AP Elections 2024: కూటమి మేనిఫెస్టో వచ్చేసిందహో.. అదిరిపోయిందిగా..!!
వైసీపీ మేనిఫెస్టో (YSRCP Manifesto) విడుదల కావడంతో.. కూటమి (టీడీపీ, జనసేన, బీజేపీ) ఎప్పుడెప్పుడు రిలీజ్ చేస్తుందా..? అని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మంగళవారం ఉదయం 11 గంటలకే విడుదల కావాల్సిన మేనిఫెస్టో కొన్ని అనివార్య కారణాల వల్ల మధ్యాహ్నం 3 గంటలకు రిలీజ్ చేయడం జరిగింది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్.. బీజేపీ ముఖ్యనేతలతో కలిసి మేనిఫెస్టో రిలీజ్ చేశారు.
ఇదిగో ఫుల్ మేనిఫెస్టో.
కీలక హామీలు..
డ్రైవర్లకు రూ. 15 వేలు.. చంద్రన్న భీమా అమలు
ప్రతి కుటుంబానికి జీవిత భీమా
హెల్త్ కార్డ్స్ అందచేస్తాం
విద్యుత్ ఛార్జీలు నియంత్రిస్తాం
చెత్త పన్నును రద్దు చేస్తాం
ఇంటి పన్నులను సమీక్షిస్తాం
ఉచిత ఇసుక విధానం అమలు చేస్తాం
కేజీ టూ పీజీ సిలబస్ రివ్యూ చేస్తాం
విదేశీ విద్యను అందరికీ వర్తింపజేస్తాం
వంద రోజుల్లో గంజాయి, డ్రగ్స్ కంట్రోల్ చేస్తాం
అమరావతిలో ప్రజా రాజధాని నిర్మాణం
ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీలకు అధిక ప్రాధాన్యం
దేవాలయాలు.. బ్రహ్మణుస సంక్షేమానికి పెద్ద పీట
హిందూ ఆస్తుల పరిరక్షణ : చంద్రబాబు
విద్యార్థులు, ఆడపిల్లలు, వలంటీర్లు.. టీచర్లకు శుభవార్త!
ఆడపిల్లల విద్యకు కలలకు రెక్కలు పథకం
చదువు కోసం వడ్డీ లేని రుణాలిస్తాం
అన్నా క్యాంటీన్లు, పండుగ కానుకలు ఇస్తాం
ఉద్యోగులు చాలా నష్టపోయారు..
ఉపాధ్యాయులను మద్యం షాపుల వద్ద నిలబెట్టారు
ఉద్యోగులకు వచ్చే బెనిఫిట్స్ ఏం ఇవ్వడం లేదు
ఉద్యోగుల్లో ఆత్మ విశ్వాసాన్ని.. ఆత్మగౌరవాన్ని పెంచుతాం
పీఆర్సీ ప్రకటిస్తాం.. ఆలోగా ఇంటెరిమ్ రిలీఫ్ ఇస్తాం
సీపీఎస్ రద్దు సమస్యపై కసరత్తు చేసి పరిష్కరిస్తాం
వలంటీర్లకు రూ. 10 వేలు జీతం ఇస్తాం
EWS రిజర్వేషన్ల నుంచి కాపులకు దామాషా పద్దతిన రిజర్వేషన్లు అమలు చేస్తాం
అగ్రవర్ణ పేదలకు న్యాయం చేస్తాం
ఇప్పటికే మంజూరైన ఇళ్ల పట్టాల్లో ఇళ్లు కట్టిస్తాం.
