25 ఏళ్ల సర్వీసు నిండిన ఉద్యోగుల వివరాలు సేకరణ: డాక్యుమెంట్లు: ఎందుకు సేకరిస్తోంది? వివరణ.
పెన్షన్ నిర్ణయ జాప్యం నివారించుటకు 25 years service పూర్తి చేసుకున్న ఉద్యోగులు అందరూ తమ SR లను AG తో వెరిఫై చేయించుకోవాలన్న ఉత్తర్వులు:
సందేహం: ప్రభుత్వం - ఖజానా శాఖ ద్వారా 25 సం"ల సర్వీస్ పూర్తి చేసిన ఉద్యోగుల వివరాలు, ఎందుకు సేకరిస్తున్నారు,/ రిటైర్మెంట్ కు ఇంకా చాలా సమయం వున్న SR ను అప్పుడే AG ఆఫీస్ (Accountant General) కి పంపాలి అంటున్నారు దేనికోసం..!?
వివరణ:- నిన్నటి దినం, రాష్ట్ర ఖజానా శాఖ అధికారులు జారీ చేసిన ఉత్తర్వులు - రాష్ట్రంలో 25 సం"ల సర్వీస్ పూర్తి చేసిన ఉద్యోగుల వివరాల సమాచార నిమిత్తం..
👉 రిటైర్డ్ అయిన ఉద్యోగుల, పెన్షన్ fixation ఆర్డర్స్ (first pay) జారీలో జరుగుతున్న జాప్యాన్ని నివారించడానికి.
👉 25 సం" ల సర్వీస్ పూర్తి చేసిన ఉద్యోగుల వివరాల ద్వారా రిటైర్మెంట్ దగ్గర వున్న ఉద్యోగుల సంఖ్య, ఏ సంవత్సరం ఎంత మంది రిటైర్డ్ అవుతారు అనే సమాచార నిమిత్తం.
👉 ఇలా నిక్షిప్తం చేసిన సమాచారం ద్వారా రిటైర్మెంట్ తేదీకి, అకౌంటెంట్ జనరల్ ఆఫీస్ నుంచే ఫస్ట్ పే పెన్షన్ ఆర్డర్ ఇవ్వడానికి.
ఆ విధంగా సాఫ్ట్వేర్ ను వృద్ధిపరిచి అందుబాటులో ఉంచుతారు.
👉 నిర్ధిష్టంగా భవిష్యత్ కాలంలో రిటైర్డ్ అయ్యే వారి సౌలభ్యం కోసం మాత్రమే...
డాక్యుమెంట్లు
Comments