top of page

CSE With Teachers: ఉపాధ్యాయ సంఘాలతోఈ వారపు కమీషనర్ సమావేశం

CSE Meeting with recognised teachers unions News



Teachers union meeting with director of school education

CSE With Teachers: ఉపాధ్యాయ సంఘాలతోఈ వారపు కమీషనర్ సమావేశం - నిర్ణయాలు


  • పదవ తరగతి పరీక్షా ఫలితాలు ఈనెల 20 లేదా 23న విడుదల


  • టీచర్స్ హ్యాండ్ బుక్ ఏర్పాటు చేస్తారు.


  • ఈనెల 21 నుండి 23 వరకు అంగన్వాడీ నుండి ఒకటవ తరగతిలో, ఐదవ తరగతి నుండి ఆరవ తరగతికి, ఏడవ తరగతి నుండి ఎనిమిదవ తరగతికి ట్రాన్సిషన్ పూర్తి చేయాలి


  • డీఎస్సీ కి ముందే ప్రమోషన్లు పూర్తి చేస్తారు


  • ఈనెల 20వ తేదీ నాటికి సీనియార్టీ లిస్టులు ఫైనలైజ్ కావాలి


  • బదిలీలలొ వైద్య కారణాలతో ప్రాధాన్య కేటగిరీ కోరుకునేవారి కోసం ఈనెల 25, 26, 27 తేదీల్లో ఉమ్మడి జిల్లాలలో ప్రత్యేకంగా మెడికల్ బోర్డు ఏర్పాటు చేస్తారు


  • ఎట్టి పరిస్థితులలో ఈ నెల 28 లేదా 30వ తేదీ నాటికి HM ట్రాన్స్ఫర్లకి రంగం సిద్ధం చేస్తారు


  • ఈనెల 15వ తేదీన (రెండవ రౌండ్) సీనియార్టీ లిస్టులు అందుబాటులో ఉంచుతారు. ఫిర్యాదులకు ఐదు రోజులు అవకాశం ఇస్తారు


  • ఇంటర్ సీనియార్టీ చూసేటప్పుడు సవార్డినేట్ సర్వీస్ రూల్స్ 36(3) అనుసరించాలి


  • కౌన్సిలింగ్ ప్రక్రియ మొత్తం వెబ్ ఆప్షన్స్ ద్వారానే జరుగుతుంది. మాన్యువల్ కౌన్సిలింగ్ లేదు


  • వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకునేటప్పుడు సేవ్ ఆప్షన్ ఇవ్వాలని అడగడం జరిగినది. డైరెక్టర్ గారు వెంటనే టెక్నికల్ టీం తో మాట్లాడి అంగీకరించారు




  • LEAP యాప్ ఈనెల 15 నాటికి అందుబాటులోకి వస్తున్నది

  • LEAP ద్వారా మొత్తం సర్వీసెస్ చేసేవిధంగా రూపొందిస్తామన్నారు


  • Old High School Plus 294 schools కొనసాగుతాయి


  • New High School Plus 210 schools కొనసాగించుటలేదు

  • విద్యార్థులు పైతరగతులలో అడ్మిషన్ కావడానికి (Transisition) 15-20 తేదీలలో MEOలతో సమావేశం ఏర్పాటు చేసి పూర్తి చేయుటకు చర్యలు తీసుకొంటామన్నారు

  • సీనియారిటీ జాబితా తయారిలో ఉన్న 610 పై వచ్చిన వారు,అంతర్ జిల్లా బదిలీలపై వచ్చిన వారు,యాజమాన్యం మారిన వారి విషయమై స్పష్టత ఇస్తామన్నారు.610 వారి విషయమై డియస్సీ ఆధారంగా ఆయా డియస్సీ జాబితాలో చివరన ఉండాలని,అంతర్ జిల్లా‌ మరియు యాజమాన్యం ‌మారిన వారికి డేట్ ఆఫ్ జాయినింగ్( మారిన జిల్లా) ప్రాతిపదికగా ఉండాలని సూచన చేశారు

  • 900 హైస్కూల్స్ పరిధిలో ఉన్న 3,4,5 తరగతులను వెనుకకు పంపే సందర్భంలో కమ్యూనిటీ పరంగా విద్యార్థులు విడిపోయి సింగిల్ టీచర్ స్కూల్ కు వెళ్ళాల్సివస్తున్నందున ఉన్నత పాఠశాలల ఆవరణలోనే 1-5 తరగతులతో బేసిక్ స్కూళ్ళను కొనసాగించే ఆలోచన ఉన్నట్లు తెలియజేశారు

  • మున్సిపల్ పాఠశాలలో పోస్టులను అప్ గ్రేడ్ చేస్తామన్నారు

  • త్వరలోనే డియస్సీ నోటిఫికేషన్ ఇస్తామని తెలియజేశారు


  • కమ్యూనిటీ అభ్యంతరాల కారణంగా హై స్కూల్ నుండి మూడు నాలుగు ఐదు తరగతులు వెనుకకు వచ్చిన MPS ఏర్పాటు వీలుకాని పక్షంలో మూడు నాలుగు ఐదు తరగతులు అదే హైస్కూల్లో ఉంచి 1,2 తరగతులు కూడా ఓపెన్ చేసి ఒకటి నుండి పది తరగతులను హైస్కూల్లో నిర్వహిస్తారు.ఈ సందర్భంలో ఆ ఊరిలో ఉన్న ఫౌండేషన్ స్కూల్స్ కొనసాగుతాయి


  • మోడల్ స్కూల్ టీచర్ల బదిలీల గురించి డైరెక్టర్ ని అడగగా ప్రస్తుతం జరుగుతున్న ప్రక్రియ మొత్తం అయిన తర్వాత జూన్ జూలైలో ఆలోచిస్తామన్నారు

  • ఈరోజు జరిగిన సమావేశంలో విద్యాశాఖ డైరక్టరు వి.విజయరామరాజు ,అడిషనల్ డైరక్టరు ఎ.సుబ్బారెడ్డి ,జాయింట్ డైరెక్టర్లు ఎస్.అబ్రహాం ,శైలజ పాల్గొన్నారు





 
 
 

Recent Posts

See All
పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ గారి సమావేశంలో ముఖ్యాంశాలు

పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ గారి సమావేశంలో ముఖ్యాంశాలు ఈరోజు జరిగిన గౌ|| డైరెక్టర్ గారి సమావేశంలో పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ శ్రీ వి....

 
 
 

Commentaires


bottom of page