CBSE: సీబీఎస్‌ఈ ఆకస్మిక తనిఖీలు.. వెలుగులోకి ‘డమ్మీ’ విద్యార్థులు!

దేశంలోని పలు పాఠశాలల్లో సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) ఆకస్మిక తనిఖీలు చేపట్టింది.
దిల్లీ: దేశంలోని పలు పాఠశాలల్లో సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) ఆకస్మిక తనిఖీలు చేపట్టింది. ‘డమ్మీ’ విద్యార్థుల నమోదును పరిశీలించేందుకు బుధ, గురువారాల్లో దిల్లీ, బెంగళూరు, వారణాసి, బిహార్, గుజరాత్, ఛత్తీస్‌గఢ్‌లలో 29 పాఠశాలల్లో తనిఖీలు నిర్వహించింది. ఈ అంశంపై సీబీఎస్‌ఈ కార్యదర్శి హిమాన్షు గుప్తా మాట్లాడుతూ.. సీబీఎస్‌ఈ ఆఫీసర్, అనుబంధ పాఠశాల ప్రిన్సిపాల్‌తో కూడిన 29 బృందాలు తనిఖీల్లో పాల్గొన్నాయన్నారు.
అనేక పాఠశాలల్లో వాస్తవిక హాజరు రికార్డులకు మించి విద్యార్థులను ఎన్‌రోల్ చేయడం ద్వారా బోర్డు నిబంధనలను వారంతా ఉల్లంఘిస్తున్నట్లు గుర్తించామన్నారు. మౌలిక సదుపాయాల కల్పన విషయంలో అనేక ఉల్లంఘనలు చోటుచేసుకున్నాయని హిమాన్షు గుప్తా తెలిపారు. నిబంధనలు పాటించకపోవడాన్ని బోర్డు తీవ్రంగా పరిగణించి.. ఆయా పాఠశాలలకు షోకాజ్ నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమవుతోందన్నారు. చట్టపరమైన చర్యలు తీసుకొనే అంశాన్ని సైతం పరిశీలిస్తున్నట్లు తెలిపారు.
నిబంధనలు ఉల్లంఘించిన పాఠశాలల జాబితాలో దిల్లీలోనే 18 ఉండగా.. వారణాసిలో మూడు, బెంగళూరు, పట్నా, అహ్మదాబాద్, బిలాస్‌పుర్‌లలో రెండు చొప్పున ఉన్నయని తెలిపారు. ఇంజినీరింగ్, మెడిసిన్ వంటి ప్రవేశ పరీక్షలకు సిద్ధమయ్యే అనేకమంది విద్యార్థులు డమ్మీ పాఠశాలల వైపు ఆసక్తి చూపుతుంటారు. రెగ్యులర్‌గా తరగతులకు వెళ్లకుండా నేరుగా బోర్డు పరీక్షలకే హాజరై తమ దృష్టంతా పోటీ పరీక్షలపైనే పెట్టేలా ఈ స్కూళ్లు విద్యార్థులకు అవకాశం కల్పిస్తుంటాయి.
Recent Posts
See Allఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యాయుల బదిలీ నియంత్రణ చట్టం, 2025 (డ్రాఫ్ట్) ప్రకటన: భారత గణరాజ్యంలోని డెబ్బై ఆరవ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్...
Kommentare