AP Cabinet: సీఎం క్యాబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు.. ఏంటో తెలుసా..
అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో జరిగిన క్యాబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇందులో 2024-25 సంవత్సరానికి సంబంధించిన నిధులు, ప్రాజెక్టులు, విద్యా, వ్యవసాయ సంబంధిత పథకాలు సహా పలు అంశాల గురించి చర్చించారు.

ఏపీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో జరిగిన క్యాబినెట్ సమావేశంలో మొత్తం 21 అంశాలు పరిశీలనలోకి వచ్చాయి. ఈ సమావేశం వివరాలను మంత్రి కొలుసు పార్ధసారధి వెల్లడించారు.
జల్ జీవన్ మిషన్:
కేంద్ర ప్రభుత్వం 26,800 కోట్ల రూపాయలతో 77,917 పనులను ఆమోదించింది. వీటి ద్వారా ప్రజలకు త్రాగునీరు అందించబడుతోంది. గత ప్రభుత్వ దుష్ట పాలన కారణంగా ఈ ప్రాజెక్టులపై సరైన దృష్టి పెడకపోవడంతో రాష్ట్రం నష్టపోయింది. కేరళా రాష్ట్రం 70 వేల కోట్ల రూపాయల సమర్థనతో ప్రయోజనాలు పొందగా, ఏపీలో కేవలం 4000 కోట్లు మాత్రమే ఖర్చు అయ్యాయి. ప్రస్తుతం 33,717 ప్రాజెక్టులు వివిధ దశల్లో ఉన్నాయి. వీటి పూర్తి కొరకు అనుమతులు మంజూరు చేసామని మంత్రి పేర్కొన్నారు.
అమరావతి రాజధాని:
గత ప్రభుత్వ అసంబద్ధ నిర్ణయాలతో అమరావతిని రాజధానిగా నిర్మించడంలో చాలా సమయం గడిచింది. ప్రస్తుతం, అమరావతిలో నిర్మాణ పనులు మూడు సంవత్సరాల్లో పూర్తి చేయడానికై చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి తెలిపారు.
ఇతర కీలక నిర్ణయాలు:
ఇంజనీరింగ్ పనులు: 33,137 కోట్ల రూపాయలతో 45 ఇంజనీరింగ్ పనులను చేపట్టేందుకు క్యాబినెట్ ఆమోదం ఇచ్చింది.
గ్రామకంఠం భూములు: భూములు సర్వే రికార్డింగ్, సబ్ డివిజినింగ్‌కు ఫీజులు చెల్లించకుండా చర్యలు తీసుకోవాలని నిర్ణయం.
చిత్తూరు జిల్లా: నూతన కృషి విజ్ఞాన కేంద్రం నిర్మాణానికి అవసరమైన భూమిని ఆచార్య ఎన్జీ రంగా వర్సిటీకి బదిలీ చేయడం.
రుణాలు రీ షెడ్యూల్: వరద ముంపునకు గురైన రైతులకు రుణాలు రీ షెడ్యూల్ చేయడం, స్టాంప్ డ్యూటీ లేకుండా అవకాశం ఇవ్వడం.
పోలవరం ప్రాజెక్టు: ప్యాకేజీ నెంబర్ 3, 5 కింద పోలవరం లెప్ట్ మెయిన్ కెనాల్ పనులకు జుడీషియల్ రివ్యూ లేకుండా అనుమతులు
విద్యా పథకాలు: ప్రభుత్వ జూనియర్ కాలేజీలకు మధ్యాహ్నం భోజనం పథకాన్ని పునరుద్దరించడం, 475 కాలేజీలకు బడ్జెట్ కేటాయింపు.
పాఠ్య పుస్తకాలు: రూ. 32.45 కోట్లు ఖర్చు చేస్తూ పాఠ్య పుస్తకాలు కొనుగోలు చేసి పంపిణీ చేయడం.
ఈ నిర్ణయాలు 2025 మార్చి 31వరకు అమల్లో ఉంటాయని, ఇందుకు కావలసిన చర్యలు తీసుకుంటామని మంత్రి కొలుసు పార్ధసారధి తెలిపారు.
ఏపీ స్టేట్ కోపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ (APSCMS):
2024-25 సంవత్సరంలో 1000 కోట్లు బుణానికి అనుమతి ఇచ్చేందుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఈ మొత్తాన్ని సివిల్ సప్లైస్ శాఖకు అందించి, ధాన్యం కొనుగోలు చేసిన గంటల వ్యవధిలోనే రైతులకు డబ్బులు చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ నిర్ణయంతో రైతుల పాలన, ధాన్యం కొనుగోలులో వేగవంతమైన చర్యలు తీసుకునే అవకాశాలను కల్పిస్తుంది.
పోలవరం ప్రాజెక్టు:
పోలవరం ప్రాజెక్టులో ప్యాకేజీ నెంబర్ 3, 5 కింద లెప్ట్ మెయిన్ కెనాల్ పనులకు జుడీషియల్ రివ్యూ లేకుండా అనుమతి ఇచ్చేందుకు క్యాబినెట్ నిర్ణయించింది. ఈ నిర్ణయంతో పోలవరం ప్రాజెక్టు వేగంగా కొనసాగించేందుకు సహకారం లభిస్తుంది. ఇంతకు ముందు జ్యూడీషియల్ రివ్యూ తప్పనిసరి ఉండగా, ఇప్పుడు చట్టసభల్లో బిల్లు ప్రవేశపెట్టిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
హంద్రీనివా ప్రాజెక్టు:
హంద్రీనివాలో పుంగనూరు కెనాల్‌కు లైనింగ్ చేయాలని ప్రతిపాదనకు పాత రేట్ల ప్రకారం ఆమోదం ఇచ్చారు. దీని కోసం రూ. 482 కోట్లు ఖర్చు చేయాలని నిర్ణయించారు.
మధ్యాహ్న భోజనం పథకం:
475 ప్రభుత్వ జూనియర్ కాలేజీలకు మధ్యాహ్నం భోజనం పథకానికి బడ్జెట్ అంచనాల ప్రకారం కేటాయింపు. ఈ పథకాన్ని పునరుద్దరించడం వల్ల లక్షా 40 వేల మంది విద్యార్థులకు భోజన సదుపాయం అందించబడుతుంది. తద్వారా డ్రాపవుట్ తగ్గే అవకాశం ఉంది.
సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్ధి మిత్ర పథకం: రూ. 32.45 కోట్లు ఖర్చు చేస్తూ పాఠ్య పుస్తకాలను కొనుగోలు చేసి విద్యార్థులకు పంపిణీ చేయాలని నిర్ణయించారు. ఈ పథకం విద్యార్థుల అభ్యాసానికి సహకారం అందిస్తుంది.
నైతిక విలువల క్లాసులు: చాగంటి కోటేశ్వరరావుతో నైతిక విలువల గురించి అవగాహన కల్పించే తరగతులు పాఠ్యాంశంలో ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. ఈ నిర్ణయాలు 2024-25 సంవత్సరానికి సంబంధించినవి, రైతులు, విద్యార్థులు, పౌరులకు ఉన్న అవకాశాలను పెంచేలా రూపకల్పన చేయబడ్డాయి.
Recent Posts
See Allఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యాయుల బదిలీ నియంత్రణ చట్టం, 2025 (డ్రాఫ్ట్) ప్రకటన: భారత గణరాజ్యంలోని డెబ్బై ఆరవ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్...
Commentaires