విజయవాడలో హజ్ హౌస్ నిర్మిస్తాం : చంద్రబాబు
ఊహించని రీతిలో పెన్షన్లు పెంపు.. టీడీపీ, బీజేపీ, జనసేన ఉమ్మడి మేనిఫెస్టోను అధినేతలు చంద్రబాబు, పవన్ కల్యాణ్ రిలీజ్ చేశారు. ఇందులో ఒక్కో పథకం ఒక్కో రీతిలో రాష్ట్ర ప్రజలను ఆకట్టుకునేలా ఉంది. మరీ ముఖ్యంగా.. ఇటీవల వైసీపీ మేనిఫెస్టోలో (YSRCP Manifesto) పెన్షన్లు రూ. 3500 పెంచుతామని ప్రకటించిన సంగతి తెలిసిందే. కూటమి మాత్రం ఇంకో 500 రూపాయిలు పెంచుతూ మొత్తం.. 4వేల రూపాయిలు ఇస్తామని ప్రకటించింది. అది కూడా ఏప్రిల్ నుంచే అమలు చేస్తామని కూటమి మేనిఫెస్టోలో ప్రకటించడం జరిగింది. ఇక.. వికలాంగులకు రూ. 6 వేలు, పూర్తి వికలాంగులకు రూ. 10 వేల పెన్షన్ ఇస్తామని కూటమి ప్రకటిచింది. ఈ పెన్షన్ల పెంపు అనేది వైసీపీకి బిగ్ షాకేనని.. ఇది నిజంగా ఊహించని రీతిలో ఉన్నదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్న మాట. బీసీలకు వరాలు..!
కూటమి మేనిఫెస్టో విడుదల
బీసీ సబ్ ప్లాన్ ద్వారా ఐదేళ్లల్లో రూ. 1.50 లక్షల కోట్లు ఖర్చు పెడతాం
బీసీలకు 50 ఏళ్లకే పెన్షన్లు
బీసీ కార్పోరేషన్లను ఆర్థికంగా బలోపేతం చేస్తాం
బీసీల స్వయం ఉపాధి కోసం ఏడాదికి రూ. 10 వేల కోట్లు
ఆధునిక పనిముట్లతో ఆదరణ పథకం అమలు చేస్తాం
పవర్ లూం, హ్యాండ్ లూంలకు కొంత మేర ఉచిత విద్యుత్
మత్స్యకారులను ఆదుకుంటాం
డ్వాక్రా మహిళలకు రూ. 10 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు ఇస్తాం
సంపద సృష్టిస్తాం.. ఆదాయాన్ని పంచుతాం
మేనిఫెస్టో క్లియర్ కట్‌గా చెప్పిన కూటమి పార్టీలు
అదిరిపోయిందిగా..
మేనిఫెస్టో రిలీజ్ కార్యక్రమంలో చంద్రబాబు ప్రసంగం
బీజేపీ దేశ స్థాయిలో మేనిఫెస్టో విడుదల చేసింది
టీడీపీ-జనసేన కసరత్తు చేసి మేనిఫెస్టో రూపకల్పన చేశాం
ప్రజలను గెలిపించేందుకే మా కలయిక
ఈ రాష్ట్రాన్ని కాపాడేందుకే మేం సర్దుబాటు చేసుకున్నాం
20 లక్షల మంది యువతకు ఉపాధి
నెలకు రూ. 3 వేలు చొప్పున నిరుద్యోగ భృతి
మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితం
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం
తల్లికి వందనం ఒక్కో బిడ్డకు రూ. 15 వేలు
స్కిల్ గణన చేపడతాం
ఎంఎస్ఎంఈలకు ప్రొత్సాహాకాలు
10 శాతం EWS రిజర్వేషన్లు అమలు చేస్తాం
సమగ్ర ఇసుక విధానం తెస్తాం
ల్యాండ్ టైటలింగ్ యాక్ట్ రద్దు చేస్తాం
కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినాన్ని అధికారికంగా చేపడతాం
మెగా డీఎస్సీ మీదే తొలి సంతకం పెడతాం: చంద్రబాబు రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి రూ. 25 లక్షల బీమా
టీడీపీ సూపర్ సిక్స్, జనసేన షణ్ముఖ వ్యూహం..
బీజేపీ పేర్కొన్న అంశాలతో మేనిఫెస్టో రూపకల్పన
Recent Posts
See Allనేడు ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు నేడు ప్రభుత్వ గుర్తింపు పొందిన ఉపాధ్యాయ సంఘాలతో పాఠశాల విద్య డైరెక్టర్ వి. విజయరామరాజు చర్చలు జరపనున్నారు....
Comments