chandrababu: పాఠశాలల్లో 'వాటర్ బెల్’ విధానం అమలు చేయాలి: చంద్రబాబు ఆదేశం
- AP Teachers TV
- Mar 24
- 1 min read
chandrababu: పాఠశాలల్లో 'వాటర్ బెల్’ విధానం అమలు చేయాలి: చంద్రబాబు ఆదేశం

ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా తాగునీటి ఎద్దడి కనిపించకూడదని ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) అధికారులను ఆదేశించారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా తాగునీటి ఎద్దడి
కనిపించకూడదని ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) అధికారులను ఆదేశించారు. నిత్యం నమోదవుతున్న ఉష్ణోగ్రతల సమాచారాన్ని మొబైల్ అలర్ట్స్ ద్వారా ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేయాలన్నారు. ఈ మేరకు వేసవి ప్రణాళికపై డిజాస్టర్ మేనేజ్మెంట్, పంచాయతీ రాజ్, మున్సిపల్, వైద్యారోగ్య శాఖల అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. ముందస్తు జాగ్రత్తలతో తీసుకోవడం ద్వారా వడదెబ్బ మరణాలు తగ్గించాలన్నారు. తీవ్ర వడగాలులు వీచే అవకాశమున్న ప్రాంతాల్లో మజ్జిగ కేంద్రాలు, చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని చెప్పారు. పాఠశాలల్లో వాటర్ బెల్ విధానం అమలు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అడవుల్లో అగ్నిప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలని..
ఎప్పటికప్పుడు డ్రోన్లతో పరిస్థితిని పర్యవేక్షించాలని సీఎం సూచించారు.
Comments