AP Government VSWS : సచివాలయాల ఉద్యోగులకు గుడ్‌న్యూస్
AP Government VSWS : సచివాలయాల ఉద్యోగులకు గుడ్‌న్యూస్
AP Government: సచివాలయాల హేతుబద్దీకరణపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జనాభా ప్రాతిపదికగా గ్రామ, వార్డు సచివాలయాలను హేతుబద్ధీకరించనున్నారు. గత ప్రభుత్వంలో ఏర్పాటైన ఈ వ్యవస్థను గాడిన పెట్టడంతోపాటు పని భారం, జనాభా సంఖ్యను పరిగణనలోకి తీసుకుని సిబ్బందిని సర్దుబాటు చేస్తారు.

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సచివాలయాల హేతుబద్ధీకరణ ప్రారంభమైంది. ఏపీ సేవ పోర్టల్‌లో క్లస్టర్ల ఏర్పాటు, సచివాలయ అనుసంధానం చేయనున్నారు. ఈ మేరకు ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లకు ఏపీ ప్రభుత్వం అధికారాలను అప్పగించింది. ప్రతీ క్లస్టర్ పరిధిలో రెండు నుంచి మూడు సచివాలయాలు ఉండేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సచివాలయాల సిబ్బందిని మూడు కేటగిరీలుగా విభజన చేసింది.
జనాభా ప్రాతిపదికగా హేతుబద్దీకరణ..
కాగా.. జనాభా ప్రాతిపదికగా గ్రామ, వార్డు సచివాలయాలను హేతుబద్ధీకరించనున్నారు. గత ప్రభుత్వంలో ఏర్పాటైన ఈ వ్యవస్థను గాడిన పెట్టడంతోపాటు పని భారం, జనాభా సంఖ్యను పరిగణనలోకి తీసుకుని సిబ్బందిని సర్దుబాటు చేస్తారు. దీనికి సంబంధించి ఏపీ ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన ఉత్తర్వుల్లో భాగంగా ఆయా జిల్లాలో జనాభా సంఖ్య మేరకు సచివాలయాలకు సిబ్బందిని కేటాయిస్తారు. మిగులు సిబ్బందిని సంబంధిత శాఖలకు పంపిస్తారు.
మండలాల వారీగా కసరత్తు..
హేతుబద్ధీకరణ చేసే క్రమంలో 2,500 కంటే తక్కువ జనాభా ఉన్న సచివాలయాల్లో ఆరుగురు, 2,500 నుంచి 3,500 మధ్య ఉన్న సచివాలయాల్లో ఏడుగురు, 3,500 మంది కంటే ఎక్కువ ఉన్న సచివాలయాల్లో ఎనిమిది మంది సిబ్బంది ఉంటారు. ఈ మేరకు మండలాల వారీగా కసరత్తు జరుగుతోంది. సగటున ఒక సచివాలయం పరిధిలో నాలుగువేల కంటే ఎక్కువ జనాభా ఉన్నారని అధికారులు చెబుతున్నారు. మూడు కేటగిరీలుగా విభజించి సిబ్బందిని హేతుబద్ధీకరించాలని నిర్ణయించారు. హేతుబద్ధీకరణ తర్వాత పంచాయతీ కార్యదర్శి/ వార్డు అడ్మినిస్ట్రేటివ్ కార్యదర్శులను గ్రామ/వార్డు హెడ్‌గా పిలుస్తారు. సచివాలయాలపై పర్యవేక్షణకు మండల, జిల్లాస్థాయిలో వేర్వేరుగా కార్యాలయాలు ఏర్పాటు చేసి సిబ్బందిని నియమిస్తారు
Recent Posts
See Allఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యాయుల బదిలీ నియంత్రణ చట్టం, 2025 (డ్రాఫ్ట్) ప్రకటన: భారత గణరాజ్యంలోని డెబ్బై ఆరవ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్...
Commentaires