంగా ఉన్న మొత్తం 2,114 పురపాలక పాఠశాలల్లో ఉపాధ్యాయులకు ఈ రూల్స్ వర్తిస్తాయని సర్కారు ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.
Recent Posts
See Allఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యాయుల బదిలీ నియంత్రణ చట్టం, 2025 (డ్రాఫ్ట్) ప్రకటన: భారత గణరాజ్యంలోని డెబ్బై ఆరవ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్...
Comentários