top of page

APPSC: ఏపీపీఎస్సీ ప్రకటించిన ఉద్యోగ నోటిఫికేషన్ల పరీక్ష తేదీలు ఇవే..!

Writer's picture: AP Teachers TVAP Teachers TV

అమరావతి: ఉద్యోగ నోటిఫికేషన్ల పరీక్ష తేదీలను ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (APPSC) శుక్రవారం ప్రకటించింది. 8 నోటిఫికేషన్లకు సంబంధించి ఏప్రిల్‌లో పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది. ఆన్‌లైన్‌ విధానంలో ఏప్రిల్‌ 27 నుంచి 30 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు




8 నోటిఫికేషన్లకు ఉమ్మడిగా ‘జనరల్‌ స్టడీస్‌

ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఓ కొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. గతంలో జారీచేసిన ఎనిమిది నోటిఫికేషన్లకు రాత పరీక్షలను వచ్చే ఏప్రిల్‌ 27 నుంచి అదే నెల 30వ తేదీ వరకు నిర్వహిస్తామని ప్రకటించింది.


అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఓ కొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. గతంలో జారీచేసిన ఎనిమిది నోటిఫికేషన్లకు రాత పరీక్షలను వచ్చే ఏప్రిల్‌ 27 నుంచి అదే నెల 30వ తేదీ వరకు నిర్వహిస్తామని ప్రకటించింది. ఈ ఎనిమిది పరీక్షల్లో ‘పేపరు-1’గా ఉండే జనరల్‌ స్టడీస్, మెంటల్‌ ఎబిలిటీ పేపరును మాత్రం ఉమ్మడిగా ఏప్రిల్‌ 28వ తేదీ ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహిస్తామని వెల్లడించింది. ఒకే సిలబస్‌తో పరీక్ష నిర్వహిస్తున్నందున అభ్యర్థుల సన్నద్ధతకు సమయం ఆదా కావడంతోపాటు ప్రశ్నపత్రం రూపకల్పన, మూల్యాంకనం సులువుగా ఉంటుందని ఏపీపీఎస్సీ ఛైర్‌పర్సన్‌ అనురాధ తెలిపారు. 


పరీక్షలు జరగనున్న నోటిఫికేషన్లు ఇవే..

అసిస్టెంట్‌ డైరెక్టర్‌ (టౌన్‌ ప్లానింగ్‌), లైబ్రేరియన్‌ (వైద్య ఆరోగ్యశాఖ), అసిస్టెంట్‌ ట్రైబల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్, అసిస్టెంట్‌ డైరెక్టర్‌ (దివ్యాంగుల సంక్షేమశాఖ), అసిస్టెంట్‌ కెమిస్ట్‌ (భూగర్భ నీటిపారుదల), అసిస్టెంట్‌ ఎలక్ట్రికల్‌ ఇన్‌స్పెక్టర్‌ (ఏపీ ఎలక్ట్రికల్‌ ఇన్‌స్పెక్టరేట్‌ సర్వీస్‌), అసిస్టెంట్‌ స్టాటిస్టికల్‌ ఆఫీసర్‌ (ఎకనామిక్స్‌ అండ్‌ స్టాటిస్టిటికల్‌), ఫిషరీస్‌ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌ (ఫిషరీస్‌ సర్వీసెస్‌) ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్లు గతేడాది వెలువడ్డాయి. వీటికి అనుగుణంగా కంప్యూటర్‌ ఆధారిత రాత పరీక్షలు కృష్ణా, విశాఖపట్నం, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో జరుగుతాయని ఏపీపీఎస్సీ తెలిపింది. పూర్తి వివరాల కోసం https://portal-psc.ap.gov.in లో చూడాలని ఏపీపీఎస్సీ తెలిపింది. 



1:100 నిష్పత్తిలో అభ్యర్థులకు అవకాశం కల్పించాలి 

గ్రూపు-1 ప్రధాన పరీక్ష రాసేందుకు ప్రిలిమ్స్‌ ద్వారా 1:100 నిష్పత్తిలో అభ్యర్థులకు అర్హత కల్పించాలని పలువురు అభ్యర్థులు ఏపీపీఎస్సీని కోరుతున్నారు. గ్రూపు-2, డిప్యూటీ ఎడ్యుకేషనల్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి 1:100 నిష్పత్తి విధానాన్ని అనుసరించారని తెలిపారు. తెలంగాణలో 31 వేల మందికి గ్రూపు-1 ప్రధాన పరీక్ష రాసేందుకు అర్హత కల్పించారని గుర్తుచేశారు.  


పాలిటెక్నిక్‌ లెక్చరర్ల నోటిఫికేషన్‌ను పునఃపరిశీలించాలి 

ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలల్లో.. క్యారీఫార్వర్డ్‌ లెక్చరర్ల పోస్టుల భర్తీకి జారీచేసిన 13/2023 నోటిఫికేషన్‌పై పునఃపరిశీలన జరపాలని పలువురు అభ్యర్థులు ఏపీపీఎస్సీ ఛైర్‌పర్సన్‌కు విజ్ఞప్తి చేశారు. గతేడాది ఆగస్టులో జారీ చేసిన ప్రభుత్వ ఉత్తర్వులకు విరుద్ధంగా మహిళలకు రోస్టర్‌ పాయింట్లు కేటాయించారన్నారు. ఈ విధానంపై పునఃపరిశీలన జరిపి, పురుష అభ్యర్థులకు నష్టం జరగకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. 





 
 

Recent Posts

See All

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యాయుల బదిలీ నియంత్రణ చట్టం, 2025 (డ్రాఫ్ట్)

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యాయుల బదిలీ నియంత్రణ చట్టం, 2025 (డ్రాఫ్ట్) ప్రకటన: భారత గణరాజ్యంలోని డెబ్బై ఆరవ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్...

Comments


bottom of page