top of page

AP Inter Hall tickets| ఏపీ ఇంటర్‌ హాల్‌టికెట్లు విడుదల.. వాట్సప్‌లో డౌన్‌లోడ్‌ ఇలా!

Writer's picture: AP Teachers TVAP Teachers TV

ఏపీలో ఇంటర్‌ పరీక్షలకు హాల్‌టికెట్లు విడుదలయ్యాయి.

ఏపీలో ఇంటర్‌ పరీక్షలకు హాల్‌టికెట్లు విడుదలయ్యాయి.
ఏపీలో ఇంటర్‌ పరీక్షలకు హాల్‌టికెట్లు విడుదలయ్యాయి.

Inter Exam Hall Tickets Download | ఇంటర్నెట్‌ డెస్క్‌: ఏపీలో ఇంటర్ పరీక్షలకు హాల్‌టికెట్లు(AP Inter Halltickets 2025) విడుదలయ్యాయి. మార్చి 1, 3వ తేదీల నుంచి ప్రారంభం కానున్న ప్రథమ, ద్వితీయ ఇంటర్‌ పరీక్షల హాల్‌టికెట్లను విద్యార్థులు కాలేజీ లాగిన్‌లతో పాటు వాట్సప్‌ గవర్నెన్స్‌లో భాగంగా ‘మనమిత్ర’ ద్వారా పొందొచ్చని ఇంటర్‌ బోర్డు కార్యదర్శి ఓ ప్రకటనలో తెలిపారు. అలాగే, ఇంటర్‌ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌ నుంచి కూడా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఇటీవల ప్రాక్టికల్‌ పరీక్షల హాల్‌టికెట్లను వాట్సప్‌ ద్వారా డౌన్‌లోడ్‌ చేసుకొనే సదుపాయం కల్పించిన విషయం తెలిసిందే. ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరం కలిపి దాదాపు 10 లక్షలకు పైగా విద్యార్థులు ఉన్నారు. వాట్సప్‌ నంబరు 95523 00009 ద్వారా హాల్‌టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.


వాట్సప్‌లో హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌ ఇలా..

  • మీ ఫోన్‌లో 95523 00009 నంబర్‌ను సేవ్‌ చేసుకోండి

  • Hi అని వాట్సప్‌ ద్వారా పైన ఇచ్చిన నంబర్‌కు పంపండి

  • సేవను ఎంచుకోండి అనే లింక్‌పై క్లిక్‌ చేయాలి.

  • విద్యా సేవలు సెలక్ట్‌ చేసి క్లిక్‌ చేయండి

  • ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌/సెకండ్‌ ఇయర్‌ హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోండి అనే ఆప్షన్‌ కనబడుతుంది.

  • మీరు ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ విద్యార్థులైతే టెన్త్‌ హాల్‌టికెట్‌/ఆధార్‌ నంబర్‌, పుట్టిన తేదీ వివరాలను ఎంటర్‌ చేసి హాల్‌టికెట్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. 

  • సెకండ్‌ ఇయర్‌ విద్యార్థులైతే ఫస్ట్‌ ఇయర్‌ హాల్‌టికెట్‌ నంబర్‌/ఆధార్‌ నంబర్‌తో పాటు పుట్టిన తేదీ వివరాలను ఎంటర్‌ చేయాలి. 

  • ఆ తర్వాత కొద్ది నిమిషాలకు హాల్‌టికెట్‌ మీ వాట్సప్‌ నంబర్‌కే వచ్చేస్తుంది. డౌన్‌లోడ్‌ చేసుకొని ప్రింట్‌ తీసుకోండి.


    https://bie.ap.gov.in/theoryhjktahjblltickets




👆 1st Year Link



 
 

Recent Posts

See All

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యాయుల బదిలీ నియంత్రణ చట్టం, 2025 (డ్రాఫ్ట్)

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యాయుల బదిలీ నియంత్రణ చట్టం, 2025 (డ్రాఫ్ట్) ప్రకటన: భారత గణరాజ్యంలోని డెబ్బై ఆరవ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్...

Comentarios


bottom of page